హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఒకవైపు నకిలీ పత్తి విత్తనాలు.. మరో వైపు ధరల పతనం.. ఆందోళనలో పత్తి రైతులు

ఒకవైపు నకిలీ పత్తి విత్తనాలు.. మరో వైపు ధరల పతనం.. ఆందోళనలో పత్తి రైతులు

కర్నూలులో రైతుల ఆవేదన

కర్నూలులో రైతుల ఆవేదన

గత వారం వరకు క్వింటాలు పత్తి ధర గరిష్ఠ ధర రూ.9వేలకు పైగా పలికేది. ఉన్న ఫలంగా ధరలు తగ్గడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్‌లో పత్తికి డిమాండ్‌ లేకపోవడంతో ధరలు తగ్గుముఖం పడుతున్నాయని వ్యాపారస్తులు రైతులను తేలికగా మోసం చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Kurnool, India

(T. Murali Krishna, News18, Kurnool)

ఆరుగాలం కష్టపడి శ్రమించి పండించిన పంటకు రైతులకు గిట్టుబాటు ధర కరువైంది. భూమిని నమ్ముకుని పంటలు పండించే రైతులకు చివరికి కన్నీళ్లే మిగులుతున్నాయి. పంట సాగులే జీవనాధారంగా చేసుకుని బ్రతికే రైతులకు చివరికి అప్పుల మిగులుతున్నాయి. దీంతో చేసేది ఏమీ లేక ప్రాణాలు వదలడంలో కూడా వెనకాడడం లేదు రైతులు. తాజాగా కర్నూలు జిల్లాలోని రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పంట సాగులే జీవనాధారంగా చేసుకున్న రైతులకు రేక్కాడితే కానీ డొక్కాడ నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది కర్నూలు జిల్లా వ్యాప్తంగా అధిక వర్షాలు రైతులను నిండా ముంచేశాయి. మరోవైపు కొంతమంది వ్యాపారస్తులు నకిలీ పత్తి విత్తనాలతో రైతులను నిండా ముంచెత్తారు. ఈ ఏడాది మొదట్లో పత్తికి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో జిల్లావ్యాప్తంగా రైతులు అధిక సంఖ్యలో పత్తి పంటలను సాగు చేశారు.

మొదట్లో క్వింటాల్ పత్తి ధర రూ 10,000 నుంచి రూ.11,000 పలకడంతో అన్నదాతలు పెద్ద ఎత్తున ప్రతి పంటలు సాగు చేపట్టారు. దీన్ని ఆసరాగా తీసుకున్నవ్యాపారస్తులు ఆదోని తదితర ప్రాంతాలలోని రైతులకు నకిలీ పత్తి విత్తనాలతో పెద్ద ఎత్తున మోసం చేశారు. అది అలా ఉండగా ఇప్పుడు మళ్లీ పత్తి ధరలు నేల చూపులు చూడడం రైతులను తీవ్రంగా కలచివేస్తుంది.ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పత్తి ధరలు తగ్గుముఖం పట్టాయి. 2027 క్వింటాళ్ల పత్తి మార్కెట్ యార్డుకు అమ్మకానికి రాగా.క్వింటాలు పత్తి ధర కనిష్ఠంగా 5,300, గరిష్ఠంగా రూ.8,400. నమూనా ధర రూ.8,310 రూపాయలుగా పలికాయి.ధరల తగ్గదలపై అన్నదాతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

గత వారం వరకు క్వింటాలు పత్తి ధర గరిష్ఠ ధర రూ.9వేలకు పైగా పలికేది. ఉన్న ఫలంగా ధరలు తగ్గడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్‌లో పత్తికి డిమాండ్‌ లేకపోవడంతో ధరలు తగ్గుముఖం పడుతున్నాయని వ్యాపారస్తులు రైతులను తేలికగా మోసం చేస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి పత్తి రైతులను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.

First published:

Tags: Farmers suicide, Kurnool, Local News

ఉత్తమ కథలు