హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kurnool: సిబ్బంది నిర్లక్ష్యం ఖరీదు.. విద్యుత్ షాక్‌తో చిన్నారి మృతి.. ఏం జరిగిందంటే?

Kurnool: సిబ్బంది నిర్లక్ష్యం ఖరీదు.. విద్యుత్ షాక్‌తో చిన్నారి మృతి.. ఏం జరిగిందంటే?

విద్యుత్ షాక్ కు చిన్నారి బలి

విద్యుత్ షాక్ కు చిన్నారి బలి

Crime News: కొందరి సిబ్బంది నిర్లక్ష్యం.. మరికొందరి ప్రాణాల మీదకు తెస్తోంది. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యానికి ఓ చిన్నారి బలైంది. ఓ కుటుంబాన్ని విషాదానికి గురి చేసింది. అసలు ప్రమాదానికి కారణం ఏంటంటే..?

  • News18 Telugu
  • Last Updated :
  • Kurnool, India

    T.Murali Krishna, News 18, Kurnool


    Kurnool Crime: చిన్న పాటి నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఒక్కోసారి.. అయితే కొందరి నిరలక్ష్యం.. మరికొందరికి శాపంగా మారుతోంది. తాజాగా  విద్యుత్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యం.. ఓ బాలిక ప్రాణాలపైకి తెచ్చింది. విద్యుత్ షాక్‌తో బాలిక మృతి చెందిన ఘటన కర్నూల్ జిల్లా కోలగుంద మండలంలో చోటుచేసుకుంది. కోలగుందకు చెందిన బోయ మారెప్ప, గాదెమ్మల కుమార్తె 12 ఏళ్ల లక్ష్మీ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. ఆదివారం సెలవు కావటంతో తల్లిదండ్రులతో కలిసి పొలానికి వెళ్లిన లక్ష్మి, నీళ్లు తాగేందుకు బోరుబావి దగ్గరకు వెళ్ళింది. అక్కడ తెగిపడి ఉన్న విద్యుత్ తీగలను గమనించని లక్ష్మి విద్యుత్ షాక్‌కు గురై ఆక్కడికి అక్కడే మృతి చెందింది.  కళ్లేదుటే కన్న కూతురు మృతి చెందడంతో తల్లిదండ్రులు తీవ్ర వేదనకు గురయ్యారు.


    తన పొలంలో బోరుబావికి స్థంబాలు వేసి విద్యుత్ బిగించాలని పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు మొరపెట్టుకున్నా.. వారు స్పందించలేదని స్థానికులు తెలిపారు. మారప్ప వెదురు బొగ్గులతో విద్యుత్ తీగలను అమర్చుకున్నాడు. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు తీగలు తెగి నేలపై పడడంతో చిన్నారి లక్ష్మి మృతి చెందింది. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యంతోనే తమ కుమార్తె మృతి చెందిందంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


    డిఎస్పీ కార్యాలయం కానిస్టేబుల్ దారుణ హత్య

    మరోవైపు నంద్యాల పట్టణంలోని డిఎస్పీ కార్యాలయంలో కానిస్టేబుల్ 35 ఏళ్ల  గూడూరు సురేంద్ర క్లర్క్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి 10:30 సమయంలో పనులు ముగించుకుని తన ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరాడు. ఈక్రమంలో స్థానిక రాజ్ థియేటర్ సమీపంలో ఆరుగురు వ్యక్తులు బైక్ పై వెళ్తున్న సురేంద్రను అడ్డగించి ఆటోలో ఎక్కించారు. ఆటో డ్రైవర్ ను కత్తితో బెదిరించి నంద్యాల నగర శివారులోకి తీసుకెళ్లి, కానిస్టేబుల్ ఛాతి, వీపుపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశారు.

    ఇదీ చదవండి : ఢిల్లీలో బాబు వంగి వంగి దండాలు పెట్టారంటూ ట్వీట్.. సైబర్ సెల్ కు ఫిర్యాదు.. ఎందుకంటే?

    తరువాత అదే ఆటోలో ఎక్కి.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న సురేంద్రను ఆసుపత్రికి తీసుకెళ్లమంటూ ఆటో డ్రైవర్ కి చెప్పి నిందితులు మధ్యలోనే దిగిపోయారు. సురేంద్రను ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న ఎస్పీ రఘువీర్ రెడ్డి, డిఎస్పి మహేశ్వరరెడ్డి అక్కడికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

    ఇదీ చదవండి : తెల్లారుతూనే ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం

    నిండు ప్రాణం తీసిన స్థలం వివాదం:

    మరోవైపు కోవెలకుంట్ల మండలం ఆకుమలలో స్థలం వివాదం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. ఎస్సై తిమ్మారెడ్డి తెలిపిన వివరాలు మేరకు ఆకుమలకు చెందిన 52 ఏళ్ల దేవి పుత్రుడు కి స్వయాన చిన్నాన్న రాజన్నకు గత మూడేళ్లుగా స్థలం విషయంలో గొడవలు జరుగుతున్నాయి. మూడు నెలల క్రితం గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ చేసి ఇద్దరికీ రాజీ కుదిర్చారు. ఈక్రమంలో శనివారం సాయంత్రం ఇరుకుటుంబాల మరోసారి గొడవ పడగా పోలీసు కేసు నమోదు అయింది.

    ఇదీ చదవండి : నేటి నుంచి తిరుమలలో పవిత్రోత్సవాలు..? ప్రత్యేకత ఏంటి? ఎందుకు నిర్వహిస్తారు..?

    తరువాత చోటు చేసుకున్న పరిణామాలతో రాత్రివేళ రాజన్న కుటుంబం, దేవి పుత్రుడు కుటుంబంపై దాడి చేశారు. ఈ దాడిలో దేవి పుత్రుడు, అతని భార్య అరుణకుమారి, కుమారుడు సాంసన్ వంశీ, చెల్లెలు జయమ్మ తీవ్రంగా గాయపడ్డారు. సాంసన్ తన ఆటోలోనే తల్లిదండ్రులను ఆసుపత్రికి తీసుకెళ్లి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. చికిత్స పొందుతూ దేవిపుత్రుడు మరణించాడు. మిగిలిన వారిని ప్రాథమిక చికిత్స అనంతరం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు రాజన్న అతనితో పాటు దాడిలో పాల్గొన్న ఏడుగురిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే నిందితులు పరారిలో ఉండగా వారికోసం రెండు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్టు తెలిపారు.

    First published:

    Tags: Andhra Pradesh, AP News, Crime news, Kurnool, Local News

    ఉత్తమ కథలు