Corona Terror: కరోనా ప్రాణాలు తీస్తోంది. భయం చంపేస్తోంది? ఆత్మహత్యలకు కారణం ఏంటో తెలుసా?

కరోనా ప్రాణాలు తీస్తోంది. భయం చంపేస్తోంది

మాయదారి కరోనా ప్రాణాలు తీసేస్తోంది. రోజు రోజుకూ కరోనా సోకి మరణించే వారి సంఖ్య రెట్టింపు అవుతోంది. మరోవైపు కరోనా సోకిందనే భయంతో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలా ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణమేంటి? మానిసక వైద్య నిపుణులు ఇచ్చే సలహా ఏంటి?

 • Share this:
  కరోనా ప్రాణాలు తీస్తోంది? రోజు రోజుకూ మరణాల సంఖ్య పెరుగుతున్నాయి. గతంతో పోల్చుకుంటే సెకెండ్ వేవ్ చాలా ప్రమాదకరంగా మారింది. వయసుతో సంబంధం లేకుండా ప్రాణాలను తోడు తీసుకెళ్లిపోతోంది. ముఖ్యంగా కుంటుబాలపై కరోనా కన్నువేస్తోంది. ఒకరికి ఇద్దర్ని తోడు తీసుకెళ్లిపోతోంది. ఆంధ్రప్రదేశ్ లో ఒక్కో కుటుంబం నుంచి ముగ్గురు, నలుగు కూడా కరోనా బారిన పడి చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. అందులో కొందరు కరోనా కారణంగా చనిపోతో... ఆ వార్త విని తమ వారి మరణం తట్టుకోలేక గుండెపోటుతో మరణించిన వారూ ఉన్నారు. ఇటీవల ఇలాంటి సంఘటనలు భారీగా పెరుగుతున్నాయి..

  గత వారం రోజులుగా పరిస్థితి చూస్తే ఒక్క రోజు కూడా 30కి తగ్గకుండా కరోనా మరణాలు నమోదు అవుతున్నాయని అధికారులే అధికారికంగా చెబుతున్నారు. ఆదివారం 69, సోమవారం 51 మంది చనిపోయినట్టు వైద్యశాఖే నిర్ధారించారింది. ఇక లెక్కలోకి రాని మరణాలు ఎన్నో ఊహించలేం.. వివిధ చర్చల్లో పాల్గొంటున్న వైద్యులు సైతం అదే మాట చెబుతున్నారు. వాస్తవంగా జరుగుతున్నదానికి ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు అస్సలు పొంతన ఉండడం లేదనే వాదన ఉంది. ఈ ఘటనలపై కోర్టులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

  కరోనా ప్రాణాలు తీస్తుంటే.. మరోవైపు కరోనా సోకిందనే భయంతో ఆత్మహత్యలు కూడా పెరుగుతుండడం కలవర పెడుతోంది. తాజాగా విశాఖలోని కేజీహెచ్‌ సీఎస్ఆర్ బ్లాక్ పైనుంచి దూకి మరో కరోనా రోగి మృతి చెందాడు. అతడికి ఇటీవలే కోవిడ్ సోకింది. దీంతో అతడి స్నేహితులు, బంధువులు ఎవరూ పట్టించుకోవడం లేదని తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. రోజు రోజకూ ఆ మనో వేదన పెరగడంతో ఒంటరి అయ్యాను అనే ఫీలింగ్ తో అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ దృశ్యాలను చిత్రీకరిస్తున్న మీడియాను కేజీహెచ్ సిబ్బంది అడ్డుకున్నారు. తరువాత మృతదేహాన్ని అక్కడి నుంచి మార్చురీకి తరలించారు.

  ఇదీ చదవండి: కరోనా కష్టాలు. తల్లి మృతదేహాన్ని బైక్ పై 20 కిలోమీటర్లు తీసుకెళ్లిన కొడుకు

  ఇటీవల కృష్ణాజిల్లా గన్నవరం మండలం మర్లపాలెంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. 75 ఏళల్ హరిబాబుకు కరోనా లక్షణాలు కనిపించడంతో ఆ గ్రామస్తులు భౌతిక దూరం పాటించారు. అప్పటి వరకు అతడ్ని ఆప్యాయంగా పలకరించే గ్రామస్తులు.. అతడిని పట్టించుకోవడం మానేశారు. దీంతో తనపై వివక్ష చూపుతున్నారని మనస్థాపానికి గురై చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

  కృష్ణ జిల్లా ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లిలో కూడా కరోనా సోకిందనే భయంతో ఓ వ్యక్తి ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక అశోక్ నగర్లో ఉంటున్న 30 ఏళ్ల లక్ష్మణ్ తీవ్ర మనస్థాపానికి గురూ దగ్గర్లో ఉన్న నీటి సంపులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. కరోనా రావడంతో తనను అందరూ అనాథలా చూస్తున్నారని.. ఎవరూ మాట్లాడడం లేదని తీవ్రంగా కలత చెంది అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

  ఇటీవల ఇలాంటి ఘటనలు చాలానే కనిపిస్తున్నాయి. అయితే అందుకు ప్రధాన కారణం మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురి అవ్వడమే అంటున్నారు వైద్య నిపుణులు. సాధారణంగా కాస్త భయం ఎక్కువ ఉన్నవారికి కరోనా సోకితే వారిని ఆప్యాయంగా చూసుకుని.. ధైర్యం చెప్పాలని.. ఒంటరిగా వదిలిస్తే ఇలా మానసిక క్షోభకు గురయ్యే ప్రమాం ఉంది అన్నారు. కరోనా ఒకరి నుంచి ఒకరికి సోకుతున్న సమయంలో.. ఎవరికైనా కరోనా వస్తే దగ్గరగా ఉండడం అసాధ్యమని.. అయితే దీన్ని కొందరు భూతద్దంలో చూస్తూ.. కరోనా వచ్చిన వారిని అంటరానివారుగా ట్రీట్ చేస్తున్నారని.. అది తట్టుకోలేకే చాలామంది మరణిస్తున్నారన్నారు. ముఖ్యంగా రక్త సంబంధికులు కూడా పట్టించుకోకుండా ఒంటరిని చేస్తున్నారనే బాధ చాలామందిలో ఉంటోందని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కరోనా పై సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు కూడా ఈ మరణాలకు కారణమంటున్నారు. కరోనా వస్తే భవిష్యత్తులో ఇలా ఉంటుందని.. ఊపిరి అందక నరక యాతన అనుభవిస్తారని కొందరు తెలిసీ తెలియని సమాచారాలు పెడుతున్నారని. అలాంటి వార్తలు చూసి రోగుల్లో భయం పెరుగుతోందని మానసిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
  Published by:Nagesh Paina
  First published: