Murali Krishna, News18, Kurnool
ఉమ్మడి కర్నూలు జిల్లా (Kurnool District) లో అక్రమార్కుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. నిరుద్యోగుల ఆశలతో అక్రమార్కుల ఆగడాలకు లెక్కేలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి సచివాలయ ఉద్యోగాల భర్తీ ప్రకటనను చనువుగా తీసుకుని నకిలీ ధ్రువీకరణ పత్రాలు రాజ్యమేలుతున్నాయి. రాష్ట్రంలో లేని భారత్ సేవక్ యోజన బోర్డు పేరుతో జిల్లా కేంద్రంగా ధృవీకరణ పత్రాలు యధేచ్చగా అమ్మకాలు చేస్తున్నారు. ఆన్లైన్లో చూసినా దర్శనమిస్తాయని, ఒరిజనల్ ధ్రువీకరణ పత్రాలంటూ ఏజెంట్లను పెట్టి కోరిన యూనివర్సిటీల పేరుతో నకిలీ పత్రాలు సృష్టిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇప్పటికే వందల సంఖ్యలో నకిలీ సర్టిఫికెట్లు కొనుగోలు చేసినట్లు సమాచారం.
ఈ ఏడాది ఫిబ్రవరిలో సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా 4,765 ఖాళీలున్నట్లు తెలుస్తోంది. వీటికి గతంలో విద్యార్హతగా వెటర్నరీ డిప్లొమో, ఎంఎస్సీ, బీఎస్సీ డెయిరీ సైన్సు, ఇంటర్మీడియట్ ఒకేషనల్ డెయిరీ బోర్డు వారికి అవకాశం కల్పించారు. ఒకేషనల్ ఇంటర్మీడియట్ డెయిరీ కోర్సుకు సంబంధించి ఏపీలో సరిపడా కళాశాలలు లేకపోవడంతో కోర్సు చేసిన అభ్యర్థులు తక్కువగా ఉంటారు.
గత సచివాలయ నోటిఫికేషన్ సమయంలో వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులకు భారత్ సేవక్ సమాజ్ (బీఎస్ఎస్) డిప్లొమో ఇన్ వెటర్నరీ ఇన్ సైన్సు అనే ధ్రువీకరణ పత్రాలను కొందరు డబ్బులకు తెచ్చి దరఖాస్తు చేసుకున్నారు. అయితే ధ్రువీకరణ పత్రాల పరిశీలన సమయంలో ఇవి చెల్లవని చెప్పడంతో కొందరు హైకోర్టును ఆశ్రయించారు. తాము మోసపోయామని, న్యాయం చేయాలని విన్నవించుకోగా.. ఆ ఒక్క నోటిఫికేషన్‌కు మాత్రమే చెల్లుతుందని కోర్టు తీర్పు ఇచ్చింది. ఇలానిరుద్యోగుల ఆశలతో అక్రమార్కులు ఆటాడుకుంటున్నారు.
సచివాలయ ఉద్యోగుల భర్తీ ప్రకటన బూచీగా నకిలీ ధ్రువీకరణ పత్రాలు రాజ్యమేలుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోనే లేని భారత్ సేవక్ యోజన బోర్డు పేరుతో కృష్ణా జిల్లా కేంద్రంగా ధ్రువీకరణ పత్రాలు అంగట్లో పెట్టి అమ్మకాలు చేస్తున్నారు. ఆన్లైన్లో చూసినా దర్శనమిస్తాయని, ఒరిజనల్ ధ్రువీకరణ పత్రాలంటూ ఏజెంట్లను పెట్టి నమ్మబలుకుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇప్పటికే వందల సంఖ్యలో నకిలీ సర్టిఫికెట్లు కొనుగోలు చేసినట్లు సమాచారం.
ఈ ఏడాది ఫిబ్రవరిలో సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా 4,765 ఖాళీలున్నట్లు తెలుస్తోంది. వీటిని ఎరగా వేసి నిరుద్యోగులను నిండా ముంచేస్తున్నారు కొందరు కేటుగాళ్ళు. ఈ తరహాలో జిల్లాలో దాదాపుగా ఒకే ఏడాది 20కి పైగా కేసులు నమోదైనట్లు తెలుస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool, Local News