Andhra Pradesh: ఆ గుడిలో ఎవరి గుండు వాళ్లే కొట్టుకోవాలి.. ఎందుకిలా జరుగుతోందంటే..!

శ్రీశైలం ఆలయంలో భక్తుల ఇక్కట్లు

కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) కారణంగా రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో కొవిడ్ నిబంధనలు అమలు చేస్తున్నారు.

  • Share this:
    దేవుడికి భక్తులు తలనీలాలు సమర్పించడం సర్వసాధారణం. ఆలయాల్లో తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకోవాలంటే అక్కడ క్షురుకులు ఉంటారు. దీనీకి సంబంధించి నగదు చెల్లించి టోకెన్ తీసుకుంటే కల్యాణ కట్టలో తలనీలాలు సమర్పించవచ్చు. ఇందుకోసం ప్రతి ఆలయం సిబ్బందిని నియమించడంతో పాటు సౌకర్యాలను ఏర్పాటు చేస్తుంది. తిరుమల, విజయవాడ దుర్గగుడి, అన్నవరం, సింహాచలం, ద్వారకా తిరుమల వంటి ప్రధాన ఆలయాల్లో కల్యాణకట్టలు అందుబాటులో ఉన్నాయి. ఇక రాష్ట్రంలో మరో ప్రముఖ శైవక్షేత్రమైన కర్నూలు జిల్లా శ్రీశైలం ఆలయంలోనూ తలనీలాలు సమర్పించేందుకు కల్యాణ కట్ట అందుబాటులో ఉంది. కానీ ఇక్కడ కరోనా కారణంగా వింత పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే ఆలయాల్లోకి భక్తులను అనుమతిస్తున్నారు. శ్రీశైలంలోనూ అధికారులు మల్లన్నను దర్శించుకునేందుకు పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్నారు. మల్లన్నకు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకునే భక్తులకు వింత పరిస్థితి ఎదురైంది. కరోనా కారణంగా కల్యాణకట్టను అధికారులు మూసేయడంతో భక్తులు ఇబ్బందిపడుతున్నారు.

    తలనీలాలు సమర్పించాల్సిన భక్తులు తమ కుటుంబ సభ్యులకు తామే గుండు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా మంది భక్తులు తమతో కత్తులు, రేజర్లు తెచ్చుకొని తమ పిల్లలు, భక్తులకు తలనీలాలు తీసిన దృశ్యాలు కనిపించాయి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో శ్రీశైలం ఆలయ అధికారులు స్పందించారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా కల్యాణకట్టను తాత్కాలికంగా మూసివేసినట్లు తెలిపారు. భక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకోని బుధవారం నుంచి కల్యాణ కట్టను పునఃప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఐతే తలనీలాలు సమర్పించే సమయంలో కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. తప్పనిసరిగా మాస్క్ ధరించాలని స్పష్టం చేశారు.

    ఇది చదవండి: మళ్లీ కొండెక్కిన కోడి.. కిలో చికెన్ ధర ఎంతంటే..!

    అధికారుల నిర్ణయంపై మల్లన్న భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కల్యాణకట్ట లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కల్యాణకట్ట మూసివేతపై భక్తులకు సమాచారం లేకపోవడం కూడా ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఐతే నిత్యం వేలాది మంది భక్తులు వచ్చే శ్రీశైలం ఆలయంలో తలనీలాలపై సమాచారం ఇవ్వకపోవడంపై కొందరు భక్తులు అధికారులను తప్పుబడుతున్నారు.

    ఇది చదవండి: కరోనా టెస్టులపై సీఎం జగన్ కీలక ఆదేశాలు... ఇకపై ఈ టెస్టులు ఉండవు..

    ఇదిలా ఉంటే కరోనా సెకండ్ వేవ్ కారణంగా రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో దర్శనాలు నిలిపేసిన సంగతి తెలిసిందే. తిరుమల, విజయవాడ దుర్గగుడిలో పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించగా.. అన్నవరం, ద్వారకా తిరుమల, సింహాచలం వంటి ఆలయాల్లో దర్శనాలు నిలిపేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆర్జిత సేవలు, ఇతర ఉత్సవాలన్నీ ఏకాంతంగానే నిర్వహించారు. ఇటు తిరుమలలో ఆర్జిత సేవలు ఏకాంతంగానే జరుగుతున్నాయి. ఐతే భక్తులు వర్చువల్ విధానంలో పాల్గొని దర్శనం తర్వాత చేసుకునేలా టీటీడీ అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే..!
    Published by:Purna Chandra
    First published: