హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kurnool: ఏటీఎం చోరీ కేసులో నిందితులకు జైలు శిక్ష..! ఎన్ని సంవత్సరాలంటే..!

Kurnool: ఏటీఎం చోరీ కేసులో నిందితులకు జైలు శిక్ష..! ఎన్ని సంవత్సరాలంటే..!

ఏటీఎం దొంగలకు జైలు శిక్ష

ఏటీఎం దొంగలకు జైలు శిక్ష

Kurnool: కొన్ని నేరాలు ఎప్పుడు చేసినా శిక్ష మాత్రం తప్పదు. కొన్ని తప్పులకు నెలల్లో శిక్షలు పడితే.. మరికొన్నింటికి ఏళ్లు పడుతుంది. తాజాగా ఓ ఏటీఎం చోరీకి కేసులో ఐదేళ్ల తర్వాత నిందితులకు శిక్షపడింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Kurnool, India

  Murali Krishna, News18, Kurnool

  కొన్ని నేరాలు ఎప్పుడు చేసినా శిక్ష మాత్రం తప్పదు. కొన్ని తప్పులకు నెలల్లో శిక్షలు పడితే.. మరికొన్నింటికి ఏళ్లు పడుతుంది. తాజాగా ఓ ఏటీఎం చోరీకి కేసులో ఐదేళ్ల తర్వాత నిందితులకు శిక్షపడింది. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా ఏమిగనూరు పట్టణంలోని సోమప్ప కూడలి వద్ద 2017లో జరిగిన ఏటీఎం చోరీ కేసులో నిందితులకు ఎట్టకేలకు జైలుశిక్ష పడింది. సిండికేట్‌ బ్యాంకులో 2017లో కొందరు దుండగులు ఏటీఎంను ధ్వంసం చేసి రూ.17,29,700 డబ్బు దోచుకెళ్లిన కేసుల్లో పోలీసులు పురోగతి సాధించారు. అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎనిమిది మంది ఈ చోరీ చేసినట్లు దర్యాప్తులో తేల్చారు. ఆ నిందితులు ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితులైన వీరంతా ఢిల్లీ, హర్యానా , రాజస్థాన్‌కు చెందిన వారీగా గుర్తించారు.

  కోర్టులో హాజరుపరచగా, నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి జూనియర్‌ సివిల్‌ జడ్జి గురు అరవింద్‌ నిందితులకు జైలు శిక్ష, జరిమానా విధించారు. ముస్తాక్‌, జుబేర్‌, ముబారక్‌, అమీన్‌కు మూడు సంవత్సరాల జైలు శిక్ష, రూ.2వేల జరిమానా, జుఫిగర్‌, మౌసమ్‌ఖాన్‌, అమిత్‌కుమార్‌, జుబీర్‌కు రెండేళ్ల జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.

  ఇది చదవండి: అమ్మాయి నుంచి వీడియో కాల్‌ వచ్చింది.. ఎవరా అని లిఫ్ట్‌ చేస్తే షాక్‌..! 

  వివిధ కేసులలో పట్టుబడిన కర్ణాటక మద్యం ధ్వంసం..!

  కర్నూలు జిల్లా ఆదోనిలోని కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యాన్ని రవాణా చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆదోని డీఎస్పీ వినోద్‌ కుమార్‌ హెచ్చరించారు. మంగళవారం గోనెగండ్లలో వివిధ ఎక్సైజ్‌ కేసుల్లో పట్టుబడిన అక్రమ మద్యాన్ని ఎస్పీ ఆదేశాల మేరకు ట్రాక్టర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు. గోనెగండ్ల పోలీసు స్టేషన్‌ పరిధిలో నమోదైన 14 ఎక్సైజ్‌ కేసులకు సంబంధించి 2882 కర్ణాటక టెట్రా ప్యాకెట్లు, 180 మిల్లీలీటర్ల 48 బాటిళ్లు, 10 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేసినట్లు డీఎస్పీ తెలిపారు. దీని విలువ సుమారు రూ.1,02,550 ఉంటుందని తెలిపారు. ఈ మద్యాన్ని గోనెగండ్ల గ్రామ శివారులో ధ్వంసం చేశారు.

  ఇది చదవండి: సాఫ్ట్ వేర్ జాబ్.. మంచి జీతం.. కానీ యువకుడి సమస్య అదే.. అందరూ చూస్తుండగానే ఘోరం

  వాహనాన్ని అధిగమించబోయి..!

  కర్నూలు మండల పరిధిలోని మునగాలపాడు వద్ద 44వ నంబరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో కృష్ణగిరి మండలం పుట్లూరు గ్రామానికి చెందిన హనుమంతు (41) అనే వ్యక్తి మృతి చెందారు. పుట్లూరు గ్రామానికి చెందిన హనుమంతు ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తూ జీవనం సాగించేవారు. ఆయనకు భార్య లక్ష్మీదేవి, కుమారులు మనోజ్‌, హేమంత్‌, కుమార్తె వనజ ఉన్నారు.

  హరిగౌడ్‌ అనే వ్యక్తితో కలిసి హనుమంతు బైక్‌పై వస్తూండగా మునగాలపాడు ప్రాంతంలో జాతీయ రహదారిపై మరో ద్విచక్ర వాహనాన్ని అధిగమించబోయి డివైడర్‌ను ఢీకొన్నారు. ఈ ఘటనలో హనుమంతు అక్కడికక్కడే మృతి చెందగా హరి గౌడ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, ATM, Kurnool, Local News

  ఉత్తమ కథలు