Home /News /andhra-pradesh /

KURNOOL CLASH BREAKOUT AT HANUMAN JAYANTI IN KURNOOL DISTIRCT STILL TENSION SITUATION NGS GNT

Hanuman Jayanti: హనుమాన్ జయంతి ర్యాలీ హింసాత్మక ఘటనపై నిరసనలు.. 20 మంది అరెస్ట్.. చర్యలు ఏవని బీజేపీ ప్రశ్న

హనుమాన్ మాన్ జయంతి పై అల్లరి మూకల దాడి

హనుమాన్ మాన్ జయంతి పై అల్లరి మూకల దాడి

HanumanJayanti: ప్రతి ఏటా ప్రశాంతంగా సాగే హనుమాన్ జయంతి ర్యాలీ అక్కడ ఈ సారి హింసాత్మకంగా మారింది. అల్లరి మూకలు ర్యాలీపై విరుచుకుపడ్డాయి. దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగడంతో.. 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హింసాత్మక ఘటనపై బీజేపీ మండిపడుతోంది. వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది.

ఇంకా చదవండి ...
  Hanuman Jayanti: కర్నూలు జిల్లా (Kurnool District) లో హనుమాన్ శోభాయాత్ర (Hanuman Jayanti Rally) సందర్భంగా హింసాత్మక ఘటన కలకలం రేపింది. హోలగుందలో హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం హోలగుందలో హనుమాన్ శోభాయాత్ర నిర్వహించిన సమయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడంతో పలువురికి గాయాలు అయ్యాయి. అప్పటి వరకు ప్రశాంతంగా సాగుతున్న ర్యాలీ ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాలు పరస్పర దాడులతో.. స్థానికులు పరుగులు తీయాల్సి వచ్చింది. ర్యాలీని చూడడానికి వచ్చిన వారు సైతం గాయాల పాలవ్వాల్సి వచ్చింది. విషయం తెలిసిన వెంటనే ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి (SP Sudeer Kumar Reddy) హోలగుందలోనే మకాం వేశారు. హింసాత్మక ఘటనపై ఆరా తీశారు. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడంతో పలువురికి గాయాలు అయ్యాయి అక్కడ పహారా కాసిని పోలీసులు చెప్పారు. ఈ క్రమంలోనే పలువురుకు గాయాలు అయ్యాయని. వారిని ఆస్పత్రికి తరలించామన్నారు. పోలీసుల నిర్లక్ష్యమే ఈ ఘర్షణ కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. భారీగా హనుమాన్ ర్యాలీ జరుగుతోందని ముందే సమాచారం ఉన్నా.. అక్కడ పరిమిత సంఖ్యలో మాత్రమే పోలీసులు ఉన్నారని సమాచారం.

  ఘర్షణ గురించి తెలిసిన తరువాత పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి చేరుకుని.. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం ఓ వర్గానికి చెందిన వారు పోలీసు స్టేషన్‌‌ను ముట్టడించి నినాదాలు చేశారు. ఇదే సమయంలో వర్షం కురవడంతో వారు ఇంటికి వెళ్లిపోయారు. మరోవైపు ఈ క్రమంలోనే డీఎస్పీలు వినోద్‌‌కుమార్ హోలగుందకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీగా బలగాలను మోహరించారు. ఆ వివాదం అక్కడితో ఆగలేదు. ఇవాళ కూడా హోలగుందలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నాయి. దీంతో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఇరువర్గాల ఘర్షణల నేపథ్యంలో ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి హోలగుందలోనే మకాం వేశారు.

  ఇదీ చదవండి : కోర్టు చోరీ కేసులో నిందుతుల అరెస్ట్.. నిజమే చెప్పారా..? పోలీసుల వెర్షన్ ఏంటి..?

  హనుమాన్ జయంతి సందర్భంగా హింసాత్మక ఘనపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పందించారు. ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. కర్నూలు పార్లమెంటు స్థానం పరిధిలో శోభాయాత్రపై రాళ్లదాడి జరిగితే ఏం చేస్తున్నారని సీఎం జగన్‌ను ప్రశ్నించారు. అసాంఘిక శక్తులను పెంచి పోషించాలని అనుకుంటున్నారా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్ల కోసం మౌనంగా ఉన్నారని సంచలన ఆరోపించారు. ఇప్పటికే హిందువులపై పలు సందర్భాల్లో దాడులు జరిగాయని.. ఆలయాలను విధ్వంసం చేశారని.. అయితే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం అంటూ మండిపడ్డారు. ప్రజలకు రక్షణ కల్పించలేని వారు పాలకుడు ఎలా అవుతారని సోము వీర్రాజు ప్రశ్నించారు.

  ఇదీ చదవండి : ఆ విషయంలో ఏపీ నెంబర్ వన్.. కేంద్రం నుంచి ప్రశంసలు

  ప్రతిపక్షాలను గృహనిర్బంధాల ద్వారా కట్టడి చేయడంలో మాత్రం పోలీసులు చక్కగా పనిచేస్తున్నారని విమర్శించారు. మరీ పౌరుల రక్షణను గాలికొదిలేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి శోభాయాత్రపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి.. కఠినంగా శిక్ష పడేలా చేయాలని కోరారు. లేదంటే తదుపరి పర్యవసానాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. తమకు ప్రభుత్వం అండ ఉందనే భావనతో కొన్ని వర్గాల వికృత చేష్టలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు.

  ఇదీ చదవండి : శ్రీవారి భక్తులకు శుభవార్త.. మే 1 నుంచి వారికి అవకాశం..

  అధికార పార్టీ ఎమ్మెల్యేలే టిప్పు సుల్తాన్ విగ్రహాలు ఏర్పాటు చేయిస్తారు. జిన్నా టవర్, శ్రీశైలంలో దేవస్థానంలో అన్యమతస్తుల వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేసి హిందువులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని సోము వీర్రాజు మండిపడ్డారు. రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతున్న ప్రభుత్వం స్పందించకపోతే కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో పర్యటిస్తానని స్పష్టంచేశారు. ప్రజాక్షేత్రంలో నిరంకుశ వైఖరిని ఎండగడతా అని సోము వీర్రాజు మండిపడ్డారు. స్వేచ్చగా శోభాయాత్ర చేస్తే రాళ్లు రువ్వడం ఏంటీ అని సోమువీర్రాజు అడిగారు. ఇదీ మంచి పద్దతి కాదన్నారు. దీంతో అల్లరిమూకలు మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాలపై తాము పోరాడుతామని ఆయన స్పష్టంచేశారు. బాధ్యులపై విధిగా చర్యలు తీసుకోవాలని.. ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Kurnool

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు