హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kurnool: ప్రభుత్వం తీరు చూస్తుంటే అసహ్యం వేస్తోంది.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Kurnool: ప్రభుత్వం తీరు చూస్తుంటే అసహ్యం వేస్తోంది.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

X
ఏపీ

ఏపీ సర్కార్ పై మాజీ కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

Kurnool: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం హీటెక్కింది. అన్ని పార్టీలు ఇప్పటి నుంచే గెలుపై ఫోకస్ చేస్తున్నాయి. మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న.. కాంగ్రెస్ సైతం ఇప్పుడు గేర్ మార్చే ప్రయత్నం చేస్తోంది. ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు మొదలెట్టింది. ఇందులో భాగంగా జగన్ సర్కార్ పై మాజీ కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Kurnool, India

Murali Krishna, News18, Kurnool

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు (Andhra Pradesh Politics) రసవత్తరంగా సాగుతున్నాయి. అన్ని పార్టీల్లో ఎన్నికల హీట్ కనిపిస్తోంది.  ప్రత్యర్థి పార్టీపై తీవ్ర విమర్శలతో రాజకీయాలను రచ్చ రచ్చ చేస్తున్నారు. మొన్నటి వరకు సైలెంట్ గానే ఉన్న.. కాంగ్రెస్ పార్టీ (Congress Party)  సైతం దూకుడు పెంచే పనిలో పడింది. అధికార వైసీీపీ (YCP) ని టార్గెట్ చేసుకుంటూ కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారు. తాజాగా  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ (Chinta Mohan) జగన్ సర్కార్ (Jagan Government) తీరుపై ఘాటైన వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందన్నారు. కానీ ఏపీలో మాత్రం అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న విధంగా ప్రాజెక్ట్ల విషయంలో గానీ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా కొత్త పరిశ్రమలు తేవడంలో ఘోరంగా విఫలమైందన్నారు. ప్రస్తుత నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు ఇలా అందరూ ఒకరిపై ఒకరు బూతుల వర్షం కురిపించుకోవడం తప్ప రాష్ట్రం  గురించి.. లేదా అభివృద్ధికి గురించి ఆలోచించడం లేదని విమర్శించారు.

ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే అసహ్యం వేస్తుందని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో కూడా పోలవరం నిర్మాణంలో జాప్యం జరిగి సగం సగం పనులు చేసి దాన్ని మధ్యలో వదిలేశారని కనీసం ఈ ప్రభుత్వమైన పోలవరాన్ని నిర్మించి. రాష్ట్రంలో తాగు, సాగు నీరుకు కొరత లేకుండా చేస్తుంది అనుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని విస్మరించిందన్నారు.

ఇదీ చదవండి : యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్.. అసలేం జరిగిందంటే..?

అలాగే సంక్షేమ పథకాల పేరుతో వేలకోట్ల రూపాయల ధనాన్ని వృధా చేస్తోందన్నారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తూ ఆ సంక్షేమ పథకాలు తమ పార్టీకి చెందిన వారికి మాత్రమే అందే విధంగా చేస్తున్నారని. ఏదో నామమాత్రంగా మిగిలిన బడుగు బలహీన వర్గాల వారికి పేదలకి ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి : ఆ 8 మంది ప్రాణాలు పోడానికి అదే కారణం.. సజ్జల సంచలన వ్యాఖ్యలు

వాటి వల్ల కొంతవరకు మాత్రమే ఉపయోగముందన్నారు. ఒకపక్క సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తుందన్న ముసుగులో నిత్యవసరాల సరుకుల ధరలను, పెట్రోల్ డీజిల్ ధరలను అమాంతం పెంచేశారని మండిపడ్డారు. రాయలసీమ అభివృద్ధి విషయానికొస్తే కరువు ప్రాంతమైన రాయలసీమలో రైతులకు తాగు, సాగునీరు అందించడంలోనూ పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలోనూ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.

ఇదీ చదవండి: గ్రామ సచివాలయానికి తాళం వేసిన వైసీపీ నేత.. కారణం ఏంటంటే?

ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు నగరానికి తీవ్ర అన్యాయం జరిగిందని కర్నూలు నయా రాజధాని పేరుతో ప్రజలను మోసగిస్తున్నారని తెలిపారు. కర్నూల్ న్యాయ రాజధాని కావాలన్నా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా. ప్రజల సుఖ సంతోషాలతో జీవించాలన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే ఇవన్నీ సాధ్యమవుతాయని తెలిపారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP Congress, AP News, Local News, Ycp

ఉత్తమ కథలు