సాధారణంగా జనాలకు కోడిపందేలు, గుర్రాల పందేలు, ఎడ్ల బండలాడుగు పందేలు తెలుసు. ఇక పొట్టేళ్ల పైటింగ్ తో పాటు అక్కడక్కడా పందుల పందేలు కూడా చాసే ఉంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ లోని ఓ జిల్లాలో వెరైటీగా గాడిదల పందేలు నిర్వహిస్తున్నారు.
సాధారణంగా జనాలకు కోడిపందేలు, గుర్రాల పందేలు, ఎడ్ల బండలాడుగు పందేలు తెలుసు. ఇక పొట్టేళ్ల పైటింగ్ తో పాటు అక్కడక్కడా పందుల పందేలు కూడా చాసే ఉంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఓ జిల్లాలో వెరైటీగా గాడిదల పందేలు నిర్వహిస్తున్నారు. పూర్వకాలం నుంచి గాడిదలను బరువు మోసేందుకు మాత్రమే ఉపయోగించేవారు. ఇటీవల కాలంలో గాడిద పాలను విక్రయిస్తూ కొందరు సొమ్ము చేసుకోవడం చూశాం. ఇటీవల కర్నూలు జిల్లాలో గాడిద పందేలు కూడా నిర్వహించారు. ముఖ్యాంగా జిల్లోని ఆళ్లగడ్డ, రుద్వరం, చాగలమర్రి, కోవెలకుంట్ల, బనగానపల్లె, కోడుమూరు, అవుకు, పత్తికొండ, ఆదోని, కల్లూరు, వెలుగోడి మండలాల్లో పందేల కోసమే గాడిదలను పెంచిపోషిస్తున్నారు. ఇటీవల జిల్లాలో జరిగిన గాడిదల పందేలు అందర్నీ ఆకర్షించాయి. త్వరలో సంక్రాంతి పండుగ రానున్న నేపథ్యంలో గాడిదల పందేలపై ఆసక్తి నెలకొంది.
ఎడ్ల పందేల మాదిరిగానే గాడిద పందేలు నిర్వహించాలనుకునేవారి వాటిని పెంచిపోషిస్తున్నారు. పందేలకు సిద్ధం చేసే గాడిదలకు మంచి ఆహారం ఇచ్చి పెంచుతున్నారు. వాటికి ఉలవలు, పెసలు, కొర్రలు, కొర్రపిండి, బెల్లం, వడ్ల వంటివాటిని దాణారూపంలో ఇస్తున్నారు. కొన్ని పిండివంటలు కూడా ఆహారంగా తినిపిస్తున్నారు. పశుగ్రాసంతో పాటు దాదాపు రెండు కిలోల దాణాను ఆహారంగా అందిస్తున్నారు.
పందేలు ఇలా..
ఎడ్ల బండ్ల లాగుడు పోటీల మాదిరిగానే గాడిదల పరుగు పందెంలో బరువులు లాగాల్సి ఉంటుంది. గాడిలపై ఇసుక సంచులు వేసి నిర్ణీత సమయంలో కొంత దూరం పరుగులు పెట్టాలి.
పండుగలు, తిరుణాళ్లలో పోటీలు
ఏటా ఉగాది, శ్రీరామ నవమి, సంక్రాంతి పండుగలతోపాటు కాశినాయన ఆరాధోత్సవాలు, పాండురంగస్వామి బ్రహ్మోత్సవాలు, గ్యార్మీ, అమ్మవారి జాతరల సందర్భంగా కర్నూలు, నంద్యాల, చాగలమర్రి, ఆల్వకొండ, కోవెలకుంట్ల తదితర ప్రాంతాల్లో ఎక్కువగా గాడిదల పరుగు పందెం పోటీలను నిర్వహిస్తున్నారు.
ధర ఎక్కువే..
ఈ పందేల్లో పాల్గొనే గాడిదలకు మార్కెట్లో మంచి ధరే ఉంది. పందెం కోసం ట్రైనింగ్ తీసుకున్న గాడిదలకు రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు పలుకుతోంది. సైజుల వారీగా గాడిదలను కొనుగోలు చేస్తున్నవారు.. వాటికి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి పోటీల్లో దించుతున్నారు.
ప్రత్యేక ట్రైనింగ్
పరుగు పందెంలో పాల్గొనే గాడిదలకు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వాటికి ఇసుక బస్తాలు తగిలించి పరుగులు పెట్టిస్తారు. ఇలా వంద నుంచి 200కిలోల వరకు బరువులు ఉంచి పరుగెత్తిస్తారు. అసలైన పోటీల్లో ఒక్కో గాడిద 200 కిలోల బరువుతో పరుగులు పెట్టాల్సి ఉంటుంది. త్వరలో సంక్రాంతి వస్తున్న నేపథ్యంలో గాడిదల పోటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.