T. Murali Krishna, News18, Kurnool
ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ అకాల మరణం తెలుగు చలన చిత్రం పరిశ్రమను తీవ్రంగా కలిచివేేసింది.ఆయన మరణవార్త విన్న అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు.. కృష్ణ మరణం తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఒక పెద్ద దిక్కును కోల్పోయింది. ఒకే సంవత్సరంలో ఇద్దరు పెద్ద హీరోలను కోల్పోవడం అనేది చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఈ నేపథ్యంలోనే సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు తమ అభిమానాని చాటుకున్నారు. కర్నూలు పట్టణంలోని కృష్ణ అభిమానులు సంతాప సభ నిర్వహించారు. అదే విధంగా పలువురికి
అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
కర్నూల్ నగరంలోని లక్ష్మీ నగర్లో అల్లూరి సీతారామరాజు యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం టాలీవుడ్ హీరో కృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు యువజన సంఘం అధ్యక్షులు మరియు వైఎస్ఆర్సిపి డిస్టిక్ ఎస్సీ సెల్ వెంకటేష్ మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ గురించి చెప్పాలంటే సినీ చరిత్రలోనే ఆయన గురించి ఒక పెద్ద కథనే రాయవచ్చు అన్నారు.
ప్రపంచంలోనే నెంబర్ వన్ హీరోగా ఎదిగిన సూపర్ స్టార్ కృష్ణ సంవత్సరంలోనే 18 సినిమాలు తీయడం అనేది ఎవరికి సాధ్యం కాలేదు అన్నారు. ఈయనకు సాటి ఎవరూ లేరని అటువంటి హీరో ఇక లేరని మాకు చాలా బాధాకరమైన విషయం... సూపర్ స్టార్ కృష్ణ అభిమానులమైన తాము ఈ సందర్భంగా సంతాప సభను మరియు అన్నదాన కార్యక్రమాన్ని జరుపుతున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో యువజన సంఘం జిల్లా అధ్యక్షులు గున్న మార్కన్న మరియుఅభిమానులు వెంకటేష్ తదితరులు మాట్లాడుతూ టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ టాలీవుడ్ లో ఒక చరిత్ర గల నాయకుడని ఆయన ఎన్నో చిత్రాలు తీశారని నటశేఖర కృష్ణని కొనియాడారు. కార్యక్రమంలో కృష్ణ అభిమానులు చిన్ని హరి ఖలీల్ విక్కీ భరత్ ప్రశాంత్ వలి తదితరులు పాల్గొన్నారు...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool, Local News, Movie