ప్రజా కోర్టులో నిలబడి వచ్చిన ఓటింగ్ ద్వారా ఉన్నత పదవి అలంకరించి వ్యక్తి. సమాజానికి ఆదర్శప్రాయంగా నిలవాల్సిన అతను... సమాజం తలదించుకునే చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కర్నూలు జిల్లా (Kurnool District) ఎమ్మిగనూరు మునిసిపల్ చైర్మన్ ఇంట్లో అమానుష ఘటన చోటుచేసుకుంది.
ప్రపంచంలోనే మరెక్కడా దొరకని ప్రేమ ఆప్యాయతలు తల్లితండ్రుల వద్దనే చూడగలం. బుడిబుడి అడుగులు వేస్తూన్నా చిన్నారికి చిన్ని గాయం అయితే తల్లి కళ్ళు చెమ్మగిల్లుతాయి. నాన్న హృదయం అల్లాడి పోతుంది. నవ మాసాలు మోసి జన్మనిచ్చిన తల్లి... కొడుకు ఒక్కో మెట్టు ఎక్కుతుంటే కన్నవారి ఆనందానికి అవదులు ఉండవు. తమ బిడ్డ పెద్దయ్యాక మనల్ని చూస్తాడో చుడడో తెలియదు. కుమారుడు ప్రయోజకుడు అయితే చాలు అనుకుంటారు. అందుకే తల్లితండ్రులను మించిన దైవం లేదంటారు పెద్దలు. నవ సమాజంలో ప్రత్యక్షంగా మనతో నివసించే దైవాలకన్నా.. వాళ్ల మరణానంతరం తీసుకెళ్లలేని డబ్బులకు ప్రాధాన్యతను ఇస్తున్నారు సుపుత్రులు. కన్నా వారిని కాదని పైసా మే పరమాత్మ అంటున్నారు. డబ్బులు వస్తే చాలు కన్నవారు ఎలా ఉన్న పర్లేదు అనుకొనే ఎక్కువగా జీవిస్తున్న సమాజం ఇది. పేద., ధనికులు అనే తేడా లేకుండా ప్రత్యక్ష దైవాలను ఆనాధలు చేస్తున్న ఘటనలు జరుగుతున్నాయి.
ప్రజా కోర్టులో నిలబడి వచ్చిన ఓటింగ్ ద్వారా ఉన్నత పదవి అలంకరించి వ్యక్తి. సమాజానికి ఆదర్శప్రాయంగా నిలవాల్సిన అతను... సమాజం తలదించుకునే చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కర్నూలు జిల్లా (Kurnool District) ఎమ్మిగనూరు మునిసిపల్ చైర్మన్ ఇంట్లో అమానుష ఘటన చోటుచేసుకుంది. మునిసిపల్ చైర్మన్ గా చైర్మన్ రఘు బాధ్యతలు చేపడితే తన తల్లి సరోజ వైసీపీ తరుఫున 25వ వార్డు కౌన్సెలర్ గా గెలుపొందారు. తాజాగా కౌన్సిలర్ సరోజ అనూహ్య రీతిలో పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. గత 3 నెలలుగా తన కుమారుడు రఘు ఆస్తి కోసం వేధిస్తున్నాడని సరోజ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రతిరోజూ ఇంటి కొచ్చి తల్లితండ్రులపై, కుటుంబ సభ్యులపై దాడి చేస్తున్నాడని ఆమె జిల్లా ఎస్పీకి పిర్యాదు చేసారు. తల్లిపై చిందులేసింది మునిసిపల్ చైర్మన్ రఘు కోపంతో ఊగిపోయి ఆమెను రోడ్డుమీద ఈడ్చుకుంటూ తీసుకువెల్లిన అమానుష ఘటన చోటుచేసుకుంది. దీంతో బాధితురాలు కుమారుడు రఘు మీద జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. కుమారుడి నుంచి తమకు ప్రాణహాని ఉందని.., రక్షణ కల్పించాలని ఆమె జిల్లా ఎస్పీని వేడుకుంది. కొడుకు మున్సిపల్ చైర్మన్ కావటంతో పోలీసులు తమ గోడు పట్టించుకోవటంలేదని ఆ ఫిర్యాదులో ఆమె వివరించింది. తన తల్లి పోలీసులకు చేసిన ఫిర్యాదుపై మున్సిపల్ చైర్మన్ రఘు స్పందించార. నా తల్లిదండ్రులు నా కుటుంబం నా పైన తప్పుడు కేసులు పెట్టారని.., నేను చేసింది ధర్మమో.. ఆధర్మమో పైన భగవంతుడు చూసుకుంటాడని సమాధానమిచ్చారు. తన తల్లిదండ్రులపై దాడి చేయకపోయినా పరువు తీసేలా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడుతున్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.