T. Murali Krishna, News18, Kurnool
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలన్నీ రాజధాని చుట్టూ తిరుగుతున్నాయి. విపక్షాలన్నీ అమరావతే (Amaravati) ఏకైక రాజధాని అంటుంటే..? ప్రభుత్వం మాత్రం మూడు రాజధానులే (Therr Capitals) తమ విధానమంటోంది. కచ్చితంగా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని పదే పదే చెబుతోంది. దానికి ప్రజల మద్దతు కూడా అవసరం అంటూ.. ప్రస్తుతం రాయలసీమలో గర్జన (Rayalaseema Garjana) సభలు నిర్వహిస్తోంది. అయితే రాయలసీమ గర్జన పేరుతో జేఏసీ కాదు వైసీపీ ఆడిన డ్రామా అంటూ బీజేపీ రాయలసీమ అభివృద్ధి కమిటీ చైర్మన్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి (Baireddy Rajasekhar Reddy) మండిపడ్డారు. శ్రీ బాగ్ ఒప్పందం అంటే ఏంటి అందులో ఏ ఏ అంశాలు ఉన్నాయి అనేది ఏంటో కూడా తెలియని అధికార పార్టీ మంత్రులు బుగ్గన కానీ, పెద్దిరెడ్డిల కు కానీ.. ఆ ఒప్పందం గురించి తెలియదు అన్నారు. అందుకే ప్రజల మధ్య ప్రాంతీయ బేధాలు తలెతేలా రెచ్చగొట్టే విధంగా ప్రజలను నయవంచన చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రతిసారి ఎలక్షన్స్ టైం లో ప్రజలను మభ్యపెడుతున్నారే తప్పకనీసం రాయలసీమకు ఏవిధంగా అభివృద్ధి చేస్తే భవిష్యత్తు ఉంటుంది అనేది ఆలోచించడం లేదన్నారు. కనీసం శ్రీ బాగ్ ఒప్పంధం అంటే ఏంటో కూడా తెలియని సన్నాసి దద్దమ్మ మంత్రులు రాయలసీమ గర్జన పేరుతో బడికి పోయే పిల్లలని పట్టుకొచ్చి జనాలను బర్రెలు తొలినట్టు బస్సులో తొలి సభ ప్రాంగణంని తాళమేసి జరుపుతారా ఇది ఒక దుర్మార్గమైన చర్య అంటూ ఫైర్ అయ్యారు.
ఇప్పుడు ఉన్న మంత్రి ఇన్నాళ్లు ఏం చేశామన్నారు. రాయలసీమ వారై ఉండి కనీసం రాష్ట్రం విడిపోతున్నపుడు కానీ రాజధాని అమరావతిలో నిర్మించేటప్పుడు కానీ ఎప్పుడు ఎక్కడ కూడా రాయలసీమ శ్రీ బాగ్ ఒప్పంధం ప్రకారం కర్నూలు రాజధాని చేయాలనీ ఎక్కడ ప్రస్థావించకుండా ఈరోజు కళ్ళబోలి కబుర్లతో ప్రజలను నయవంచన చేస్తున్నారని రాయలసీమ అబివృద్ధి కమిటీ చైర్మన్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి : ఆ జిల్లాల మధ్య జర్నీ ఇక చాలా ఈజీ.. 9వేల కోట్లతో రహదారి నిర్మాణం
రాయలసీమకు నీళ్ళివడంలో కానీ ప్రాజెక్ట్స్ తేవడంలో ఒక్కరు కూడా స్పందించలేదన్నారు. తెలంగాణను రాయలసీమను అనుసంధానం చేసేవిధంగా ఐకానిక్ బ్రిడ్జి అంటారు. ఐకానిక్ బ్రిడ్జి అంటే కూడా ఏందో తెలియని సన్నాసుల్లారా రాయలసీమ అభివృద్ధి చెందాలంటే కావాల్సింది ఐకానిక్ బ్రిడ్జి కాదు.. ప్రాజెక్ట్స్ కట్టి ముందు నీళ్లు ఇవ్వండి సన్నాసుల్లారా అంటూ ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి : అందరి చూపు ఎమ్ మంగీలాల్ వైపే.. ఏంటి అంత ప్రత్యేకత అనుకుంటున్నారా..?
పవిత్రమైన STBC కళాశాల ప్రాంగణం ఒకప్పుడు జవహరలాల్ నెహ్రు తిరిగి కర్నూలు రాజధానిగా ప్రకటించిన స్థలానికి వైసీపీ నాయకులు గర్జన పేరుతో గజ్జికుక్కలా అపవిత్రం చేసిపెట్టారు. ఆ ప్రాంగణాన్ని పాలతో శుద్ధి చేసే కార్యక్రమం చేపడతాం అని తెలిపారు. ఎస్టీబీసీమైదానంను పాలతో కడుగుతాం అని ప్రకటించిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Kurnool, Local News