హోమ్ /వార్తలు /andhra-pradesh /

AP Politics: జగన్ ను జైలుకు పంపడం బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదు.. డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు..

AP Politics: జగన్ ను జైలుకు పంపడం బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదు.. డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు..

ఇటీవల విజయవాడ (Vijayawada) లో బీజేపీ (BJP) నిర్వహించిన జనాగ్రహ సభపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. ముఖ్యంగా ఆ సభ తర్వాత వైసీపీ (YSRCP), బీజేపీ (BJP) నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తాజాగా బీజేపీపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇంకా చదవండి ...

    ఇటీవల విజయవాడ (Vijayawada) లో బీజేపీ (BJP) నిర్వహించిన జనాగ్రహ సభపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. ముఖ్యంగా ఆ సభ తర్వాత వైసీపీ (YSRCP), బీజేపీ (BJP) నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తాజాగా బీజేపీపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి (Deputy CM Narayana Swamy) సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) పై ధ్వజమెత్తారు. పేదలందరికి అండగా నిలుస్తున్న సీఎం‌ జగన్మోహన్ రెడ్డికి స్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్ధించినట్లు తెలిపారు. చీప్ లిక్కర్ యాభై రూపాయలకు ఇచ్చి ప్రజలను సోమువీర్రాజు సంతోషం పెడతాను అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

    సోము వీర్రాజు తాగుబోతుల సంఘం అధ్యక్షుడిలా మాట్లాడుతున్నారని నారాయణ స్వామి ఎద్దేవా చేశారు. ఆయన్ని బీజేపి రాష్ట్ర అధ్యక్షుడుని ఎలా నియమించారో అర్ధం కావడం లేదన్నారు. సోమువీర్రాజు వ్యక్తిత్వం ఏంటనేది రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకున్నారని.., మతాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం భాధాకరంమన్నారు. సోమువీర్రాజు లాంటి వ్యక్తులకు అధ్యక్ష పదవి ఇస్తే డిపాజిట్ కూడా రాదని నేను మోదీకి విజ్ఞప్తి చేస్తున్నాని ఆయన విమర్శించారు.

    ఇది చదవండి: టీడీపీ=బీజేపీ=కాంగ్రెస్‌=సీపీఐ=జనసేన.. గరుడ పురాణం ఎక్కడ..? సజ్జల సంచలన కామెంట్స్..

    ఇక సీఎం జగన్ ని జైలుకి పంపడం ఎవరి తరం కాదన్న నారాయణ స్వామి.., ఆఖరికి బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం ఎప్పుడూ ఎలాంటి‌ చిన్న తప్పు చేయలేదని.., అన్ని పార్టీలు ఒకటై ఆయనపై కుట్రలు చేస్తున్నారని నారాయణ స్వామి మండిపడ్డారు. చంద్రబాబుకి సీఎంగా ఉంటే ధనంవంతులు అందరికి‌ మంచి జరుగుతుందనే అన్ని పార్టీలు ఒక్కటయ్యాయని ఆరోపించారు.

    ఇది చదవండి: ఏపీలో బీజేపీ వ్యూహం అదేనా..? కమలనాథులు టార్గెట్ రీచ్ అవుతారా..?

    ఇదిలా ఉంటే బుధవారం సినిమా టికెట్ల వివాదంపై నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ సినీ పెద్దలపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. ''టాలీవుడ్‌ కూడా వారసత్వం అయిపోయింది. మూడు కుటుంబాలే సినిమా ఇండస్ట్రీపై ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. కొత్త వారికి థియేటర్లు ఇవ్వడం లేదు. రాజకీయాల్లో వారసత్వం గురించి అందరూ విమర్శిస్తారు. మరి సినిమాలో వారసత్వం పరిస్థితేంటి? ప్రజలకు సినిమా చూపిస్తారు. వారి డబ్బులతో ఆస్తులు కూడబెట్టుతున్నారు. కానీ ప్రజలకు కష్టాలు వస్తే మాత్రం ఆదుకోరు. సినిమా టికెట్లు రూ.2వేలు, రూ.3వేలకు అమ్మడం సరికాదు. నిర్మాతలకు నష్టాలు వస్తే హీరోలు ఆదుకోరు. సినిమా ఇండస్ట్రీల్లో చాలా మంది జీఎస్టీ కూడా చెల్లిచడం లేదు.'' అని హాట్ కామెంట్స్ చేశారు నారాయణ స్వామి.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

    First published:

    ఉత్తమ కథలు