(T. Murali Krishna, News18, Kurnool)
ఇప్పుడు ఉన్న బిజీ పరిస్థితుల్లో కంప్యూటర్లతో ఉదయం నుంచి అలుపెరగని పోరాటం చేస్తూ బిజీ బిజీగా సాయంకాలం వరకు పనిచేస్తూ అలసిపోయి వచ్చేవారు. పట్టణ ప్రాంతాల్లో సాయంకాలం సరదాగా స్నేహితులతో కలిసి నోటికి రుచికరంగా ఉండాలని స్ట్రీట్ ఫుడ్స్ తో కూస్తీపడుతుంటారు. ఈ మధ్యకాలంలో స్ట్రీట్ ఫుడ్స్ కు చాలా ఆదరణ పెరిగింది. సాయంత్రం అయితే చాలు ఉదయం నుంచి బిజీగా గడిపిన వాళ్లంతా స్నేహితులు ఫ్యామిలీలతో కలిసి వీధుల్లో ఉండే స్ట్రీట్ ఫుడ్స్ తినడానికి పోటీ పడుతుంటారు.
ఎక్కడైతే రుచికరమైన స్ట్రీట్ ఫుడ్ లభిస్తుందో అక్కడికి గుంపులు గుంపులుగా చేరుకొని వారికి ఇష్టమైనటువంటి ఆహారాన్ని తింటూ ఉంటారు. ముఖ్యంగా అందులో గోబీ పానీ పూరి కట్లెట్ అంటూ వివిధ రకాలైన ఆహార పదార్థాలను తింటుంటారు. కానీ అందులో రసాయన పదార్థాలు వాడి తయారు చేస్తుంటారు. కానీ ఇక్కడ దొరికే అటుకుల మిక్చర్ పెరగడం మాత్రం మనం ఇంట్లో చేసుకునే విధంగానే కారం మసాలాలు వాడి తయారు చేస్తారు.
కర్నూల్ పట్టణంలోని స్థానిక అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్ సమీపంలోఅటుకుల మిక్చర్ సెంటర్ కి జనాలు క్యూ కడుతున్నారు. సాయంత్రం అయిందంటే చాలు ఇక్కడ దొరికేటటువంటి అటుకులు మిక్సర్ ని తినడానికి జనాలు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా ఈ ఆర్ట్ కమిషనర్ సెంటర్లో లభించే పెరుగప్పడం రుచే వేరే లెవెల్ గా ఉంటుంది. ఈ పెరగపడాన్ని ఆహార ప్రియుల ముందే తయారు చేసి ఇస్తున్నారు నిర్వాహకులు.
ముందుగా అప్పడంపై పుదీనా అల్లం కొత్తిమీర వేసి తయారు చేసినటువంటి పదార్థం పూసి వాటిపై మసాలాలు ఉల్లిపాయలు, బొరుగులు వంటివి వేసి ఆ తరువాత దానిపై లైట్గా పెరుగును వేసి తయారుచేసి ఇస్తారు. ఈ పెరుగు అప్పడాన్ని తినడానికి జనాలు గంటల కొద్దీ వేచి ఉండి మరీ తిని వెళ్లడం చూస్తేనే అర్థమవుతుంది అక్కడ దొరికే తినుబండారాల టెస్ట్ ఏ లెవెల్ లో ఉంటుందో. వీటి ధరలు కూడా సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండడంతో జనాలు వాటినే లొట్టలేసుకుంటూ తింటూ ఉంటారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool, Local News