(T. Murali Krishna, News18, Kurnool)
పదవ తరగతి పరీక్షలు సమీపించే కొద్దీ విద్యార్థుల్లో ఒక భయాందోళన మొదలవుతుంది. సంవత్సరం పాటు పదవ తరగతి పరీక్షలకు పోటీపడి చదివిందల పరీక్షలు సమీపించే కొద్దీ భయాందోళనతో మరచిపోతుంటారు. మరోపక్క కొంతమంది విద్యార్థులు వివిధ సబ్జెక్టుల్లో సరైనటువంటి అవగాహన లేక వెనుకబడిపోతుంటారు.
ముఖ్యంగా ఈ పదవ తరగతి లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది క్లిష్టమైనది ఇంగ్లీషులో స్పెల్లింగ్ మిస్టేక్స్ వల్ల ఆ పదాలకు అర్థాలే మారిపోతుంటాయి. అలాంటి సమయంలో పరీక్షల్లో ఏ విధంగా మంచి మార్కులు తెచ్చుకోవాలని ఆలోచించే వాళ్ళు ఈ విధంగా చేస్తే చాలు పదవ తరగతి పరీక్షలు బాగా రాసి మంచి మార్కులతో పాస్ అవుతారు..
ముఖ్యంగా పదవ తరగతి విద్యార్థులు పరీక్ష కేంద్రంలో సమయాన్ని వృధా చేసుకోకుండా ఇచ్చినటువంటి క్యూస్షన్ పేపర్ ని క్షుణ్ణంగా చదివి అందులో మొదట ముఖ్యంగా తెలిసిన వాటికి జవాబులు రాయాలి. ఆ జవాబులు రాసే సమయంలో పేపర్ ప్రజెంటేషన్ నీటుగా ఉండేలా చూసుకొని హ్యాండ్ రైటింగ్ కూడా చక్కగా ఉండేలా రాస్తే సరిపోతుంది.
10వ తరగతి ఇంగ్లీష్ పరీక్షలో విద్యార్థులు భయం పోగొట్టేందుకు చిట్కాలు..
పరీక్ష సమయంలో సమయాన్ని వృధా చేయకుండా జాగ్రత్త పడాలి
* పరీక్ష హలులో ముందుగా క్వశ్చన్ పేపర్ క్షుణ్ణంగా చదవాలి
* క్వశ్చన్ పేపర్ చదివాకా వచ్చినా వాటికీ జవాబులు రాయాలి...
పేపర్ ప్రజెంటేషన్ నీట్ గా ఉండేలా చూసుకోవాలి..
హ్యాండ్ రైటింగ్ కూడా నీట్ గా ఉండేలా చూసుకోవాలి...
ముఖ్యంగా పదవ తరగతి ఇంగ్లీష్ పేపర్ లో 100 మార్కులకు గాను అందులో ముఖ్యంగా లెటర్ రైటింగ్ కి 10 మార్కులు, కాంపెన్సివ్ ప్యాసింజర్స్ కి 10 మార్కులు, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అనే వాటికి పది మార్కులు చొప్పున ఆ మూడిటి పైన కాన్సన్ట్రేషన్ చేస్తే అక్కడే 30 మార్కులు రాబట్టుకోవచ్చు. మొదట వీటిపై జవాబులు రాస్తే తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు సంపాదించుకోవచ్చు.
ఈ విధానాలు పాటిస్తే 10వ తరగతిలో ఈజీగా పాస్ అవ్వచ్చు....
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, EDUCATION, JOBS, Kurnool, Local News