Home /News /andhra-pradesh /

KURNOOL FARMERS WAITING FOR FIRST RAINS BECAUSE THEY WANT SEARCHING FOR DIAMONDS IN ANDHRA PRADESH NGS

Diamonds Searching: తొలకరి వర్షాలతో అక్కడ సంబరాలు.. వజ్రాల అన్వేషణ కోసం సై అంటున్న జనం..

వజ్రాల వేటలో రైతలు బిజీ

వజ్రాల వేటలో రైతలు బిజీ

Diamonds Searching: సాధారణంగా తొలకరి పలకరింపు ఎప్పుడు ఉంటుందా అని రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఎందుకంటే.. రుతుపవనాలు త్వరగా వస్తే.. ఏరువాక ప్రారంభించొచ్చని భావిస్తుంటారు.. కానీ ఆ ప్రాంతంలో ఏరువాకా సాగాలని ఎదురుచూస్తున్నారు అనుకుంటే పొరపాటే.. వారు ఆశగా ఆలోచిస్తోంది వజ్రాల అన్వేషణ కోసమే.

ఇంకా చదవండి ...
  Diamonds Searching: అక్కడి రైతులంతా.. తొలికరి వర్షాలు ఎప్పుడు ఎప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. తొలకరి జల్లులు కురిస్తే.. ఏరువాకా (Eruvaka)  సాగాలని భావిస్తారని అనుకుంటే బురదలో కాలేసినట్టే.. కారణం ఏంటి అనుకుకుంటున్నారా..? తొలకరి వర్షాలు కురిస్తే చాలు రాయలసీమ జిల్లాలైన కర్నూలు (kurnool), అనంతపురం (Anantapuram) జిల్లాలలో ప్రజలు వజ్రాల కోసం వేట మొదలు పెడతారు. మతను అదృష్టలక్ష్మి వజ్రాల (Diamonds) రూపంలో తలుపు తట్టే అవకాశం ఉంటుందని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. కర్నూలు, అనంతపురం జిల్లాలలోఇప్పటికే ఈ వజ్రాల వేట మొదలైంది. మొన్న బంగాళాఖాతం (Bay of Bengal) లో ఏర్పడిన అల్ప పీడన కారణంగా ఏర్పడిన అసని తుఫాను (Asani Cyclone Effect) ప్రభావంతో అడపా దడపా వర్షాలు కురసాయి. దీంతో జనం రంగంలోకి దిగారు. వజ్రాలు దొరికే  సీమ జిల్లాలలో ప్రజలు చాలా మంది పిల్లాపాపలతో వజ్రాల కోసం అన్వేషణ మొదలుపెట్టారు కూడా.. పత్తికొండ నియోజకవర్గంలో ఇప్పటికే జనాలు వజ్రాల వేటలో నిమగ్నమయ్యారు. రోజంతా పొలంలోనే ఉండి తళతళ మెరిసే రాళ్ల కోసం, వజ్రాల కోసం వెతుకుతున్నారు. వజ్రం బరువు, రంగు, జాతిని బట్టి క్యారెట్ లలో లెక్కగట్టి డబ్బులు ఇస్తారు. స్థానికులే కాదు, ఇతర ప్రాంతాల నుండి వజ్రాల కోసం అన్వేషణ వజ్రాల కోసం అన్వేషణ ప్రతీ సంవత్సరం జరిగేదే అయినా ఈ సంవత్సరం కాస్త ముందుగా వజ్రాల వేట ప్రారంభించారు.

  ఈ సారి స్థానికంగా ఉండే ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల నుండి కూడా ప్రజలు వజ్రాల అన్వేషణ కోసం భారీగా వస్తున్నారు. అలా దొరికిన వాటిని తక్కువడే సొంతం చేసుకోవాలని లెక్కలతో వజ్రాల వ్యాపారులు సైతం.. రాయలసీమ జిల్లాలలో మకాం వేస్తున్నట్టు సమచారం. అందుకే వారంతా తొలకరి త్వరగా పలకరించాలని ఆశపడుతున్నారు. ఇప్పటి వరకు అయితే ప్రస్తుతం అక్కడ వజ్రాలు దొరికినట్టు ఎవరూ చెప్పడం లేదు. అయినా ఆశతో వాటి కోసం అన్వేషిస్తూనే ఉన్నారు. స్థానికులు.. ఒక్క వర్షం పడినా చాలు తమ పంట పండినట్టే అనే సంబర పడుతున్నారు.

  ఇదీ చదవండి : టీడీపీతో బీజేపీ పొత్తు..! తేల్చి చెప్పనున్న బీజేపీ జాతీయ అధిష్టానం.. ఏపీకి నడ్డా..?

  గతంలో కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం పగిడిరాయి, బొల్లవానిపల్లె పొలాల్లో ఇద్దరికి రెండు వజ్రాలు లభ్యమయ్యాయి. ఇక అనంతపురంలోనూ అనేక మంది రైతులకు వజ్రాలు లభించాయి. గతేడాది ఓ రైతుకు అత్యంత ఖరీదైన వజ్రం లభ్యం ఇక గతేడాది చిన్న జొన్నగిరికి చెందిన ఒక రైతుకు అత్యంత ఖరీదైన వజ్రం లభించింది. ఆ వజ్రం విలువ కోటి 20 లక్షల రూపాయలు.. ఇప్పటివరకు ఆ ప్రాంతంలో దొరికిన వజ్రాలలో ఇదే అత్యధిక ధర పలికిన వజ్రం. ఇప్పటికే రాయలసీమ జిల్లాలలో వజ్రాలు లభిస్తున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ నిక్షేపాల కోసం అన్వేషణ మొదలుపెట్టింది.

  ఇదీ చదవండి : : రాత్రికి రాత్రే కోటేశ్వరుడైతే..? నీటికోసం వెళ్లిన గొర్రెల కాపరికి ఏం దొరికిందో చూడండి..

  రాయలసీమలో బంగారు నిక్షేపాలు ఉన్నట్లుగా గుర్తించింది. 2013లో బంగారం నిక్షేపాల వెలికితీతకు జియో మైసూర్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అనుమతి ఇచ్చింది. అయితే ఈ వజ్రాల వేట పేరుతో వ్యవసాయానికి ఇబ్బందులు తప్పడం లేదు. దుక్కి దున్ని విత్తనాలు విత్తుకోవాలి అని భావించే రైతులు, వజ్రాల కోసం జనాలు పొలాలలో చేస్తున్న అన్వేషణ లతో ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఏడు వజ్రాల కోసం జరుగుతున్న వేట వ్యవసాయం చేయాలనుకుంటున్న రైతులను ఇబ్బందులకు గురి చేస్తోంది. మరి ఈ సారి ఎవరిని లక్ష్మీ దేవి వరిస్తుందో చూడాలి..
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Anantapuram, Andhra Pradesh, AP News, Farmers, Kurnool

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు