Andhra Pradesh: 300లకే అన్ని చూపిస్తామంటారు.. పొరపాటున కాల్ చేస్తే బుక్ అయినట్టే.. ఏం చేస్తారో తెలుసా..?

కాల్ గాల్స్ పేరుతో భారీ మోసం

స్వీట్ మెసేజ్ లు పెడతారు.. కాస్త నమ్మితే చాలు హస్కీగా మాట్లాడుతారు.. కాల్స్ గర్ల్స్ ఉన్నారని మాయ మాటలు చెబుతారు.. వీడియోలు పంపిస్తామని.. వీడియో కాల్ చేయిస్తామని.. ఆన్ లైన్ పేమెంట్ చేయమంటారు.. వారిని నమ్మితే అంతే.. అక్కడ నుంచి బ్లాక్ మెయిల్ కు పాల్పడతారు బీకేర్ ఫుల్..

  • Share this:
    ఈజీ మనీకి అలవాటు పడ్డ కొందరు.. అడ్డ దారులు తొక్కుతూనే ఉన్నారు. అమాయకుల అవసరాలు.. కోరికలను క్యాష్ చేసుకుంటున్నారు. మరీ అమాయకంగా కనిపిస్తే బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దండుకుంటున్నారు. తాజాగా ఏపీలో అలాంటి ముఠా పోలీసులకు చిక్కింది. ఇప్పటికే కొన్ని వందల మందిని నట్టేట ముంచినట్టు తెలుస్తోంది. మొదట కాల్ గర్ల్స్‌ పేరిట మెసెజ్‌లు పంపిస్తారు.. అశ్లీల వీడియోలను, ఫొటోలను పంపిస్తారు.. అక్కడితోనే ఆగరు.. వీడియో కాల్ కూడా చేయిస్తాం.. వారి కోరికలను బట్టి వేలల్లో డిమాండ్ చేస్తారు.. తరువాత ఏదో ఒక కథ చెబుతూ మళ్లీ మళ్లీ డబ్బులు వేయిస్తూ వీడియోలు పెడుతూ ఉంటారు. అలాంటి ముఠా ఆటకట్టించారు ఏపీలోని కర్నూలు జిల్లా పోలీసులు. అశ్లీలమైన విడియోలను, ఫోటోలను పంపి ఆన్ లైన్ విడియో కాల్స్ చేయిస్తామని డబ్బు తీసుకుంటున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు కర్నూలు వన్‌టౌన్‌ సీఐ కె. కళావెంకటరమణ. మార్కెటింగ్ యాప్స్ వినియోగించుకుని సాధారణ ప్రజలకు కాల్ గర్ల్స్ సప్లయ్ చేస్తామని, అశ్లీల విడియో కాల్స్ చేయిస్తామని నమ్మించి మోసం మోసాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు.

    ఒకేసారి 100 నుంచి 1000 మంది వరకు బల్క్ మేసేజ్‌లు పంపేవారని తెలిపారు. ఈ క్రమంలో కొంతమంది వీరి వలలో చిక్కుకొని అత్యధికంగా డబ్బులు చెల్లించేవారని తెలిపారు. ఈ విధంగా చాలామంది మోసపోయినట్లు విచారణలో తెలిసిందన్నారు. ఆ తర్వాత నిందితులు.. బాధితులను ఫోన్‌ ద్వారా భయపెడుతూ డబ్బులు వసూలు చేసేవారని పేర్కొన్నారు. వీరి మోసాలు కేవలం కర్నూలు జిల్లాకే పరిమితం కాలేదని.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బాధితులు ఉన్నట్టు గుర్తించారు. కొంతమంది వీరి మాయ మాటలు నమ్మి వేలల్లో సొమ్ములు పోగొట్టుకున్నట్టు భావిస్తున్నారు పోలీసులు..

    ఈ ఘటనలో పగిడ్యాల గ్రామానికి చెందిన తెలుగు జనార్ధన్, కర్నూలుకు చెందిన బెస్త ప్రవీణ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు దాదాపు రెండేళ్ల నుంచి ఈ విధంగా మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. కొంతమంది బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో తమ బృందం వారిని పట్టుకున్నట్లు సీఐ తెలిపారు. ఇలా రోజుకు సుమారు 10 వేల నుంచి 20 వేల రూపాయల వరకు ఆ ముఠా సంపాదించినట్టు తెలుస్తోంది. నిందితులకు సంబంధించిన పలు బ్యాంక్ అకౌంట్లను గుర్తించి విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి 31 మొబైల్స్, మహేంద్ర కంపెనీ కారు, 1 స్కూటీ స్వాధీనం చేసుకున్నామని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కళావెంకటరమణ పేర్కొన్నారు.
    Published by:Nagesh Paina
    First published: