ఏపీలో మరోసారి భూకంపం వచ్చింది. రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో భూమి కంపించింది. జిల్లాలోని తుగ్గలి మండలం రాతనలో ఒక్కసారిగా భూ ప్రకంపనలు రావడంతో జనం ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.దీంతో జనం భయంతో ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు. భూకంపం థాటికి గ్రామంలోని పలు ఇళ్లకు బీటలు వారగా.. పలుచోట్ల సిమెంట్ రోడ్లకు స్వల్పంగా బీటలు వచ్చాయి.ఈవిషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే శ్రీదేవి ఉన్నతాధికారులతో కలిసి ఆయా ప్రాంతాల్నిపరిశీలించారు.
అయితే రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత ఎంత నమోయ్యింది..? అనే విషయాలు ఇంతవరకూ తెలియరాలేదు. ఏయే ప్రాంతాల్లో ఇళ్లు పగుళ్లు వచ్చాయి..? ఎంతమేరకు నష్టం వాటిల్లిందనే దానిపై స్థానికులను అడిగి అధికారులు ఆరాతీస్తున్నారు. అయితే ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరిగినట్టు సమాచారం లేదు.
ఫిబ్రవరిలో ఏపీలోని పలు జిల్లాల్లో పలుచోట్ల స్వల్ప భూకంపం వచ్చింది. ఎన్టీఆర్ , పల్నాడు జిల్లాలో భూప్రకంపనలు రావడంతో ఆ జిల్లా వాసులు భయంతో వణికిపోయారు. ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ, కంచికర్ల, చందర్లపాడు, వీరులపాడు మండలాల్లో భూకంపం సంభవించింది. మరోవైపు.. పల్నాడు జిల్లాలోని అచ్చంపేట మండలం మాదిపాడు, చల్లగరిగ, గింజపల్లి గ్రామాల్లో స్వల్పంగా భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానికులు భయంతో ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP News, Earth quake, Local News