హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kurnool: ఆకాశం నుంచి జాలువారుతోన్న జలపాతం..! వర్షాకాలంలో తప్పక చూడాల్సిన పర్యాటక ప్రాంతం

Kurnool: ఆకాశం నుంచి జాలువారుతోన్న జలపాతం..! వర్షాకాలంలో తప్పక చూడాల్సిన పర్యాటక ప్రాంతం

X
వర్షాకాలంలో

వర్షాకాలంలో చూడాల్సిన అద్భుత జలపాతం

Kurnool: చుట్టూ దట్టమైన అడవి ప్రాంతం… ఎటు చూసినా పచ్చనైన ప్రకృతి.. అందులోనూ పవిత్ర పుణ్యక్షేత్రమైన అహోబిలం.. ఆ రమణీయతకు తోడు మంత్రముగ్ధుల్ని చేస్తున్న జలపాతా అందాలు…ఆహా వర్ణించడానికి పదాలు దొరకనట్లుగా ఆహ్వాదపరుస్తున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Kurnool, India

Murali Krishna, News18, Kurnool.

Kurnool: పర్యాటక ప్రాంతాలు అంటే సాధారణంగా వింటర్ సీజన్ లేదా.. వేసవి సెలవుల్లోనే ఎక్కువగా మనకు కనిపిస్తుంటాయి.. కానీ వర్ష కాలంలోనూ తప్పక చూడని సుందర ప్రాంతాలు కొన్ని ఉన్నాయి.. అలాంటి వాటిలో ఇది ఒకటి.  దట్టమైన అడవి ప్రాంతం… చుట్టూ పచ్చనైన ప్రకృతి.. అందులోనూ పవిత్ర పుణ్యక్షేత్రమైన అహోబిలం… శ్రీ లక్ష్మి నరసింహ స్వామి సన్నిధిలో పర్యాటక ప్రేమికుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్న జలపాతా అందాలు మనసుకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. నిజంగా  వర్ణించడానికి పదాలు దొరకనంత మంత్ర ముగ్ధులను చేస్తున్నాయి.

ఆకాశాన్నికి చిల్లు పడిందన్నట్లుగా ఎత్తయిన కొండల నుండి జాలువారే పాలధార లాంటి జలపాతం పర్యాటకులను కనువిందు చేస్తుంది. ఆళ్ళగడ్డ మండల కేంద్రం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఎగువన ఆహోబిలం ఉంది. ఇక్కడ వర్షాకాలంలో జలపాతాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈ ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంటుంది.

ప్రస్తుతం గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఆలయం ముందు భాగంలో భైరవగుండం వద్ద రెండు కొండల మధ్య నుంచి నీరు పరవళ్లు తొక్కుతోంది. ఆలయం వెనుక బాగంలో అటవీ ప్రాంతంలో రాయిపై నుంచి పడే జలధారతో పాటు మూడు కి.మీ దూరంలోని ప్రహ్లాద బడి వద్ద కొండపై నుంచి దూకుతున్న జలపాతం వీక్షకులను ఆకట్టుకుంటోంది.

ఇదీ చదవండి : ఉద్యోగులకు, పెన్షనర్లకు అదిరిపోయే కానుక.. అధికారిక ఉత్తర్వులు జారీ

4 కి.మీ దూరంలోని జ్వారా ఆలయం వద్ద ఎత్తైన కొండ నుంచి పడుతున్న జలపాతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ప్రకృతి పర్యాటక ప్రేమికులను నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్న అహోబిల క్షేత్ర పరిధిలో లోని జలపాతాల అందాలు ఆకట్టుకుంటూ మైమరపిస్తున్నాయి. ఎగువన ఉక్కు పాదం నుంచి జ్వాలా నరసింహుని ఆలయం మీదగా నల్లమల్ల అడవి ప్రాంతం గుండా బనవాసి నదిగా మారి కొత్తపల్లి మండలం సప్త నదుల సంఘం అయినటు వంటి సంగమేశ్వర తీరంలో కలుస్తున్నాయి.

ఇదీ చదవండి : ఏపీలో జిల్లాలు ఎన్నో పవన్ కు తెలియదా..? మంత్రి స్ట్రాంగ్ కౌంటర్

దట్టమైన అడవిలో ఉండే అహోబిలం క్షేత్ర ప్రాంతాలకు చేరుకునేందుకు వీలుగా వంతెనలతో పాటు మెట్ల మార్గాల ద్వారా కూడా స్వామి వారి సన్నిధికి చేరుకోవచ్చు. అంతే కాకుండా వృద్ధుల కోసం ప్రత్యేకంగా డోలీ సౌకర్యం కూడా కలదు.

ఎలా వెళ్ళాలి...: కర్నూలు నుంచి ఆళ్లగడ్డకు 120 కి.మీ అక్కడి నుంచి 30 కి.మీ ప్రయాణం చేస్తే అహోబిలం చేరుకోవచ్చు. ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఆళ్లగడ్డ నుంచి అహోబిలానికి ఉదయం 5 గంటల నుంచి బస్సులు ఉన్నాయి. అలాగే ప్రైవేట్ వాహనాల్లో కూడా అహోబిలానికి చేరుకోవచ్చు...

First published:

Tags: Andhra Pradesh, AP News, Best tourist places, Kurnool, Local News

ఉత్తమ కథలు