T. Murali Krishna, News18, Kurnool
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ శైలం శ్రీ భ్రమరాంభిక మల్లికార్జున స్వామి వారి క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. కార్తీమాసం పూర్తి అయినా కూడా భక్తుల రద్ది మాత్రం ఏ మాత్రం తగ్గలేదు.
శ్రీశైల మహాక్షేత్రం భక్తులతో కళకళ లాడుతోంది. కార్తీక మాసం పూర్తయినా కూడా భక్తుల రద్దీ కొనసాగింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో శ్రీ శైలం తరలివస్తున్నారు. అదేవిధంగా కర్ణాటక ప్రాంతం నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైలం పుణ్యక్షేత్రానికి చేరుకుంటున్నారు. భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు కొనసాగుతున్నాయి.
అదే విధంగా ఎన్నడూ లేని విదంగా శ్రీ శైలం క్షేత్రాన్నికి వెళ్లే భక్తులు శిఖరంపై ఉన్నటువంటి నంది నుంచి శ్రీ శైలం ప్రధాన ఆలయా గోపురాన్ని చూడడానికి క్యూ కడుతున్నారు. అదే విధంగా అక్కడి నుంచి ముందుగా సాక్షి గణపతి ఆలయా ప్రాంగణం ఇలా పుణ్యక్షేత్రం మొత్తం భక్తుల రద్దితో కళకళలాడుతోంది. ఇక ప్రధాన ఆలయ విషయానికి వస్తే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు రెండు గంటల సమయం పడుతుంది.
భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నడంతో అధికారులు క్యూలైన్లో ఉన్నటువంటి కంపార్ట్మెంట్లలో భక్తులను ఉంచి స్వామి వారి దర్శనానికి పంపుతున్నారు.అదేవిధంగా నిన్న సోమవారం సందర్భంగా శ్రీశైలం మహాక్షేత్రంలో భ్రమరాంబ, మల్లికార్జున స్వామి అమ్మవార్లకు సహస్ర దీపాలంకరణ సేవ శాస్త్రోక్తంగా జరిపించారు అదేవిధంగా స్వామి అమ్మవార్లకుఆలయ ఈవో లవన్న ఆధ్వర్యంలోవెండి రథోత్సవం వైభవంగా జరిపించారు.
స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను వెండి రథంపై కొలువుదీర్చి ఆలయ పేద పండితులు అర్చకులు సాస్ట్రోక్తంగా వేద మంత్రాలతో మంగళ హారతులతో స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. ఇలా శ్రీశైలం మహా పుణ్యక్షేత్రం ఒకవైపు ఆధ్యాత్మిక దైవ క్షేత్రం మరోవైపు పర్యాటక క్షేత్రంగా శ్రీశైలానికి వచ్చే భక్తులను ఆకట్టుకుంటుంది. క్షేత్రానికి వచ్చే భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయానికి వచ్చే ఎలాంటి అశోక్ కార్యాలు కలవకుండా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు ఆలయ అధికారులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool, Local News