హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kurnool: మున్సిపల్‌ ఆఫీసులో గాడిదలు.. వాటికి అక్కడేం పని..? అసలు మేటర్ ఏంటంటే..!

Kurnool: మున్సిపల్‌ ఆఫీసులో గాడిదలు.. వాటికి అక్కడేం పని..? అసలు మేటర్ ఏంటంటే..!

కర్నూలు కార్పొరేషన్ కార్యాలయంలో గాడిదలు

కర్నూలు కార్పొరేషన్ కార్యాలయంలో గాడిదలు

Kurnool: సాధారణంగా నిరసను ఒక్కో విధంగా ఉంటయి. అధికారులు, నేతల తీరు నచ్చకో, సమస్య పరిష్కారం కాలేదనో కొందరు వినూత్నంగా తమ నిరసనను తెలియజేస్తుంటారు. అవి కాస్త వెరైటీగా ఉంటూ వైరల్ అవుతుంటాయి.

 • News18 Telugu
 • Last Updated :
 • Kurnool, India

  సాధారణంగా నిరసను ఒక్కో విధంగా ఉంటయి. అధికారులు, నేతల తీరు నచ్చకో, సమస్య పరిష్కారం కాలేదనో కొందరు వినూత్నంగా తమ నిరసనను తెలియజేస్తుంటారు. అవి కాస్త వెరైటీగా ఉంటూ వైరల్ అవుతుంటాయి. తాజాగా కర్నూలు జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు (Kurnool) నగరంలో గాడిదల బెడద ఎక్కువగా ఉందంటూ గత కొన్ని రోజులగా మున్సిపాలిటీ అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తులున్నాయి. ఈ నేపథ్యంలో కర్నూలు మున్సిపల్ అధికారులు.. గురువారం రోజు ఓ 20 గాడిదలను తీసుకెళ్లి మున్సిపల్‌ కార్పొరేషన్ ఆఫీస్ ‌లో పెట్టారు. అనంతరం సాయంత్ర వరకు వాటిని అక్కడే ఉంచి తర్వాత విడిచిపెట్టారు. అయితే ఇప్పుడు ఈ విషయం పెద్ద దుమారానికి దారితీసింది.

  కార్పొరేషన్ అధికారులు తీసుకెళ్లిన గాడిదల్లో రెండు జీవాలు మరణించినట్లు సమాచారం. దీంతో ఒక్కసారిగా రజక సంఘం నాయకులు వివాదానికి తెరతీశారు. రజక సంఘం నాయకులు ఏకంగా కర్నూల్ మున్సిపల్ ఆఫీస్ ‌లోకి వెళ్లి నిరసనకు దిగారు. అది కూడా తమ వెంట గాడిదలను తీసుకొని ఆఫీస్ ‌లోని వెళ్లి అధికారులతో వాగ్వాదానికి దిగారు.

  ఇది చదవండి: సూర్యుడైనా ఆలస్యంగా వస్తాడేమో కానీ.. వీళ్లు మాత్రం అస్సలు లేటవ్వరు..! ఎందుకంటే..!

  అధికారులు గురువారం రోజు తీసుకెళ్ళిన గాడిదలకు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకుండా హింసించారని రజకులు ఆరోపించారు. అంతేకాదు గాడిదలను తీసుకెళ్లి హింసించిన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ రజకులు ధర్నా నిర్వహించారు. అలా గాడిదలను మున్సిపల్‌ ఆఫీస్ ‌లోకి తీసుకొచ్చి నిరసనచేసిన విజువల్స్ ఒక్కసారిగా వైరల్ ‌గా మారాయి. మరి దీనిపై అధికారులు ఎలా రియాక్ట్‌ అవుతారో చూడాలి.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Kurnool, Local News

  ఉత్తమ కథలు