AP News: కొన్నిసార్లు ప్రముఖులు కూడా సైబర్ కేటుగాళ్ల బారిన పడుతుంటారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)కు చెందిన వైసీపీ (YSRCP) ఎంపీ సైబర్ క్రైమ్ బారినపడ్డారు.
టెక్నాలజీ అప్ డేట్ అవుతున్న కొద్దీ సైబర్ నేరాలు (Cyber Crimes) పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లకు చదవుకున్నవారని లేదు చదవుకోనివారని లేదు ప్రతి ఒక్కరూ వారి కన్నింగ్ ఐడియాకు బలవుతున్నారు. బ్యాంక్ (Bank OTP) నుంచి ఫోన్ చేస్తున్నామని ఓటీపీలు అడగటం ఎకౌంట్ ఖాళీ చేయడం, క్రెడిట్ (Credit Card), డెబిట్ కార్డ్ (Debit Card) వెరిఫికేషన్ కోసం, టికెట్ల బుకింగ్ లేదా క్యాన్సిలేషన్ వంటి వాటి కోసం కాల్ చేస్తున్నట్లు కటింగ్ ఇచ్చి ఎంచక్కా డబ్బులు దోచేస్తారు. మన ఖాతా ఖాళీ అయిందని తెలిసుకునేలోపే ఫోన్ నెంబర్స్ బ్లాక్ చేస్తారు. కొన్నిసార్లు ప్రముఖులు కూడా సైబర్ కేటుగాళ్ల బారిన పడుతుంటారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)కు చెందిన వైసీపీ (YSRCP) ఎంపీ సైబర్ క్రైమ్ బారినపడ్డారు.
కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ ను సైబర్ నేరగాళ్లు బోల్తా కొట్టించారు. ఇటీవల ఎంపీ సంజీవ్ కు ఫోన్ చేసిన గుర్తుతెలియని వ్యక్తి.. మీ బ్యాంక్ ఎకౌంట్ బ్లాక్ అయిందని.. వెంటనే పాన్ నెంబర్ తో లింక్ చేసి అప్ డేట్ చేయాలని చెప్పాడు. ఫోన్ కు మెసేజ్ తో పాటు ఓ లింక్ వచ్చిందని.. ఓటీపీ నెంబర్లు చెప్పాలని కోరాడు. ఆ తర్వాత మరో వ్యక్తి ఫోన్ చేసి HDFC బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నట్లు పరిచయం చేసుకున్నాడు. ఎకౌంట్ వివరాలు, ఓటీపీ నెంబర్లు అడిగాడు. ఆతడ్ని గుడ్డిగా నమ్మిన ఎంపీ ఎకౌంట్ డిటేల్స్ తో పాటు ఓటీపీ నెంబర్లు చెప్పాడు. దీంతో ఆయన ఎకౌంట్ నుంచి రూ.48,700, రూ.48,999 విత్ డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది. ఇలా మొత్తం రూ.97,699 దోచేశారు. వెంటనే అప్రమత్తమైన ఆయన. కర్నూలు టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సామాన్య ప్రజలు లేదా అవగాహన లేనివారు మోసపోతే సరేగానీ.. సాక్షాత్తూ ఎంపీనే సైబర్ వలలో పడటంపై ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఎంపీకి ఫోన్ చేసి ఓటీపీలి అడిగి డబ్బులు దోచేశారంటే ఆ గ్యాంగ్ ఎంత రాటుదేలిపోయిందో అర్ధమవుతోంది. గతంలో సైబర్ కేటుగాళ్లు ఎంపీలు, ఎమ్మెల్యేలకు గాలం వేసి లక్షలాది రూపాయలు దోచేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఎంపీ సంజీవ్ కూడా డబ్బులు పొగొట్టుకున్నారు.
ఇదిలా ఉంటే అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. అలాంటి ఫోన్ కాల్స్ వచ్చి ఓటీపీలు చెప్పమంటే చెప్పవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల ఓ వ్యక్తి ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసుకునేందుకు కస్టమర్ కేర్ కు కాల్ చేయగా ఏకంగా రూ.10 లక్షలు పోయిన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.