హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Devaragattu: వర్షంలోనూ రక్తసిక్తంగా దేవరగట్టు.. కర్రల సమరంలో 70 మందికి గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం

Devaragattu: వర్షంలోనూ రక్తసిక్తంగా దేవరగట్టు.. కర్రల సమరంలో 70 మందికి గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం

రక్తసిక్తంగా మారిన కర్రల సమరం

రక్తసిక్తంగా మారిన కర్రల సమరం

Devaragattu: ఓ వైపు హోరుమని వర్షం పడుతున్నా.. కర్రల సమరం ఆగలేదు.. అడుగడుగునా ఆంక్షల మధ్యే దేవరగట్టులో ఏటా నిర్వహించే కర్రల సమరం మరోసారి రక్తసిక్తమయింది. 70 మందికి గాయాలు అయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది..

  • News18 Telugu
  • Last Updated :
  • Kurnool, India

Devaragattu: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కర్నూల్ జిల్లా (Kurnool District) లోని హొళిగుంద మండలం దేవరగట్టు మరోసారి రక్తసిక్తమైంది.. దేవరగట్టులో మాళ మల్లేశ్వరస్వామి (Devaragattu mala Malleswara Swamy) దసరా (Dussehra) బన్నీ జైత్రయాత్రకు ఎంతో ప్రత్యేకత ఉంది. సుమారు 800 అడుగుల ఎత్తైన కొండపై మాళ మల్లేశ్వరస్వామి ఆలయం ఉంటుంది. దసరా బన్ని ఉత్సవం (Bunny Utsvam) సందర్భంగా స్వామి మూర్తులను దక్కించుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల భక్తులు రెండు వర్గాలుగా విడిపోయి కర్రలతో తలపడతారు. ఈ క్రమంలో ప్రతీయేడాదిలాగానే ఈ ఏడాదికూడా గ్రామాలవారిగా విడిపోయి భక్తులు కర్రలతో తలపడగా. ఈ బన్నీ ఉత్సవాన్ని తిలకించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. భారీ వర్షం పడటంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

అడుగు అడుగునా ఆంక్షలు ఉన్నా..? హోరుమని భారీ వర్షం పడుతున్నా.. స్థానికులు లెక్క చేయలేదు. ప్రతీయేటా నిర్వహించే ఈ కర్రల సమరం బుధవారం తీవ్ర ఉద్రిక్తతల మధ్య జరిగింది. దసరా రోజున శ్రీమాళ మల్లేశ్వర స్వామికి నిర్వహించే వేడుకలలో భాగంగా జరిగే ఈ కర్రల సమరం.. ఈ ఏడాది వర్షం కారణంగా కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ సమరంలో 70 మంది భక్తులకు గాయ్యాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

పూర్తి వివరాల్లో వెళ్తే.. బుధవారం రాత్రి స్వామివారి కళ్యాణోత్సవం అనంతరం అర్థరాత్రి దాటిన తరువాత జైత్రయాత్ర మొదలైంది. గురువారం ఉదయం నెరణికి గ్రామ ఆలయ పూజారి భవిష్యవాణి వినిస్తారు. అయితే 7వ తేదీ నెరణికి గ్రామ పురోహితులు స్వామివారికి అర్చనలు చేస్తారు. అనంతరం రథోత్సవం జరుగుతుంది. 8న గొరవయ్యల ఆటలు, గొలుసు తెంపుట, దేవదాసీల క్రీడోత్సవం, సాయంత్రం వసంతోత్సవం, కంకణ విసర్జన ఉంటాయి. 9వ తేదీ మాళ మల్లేశ్వర స్వామి విగ్రహాలు నెరణికి గ్రామానికి చేరడంతో ఉత్సవాలు ముగుస్తాయి.

ఇదీ చదవండి : సీఎం సీఎం అంటూ కోలాహలం.. సందడిగా బావతో బాలయ్య టాక్ షో.. మంత్రుల సెటైర్లు.. ఏమన్నారంటే?

ఈ ఉత్సవాల్లో భాగంగా ఏటా దసరా రోజున శ్రీమాళ మల్లేశ్వర స్వామికి నిర్వహించే వేడుకలలో భాగంగా జరిగే ఈ కర్రల సమరం ఈ ఏడాది వర్షం కారణంగా కొంచెం ఆలస్యంగా ప్రారంభమైంది. దసరా బన్ని ఉత్సవం సందర్భంగా స్వామి మూర్తులను దక్కించుకోవడానికి నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఓ వైపు, అరికెర, అరికెరతండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్‌, విరుపాపురం తదితర గ్రామాల భక్తులు మరోవైపు కర్రలతో తలపడతారు.

ఇదీ చదవండి : ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ వారి బ్రహ్మోత్సవాలు.. ఈ సారి ఎన్ని లడ్డూలు విక్రయించారు?

ఈ సంవత్సరం నిర్వహించిన కర్రల సమరంలో 70 మంది భక్తులు గాయాలపాలయ్యారు. అంతేకాకుండా ఆ మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. చాలాసేపటి వరకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

First published:

Tags: Andhra Pradesh, AP News, Dussehra 2022, Hindu festivals, Kurnool

ఉత్తమ కథలు