హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kurnool: కర్నూలులో ప్రత్యక్షమైన సింగం.. నిమజ్జన వేడుకల్లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌!

Kurnool: కర్నూలులో ప్రత్యక్షమైన సింగం.. నిమజ్జన వేడుకల్లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌!

నిమజ్జన

నిమజ్జన వేడుకల్లో సింగం

Kurnool: సూపర్ హిట్ సిరీస్ ల్లో సింగం ఒకటి.. సూర్య పోలీస్ ఆఫీసర్ గా విలన్లు రఫ్పాడించేస్తాడు.. సేమ్ అదే స్టైల్లో ఇప్పుడు మన రియల్ సింగ్ సందడి చేశారు. బుల్లెట్ బైక్ పై రైడ్ చేస్తూ.. సైరన్ మోగించారు.. రియల్ సింగం అంటూ పొగడ్తలు అందుకున్నారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Kurnool, India

  T. Murali Krishna, News18, Kurnool.

  సిద్ధార్థ్‌ కౌశల్‌ ఐపీఎస్‌ (Sidharth Kousal IPS).. ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో ఈ పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎక్కడ విధుల్లో ఉన్నా తనకంటూ ప్రత్యేక మార్క్‌ వేసుకునే సిద్ధార్థ్‌ కౌశల్‌ ప్రస్తుతం కర్నూలు జిల్లా (Kurnool District) ఎస్పీగానూ తనదైన శైలిలో ప్రజలకు దగ్గరవుతున్నారు. ఫ్రెండ్లీ పోలిసింగ్‌ (Friendly Policing) ను పరిచయం చేస్తున్నారు. ముఖ్యంగా గణేష్‌ నిమజ్జన వేడుక (Ganesh Immersion) ల్లో ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. బుల్లెట్‌ బైక్‌పై తిరుగుతూ ప్రజలను ఓకింత ఆశ్చర్యానికి గురిచేశారు. సింగం  సిరీస్ సినిమాల్లో  సూర్యని చూసినట్లు ఉందని యూత్‌ తమ స్టయిల్‌లో పొగిడేస్తున్నారు.

  ఆదోని పట్టణంలో జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్, డిఎస్పీ వినోద్ కుమార్‌తో కలిసి గణేష్ నిమజ్జన విగ్రహాల ఊరేగింపు, శోభయాత్రను బుల్లెట్ వాహానంపై తిరుగుతూ పరిశీలించారు. ఆదోని పట్టణం సున్నిత సమస్యాత్మక ప్రాంతం కావడంతో ఉత్సవాలను జిల్లా ఎస్పీ దగ్గరుండి పర్యవేక్షించారు. బుల్లెట్‌పై సాధారణ పౌరుడిగా తిరుగుతూ ప్రజలకు తాను ఉన్నానంటూ ధైర్యాన్ని ఇచ్చారు.

  ఒక ఎస్పీ స్థాయి వ్యక్తి ఇలా రోడ్డుపై అది బుల్లెట్‌ బైక్‌లో తిరగడం తామెప్పుడూ చూడలేదంటూ కర్నూలు ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. నిజమైన పోలీస్‌ అంటూ ఎస్పీ సిద్ధార్థ్‌కు సలాం చేస్తున్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఆదోని డిఎస్పి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారులు సిబ్బందికి పలు సూచనలు చేశారు. పట్టణంలోని పలు రోడ్లను బార్‌కేడ్‌లతో దిగ్బంధించారు. ఆదోని చుట్టుపక్కల పల్లెల నుంచి రాకపోకలు సాగించే ఆటోలను పట్టణం బయటే నిలిపేశారు. ఆదోని పట్టణంలోకి ఎలాంటి లారీలు బస్సులు భారీ వాహనాలను అనుమతించకుండా పరిస్థితిని పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు పోలీసులు.

  ఇదీ చదవండి : టీడీపీ , పవన్ లకు వార్నింగ్ ఇచ్చారా..? జూనియర్ ఎన్టీఆర్ సేవలను వాడుకుంటామన్న సోము వీర్రాజు

  పట్టణంలోని పోలీసు గెస్ట్ హౌస్ నుండి ఎస్పీ సిద్ధార్థ్‌ బుల్లెట్‌ బైక్ పై బయలు దేరి మండిగేరి, ఎమ్మిగనూరు సర్కిల్, బీమా సర్కిల్, శ్రీనివాస్ భవన్ మీదుగా ఏరియా హాస్పిటల్ అక్కడి నుండి తిరిగి ఆదోని సూపర్ బజార్, మార్కెట్ , ఎమ్ ఎమ్ రోడ్డు, షరాఫ్ బజార్, బుడేకల్, హావన్నపేట, కౌడల్ పేట, తిక్కస్వామి దర్గా, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ నుండి బైపాస్ మీదుగా తిరిగి పోలీసు గేస్ట్ చేరుకున్నారు.

  ఇదీ చదవండి :జూనియర్ ఎన్టీఆర్ ను అంత అవమానించారా..? చంద్రబాబు తీరుపై కోడాలి నాని సంచలన వ్యాఖ్యలు

  తుంగభద్ర నదికి వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో…. నిమజ్జనం జరిగే నది తీర ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నది తీరం దగ్గర గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు. నిమర్జన కార్యక్రమంలో ఎక్కువమంది గుంపులు గుంపులుగా వెళ్లకుండా ప్రజలకు తగిన సూచనలు చేశారు.

  ఇదీ చదవండి: అందరి టార్గెట్ మంత్రి రోజానే.. బహిరంగంగానే ఫైట్ స్టార్ట్ చేసిన ప్రత్యర్థి వర్గం

  పలు చోట్ల పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ సూచనలు చేశారు. పట్టణంలో నిమజ్జనం పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలన్నారు. ప్రజలకు అసౌకర్యం, ట్రాఫిక్ అంతరాయం, ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని తెలిపారు. గణేష్ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో ముగిసే విధంగా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. ఆదోని మరియు ఎమ్మిగనూరు పట్టణంలోని నిమర్జనం కార్యక్రమం ముగిసే వరకు అర్ధరాత్రి అయినా అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు పూర్తి సమాచారం అందజేయాలని ఆదేశాలు జారిచేశారు.

  ఇదీ చదవండి : టీటీడీకీ షాక్.. సేవ కల్పించనందుకు.. నష్టపరిహారంగా భక్తుడికి 50 లక్షలు చెల్లించాలన్న కోర్టు

  ఏదేమైనా సిద్ధార్థ్‌ కౌశల్‌ బుల్లెట్‌ బైక్‌పై అలా వస్తుంటే..తాము సింగంలో సూర్యని, ఫవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ని చూస్తున్నట్లు ఉందని కర్నూలు వాసులు సంబరపడ్డారు. మొత్తానికి ప్రశాంతవాతావరణంలో ఆ బొజ్జ గణపయ్యను వెళ్లిరావయ్యా అంటూ సంబరాల నడుమ సాగనంపారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Ganesh immersion, Kurnool, Local News

  ఉత్తమ కథలు