Murali Krishna, News18, Kurnool
పట్టణాల్లో చదువుకున్న మహిళలకు ధీటుగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళలు పోటీ పడుతున్నారు. తాముఏమాత్రం తక్కువ కాదనే విధంగా ఎక్కువ కష్టపడకుండా ఇంట్లో ఉండే ఉపాధి పొందే విధంగావారిలోని నైపుణ్యాన్ని వెలికి తీసి స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి పలు సంస్థలు. ఇందులో భాగంగానే.. కర్నూలు (Kurnool), నంద్యాల జిల్లాల్లోని (Nandyal District) గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళలకు కెనరా బ్యాంక్ (Canera Bank) గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ద్వారా వివిధ అంశాల్లో ట్రైనింగ్ ఇస్తోంది. ఎంబ్రాయిడరీ (మగ్గం వర్క్) లో 30 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ బి.శివప్రసాద్ తెలిపారు.
ఈ శిక్షణకు అర్హతలు వయస్సు 18 సం నుండి 45 సం లోపు ఉండి, చదవడం రాయడం వచ్చి ఉండాలి. దరఖాస్తు చేసుకున్న వారికి శిక్షణ కాలంలో ఉచిత భోజనం మరియు హాస్టల్ వసతి కల్పించబడునని సంస్థ డైరెక్టర్ తెలిపారు. ఈ శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలి అనుకునే ఆసక్తి గల అభ్యర్థులు నాలుగు పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు, రేషన్ కార్డు, ఆధార్, బ్యాంక్ ఖాతా మరియు విద్యార్హత జిరాక్స్ కాపీలు తీసుకుని సంస్థ యందు దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లాలోని మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు సంస్థ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు.
సంస్థ అడ్రస్:
కెనరా బ్యాంకు - గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ, కర్నూలు లోని కల్లూరు -తాహాశీల్దార్ కార్యాలయము పక్కన, కెనరా బ్యాంకు హౌసింగ్ బోర్డు బ్రాంచ్ పైన మూడవ అంతస్తు, కర్నూలు. సెల్ నెంబర్:6304491236
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool, Local News