హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP-Telangana Boarder Issue: ఏపీ-తెలంగాణ బోర్డర్లో టెన్షన్ టెన్షన్... జగన్.. కేసీఆర్ స్పందిస్తారా..?

AP-Telangana Boarder Issue: ఏపీ-తెలంగాణ బోర్డర్లో టెన్షన్ టెన్షన్... జగన్.. కేసీఆర్ స్పందిస్తారా..?

కరోనా (Corona Virus) విలయం సృష్టిస్తున్న వేళ తెలుగు రాష్ట్రాల మధ్య మరో వివాదం నెలకొంది. ఈ వ్యవహారంలో ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan) జోక్యం చేసుకోవాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి.

కరోనా (Corona Virus) విలయం సృష్టిస్తున్న వేళ తెలుగు రాష్ట్రాల మధ్య మరో వివాదం నెలకొంది. ఈ వ్యవహారంలో ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan) జోక్యం చేసుకోవాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి.

కరోనా (Corona Virus) విలయం సృష్టిస్తున్న వేళ తెలుగు రాష్ట్రాల మధ్య మరో వివాదం నెలకొంది. ఈ వ్యవహారంలో ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan) జోక్యం చేసుకోవాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి.

  కరోనా విలయం సృష్టిస్తున్న వేళ తెలుగు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం మరింత ముదురుతోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తున్న అంబులెన్సులను తెలంగాణ పోలీసులు అడ్డుకోవడం తీవ్రవివాదాస్పదమవుతోంది. తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినా.. పోలీసులు మాత్రం అంబులెన్సులను అడ్డుకుంటున్నారు. దీంతో ఇప్పటికే ఇద్దరి ప్రాణాలు పోయాయి. తెలంగాణలోని ఆస్పత్రుల నుంచి బెడ్ అవైలబిలిటీ సర్టిఫికెట్ ఉంటేనే పంపుతామని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా.. బోర్డర్ చెక్ పోస్టుల్లో మాత్రం నిలిపేస్తున్నారు. దీంతో రెండు రాష్ట్రాల సరహద్దలు వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లోని అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద పదుల సంఖ్యలో అంబులెన్సులు నిలిచిపోవడం ఆందోళన కలిగిస్తోంది. అంబులెన్సులు నిలిచిపోవడంతో ఇప్పటికే ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది. కర్నూలు శివారులోని హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి పుల్లూరు టోల్ గేట్ వద్ద కొవిడ్ బాధితుల అంబులెన్సులను తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. పంపకపోవడంతో షెషంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రాణాలు పోతున్నా రూల్స్ రెగ్యులేషన్స్ అంటూ పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. అంబులెన్సుల్లో ఉన్నవారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. కాళ్లుపట్టుకున్నా తెలంగాణ పోలీసులు కనికరించడం లేదని రోగుల బంధువులు వాపోతున్నారు.


  విషయం తెలుసుకున్న కర్నూలు ఎమ్మెల్యే ఆఫీస్ ఖాన్ సంఘటనా స్థలానికి వచ్చి తెలంగాణ పోలీసులతో చర్చించి.. అంబులెన్సులను అనుమతించాలని కోరారు.రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి తెలంగాణ రాష్ట్ర అధికారులతో సంప్రదింపులు చేసి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మరోవైపు అంబులెన్సులను అడ్డుకోవడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. చెక్ పోస్టు వద్ద బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.

  ఇది చదవండి: పోలీసులు తలచుకుంటే ఏదైనా సాధ్యమే... అక్సిజన్ ఎలా తీసుకొచ్చారో చూడండి...


  ఇక కృష్ణా- సూర్యాపేట జిల్లాల మధ్య ఏపీ-తెలంగాణ బోర్డర్ వద్ద అదే పరిస్థితి నెలకొంది. ఏపీ నుంచి వస్తున్న అంబులెన్సులను తెలంగాణ పోలీసులు వెనక్కిపంపుతున్నారు. హైదరాబాద్‌లోని ఆస్పత్రి పత్రం చూపినా తెలంగాణ పోలీసులు అనుమతించడం లేదు. విజయవాడ సింగ్ నగర్ కు చెందిన ఓ వృద్ధురాలి పరిస్థితి విషమంగా ఉన్నా పోలీసులు మాత్రం అనుమతించేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఖాళీ అంబులెన్స్‌లను కూడా తెలంగాణ పోలీసులు నిలిపివేస్తున్నారు. పేషెంట్లను వదిలివస్తున్న అంబులెన్స్‌లను నిలిపివేయడంపై డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్ చెక్ పోస్ట్ వద్ద అనుమతి పత్రాలు లేని ఆంధ్ర నుంచి వచ్చే అంబులెన్స్లను నిలిపివేశారు. దీంతో జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభాను, మాజీ మంత్రి నెట్టెం రఘురాం కోవిడ్ రోగుల బంధువులు ఆందోళన చేపట్టారు.

  ఇది చదవండి: బ్లాక్ లో కొవిడ్ వ్యాక్సిన్..? అక్కడి నుంచే దారిమళ్లుతున్నాయా..?


  ఈ వ్యవహారంపై ఏపీలోని అధికార,ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడిరాజధానిగా ఉంటే అనుమతులు ఎలా నిరాకరిస్తారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సీఎం జగన్.. తెలంగాణ సీఎం కేసీఆర్ తో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని టీడీపీ, బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

  First published:

  Tags: Andhra Pradesh, AP Telangana border, Corona, Telangana

  ఉత్తమ కథలు