Murali Krishna, News18, Kurnool
ఈ ఏడాది అధిక వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు అధికంగా పడడంతో పంటలన్నీ నీట మునిగి చేతికొచ్చిన పంటలన్నీ నీటిపాలయ్యాయి. ఆరుగాలం కష్టపడి,అప్పుచేసి పంటలు పండించిన రైతులకు చివరకు కన్నీళ్ళే మిగిలాయి. పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధరలు లేక వాటిని రోడ్లపైనే పారబోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కర్నూలు జిల్లా (Kurnool District) వ్యాప్తంగా. పదివేల ఎకరాలకు పైగా రైతులు టమాట పంటను సాగు చేశారు. వర్షాలు అధికంగా కురవడంతో చాలావరకు పంటలు దెబ్బతిన్నాయి. తాజాగా కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో టమాట ధరలు (Tomato Price today) ఒక్కసారిగా తగ్గిపోయాయి. మూడు రోజుల కింద కిలో రూ.20 నుంచి 25 వరకు ఉన్నాయి. తాజాగా కిలో టమాటాలు 4 రూపాయలు పలుకుతుంది.
ధరలు అమాంతం పడిపోవడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా రైతులు 4 హెక్టార్లలో పంట సాగు చేస్తున్నారు. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతాలైన పత్తికొండ అస్పరి ఆదోని డోన్ ప్రాంతాల్లో అత్యధికంగా సాగు చేశారు. వీరంతా పత్తికొండ మార్కెట్ కు టమాటోలను తీసుకొస్తుంటారు.
సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలో ఆశాజనకంగా ఉన్న టమాటధరలు ఒక్కసారిగా నేల చూపులు చూస్తాయి. ఇటీవల కురిసిన వర్షాలకు సరకు నాణ్యత లోపించడం రవాణాకు అనుకూలంగా లేకపోవడం. ధరల తగ్గుదలకు కారణమవుతుందని వ్యాపారులు చెబుతున్నారు. మూడు ఎకరాల్లో పంట సాగు చేయగా నిత్యం 40 నుంచి 50 గంపల వరకు సరుకు వస్తోంది.
టమాటనుమార్కెట్కు తీసుకురావడానికి ఒక్కో గంపకురూపాయలు రూ.30 చెల్లిస్తున్నాం. టమాటాలు మెుత్తం అమ్మితే.. రూ.2000వచ్చాయని .. అందులో 200 రూపాయలు కమిషన్, ఆటో బాడుగ రూ.1200చెల్లించాల్సి వస్తుంది మిగిలింది 600 రూపాయలు. వాటితో పదిమంది కూలీలకు డబ్బులు ఎలా చెల్లించాలి అంటూ దేవనకొండకు చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool, Local News, Tomato Price