హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

మహాదుర్గ అలంకారంలో భ్రమరాంబికాదేవి దర్శనం.. ఒక్కసారి దర్శిస్తే చాలు

మహాదుర్గ అలంకారంలో భ్రమరాంబికాదేవి దర్శనం.. ఒక్కసారి దర్శిస్తే చాలు

X
శ్రీశైలం

శ్రీశైలం ఆలయంలో ఘనంగా భ్రమరాంభ ఉత్సవాలు

ఉమ్మడి కర్నూలు జిల్లా (Kurnool District) అష్టదశ శక్తీ పీఠాలలో ఒకటైన 6వ శక్తీ పీఠంగా కొలిచిన వారికికొంగు బంగారుగా చేసే ఆ దేవదేవి భ్రమరాంభికా అమ్మవారి ఉత్సవాలు శ్రీశైలం (Srisailam Temple) లో కనులపండువగా కొనసాగుతున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Kurnool, India

Murali Krishna, News18, Kurnool

ఉమ్మడి కర్నూలు జిల్లా (Kurnool District) అష్టదశ శక్తీ పీఠాలలో ఒకటైన 6వ శక్తీ పీఠంగా కొలిచిన వారికికొంగు బంగారుగా చేసే ఆ దేవదేవి భ్రమరాంభికా అమ్మవారి ఉత్సవాలు శ్రీశైలం (Srisailam Temple) లో కనులపండువగా కొనసాగుతున్నాయి. అమ్మవారి పుట్టినిల్లు గా భావించే కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాలనుంచి భక్తులు లక్షల సంఖ్యలో మహా పుణ్యక్షేత్రానికి తరలిస్తున్నారు. కర్ణాటక ప్రాంతం అమ్మవారి పుట్టినిల్లుగా భావించి భక్తులు భ్రమరాంభిక మాత కోసం ప్రత్యేకంగా చీర సారి పట్టు వస్త్రాలతో ఉగాది పండుగను జరుపుకోవడం అనవయితీగా వస్తున్న ఆచారం. దింతో ఆలయా అధికారులు భక్తుల రద్దీనిదృష్టిలో ఉంచుకుని ప్రత్యేకమైన ఏర్పాట్లను పూర్తి చేసారు. మహా పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఎప్పటికి అప్పుడు భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు ఆలయ అధికారులు.

ఈ నేపథ్యంలోనే శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు రెండవ రోజు కన్నులపండువగా సాగుతున్నాయి ఉత్సవాల రెండవ రోజులో భాగంగా నేడు మహాదుర్గ అలంకార రూపంలో శ్రీభ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమిచ్చింది అక్క మహాదేవి అలంకార మండపంలో ప్రత్యేక వేదికపై మహాదుర్గ అలంకారరూపంలో ఆశీనులైన అమ్మవారికి కైలాస వాహనాదీసులైన శ్రీస్వామి అమ్మవారికి అర్చకులు వేదపండితులు ఈవో ఎస్.లవన్న దంపతులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులిచ్చారు.

ఇది చదవండి: శ్రీశైలంలో కన్నుల పండువగా ఉగాది బ్రహ్మోత్సవాలు..

అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు బాజా బజంత్రిలు బ్యాండ్ వాయిద్యాల నడుమ డప్పు చప్పుల్లు కోలాటాలు లంబాడీల ఆటపాటల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లు శ్రీశైల క్షేత్ర పురవీధుల్లో విహరించారు ఆలయ ఉత్సవం ముందు భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామి అమ్మవార్లను దర్శించుకుని కర్పూర నీరాజనాలర్పించారు.

కన్నడ భక్తుల నడుమ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి అమ్మవార్ల గ్రామోత్సవం నిర్వహించారు. వేలాదిమంది కన్నడ భక్తులు శ్రీస్వామి అమ్మవారిని దర్శించుకొని పునితులైనారు. ఈ పూజ వాహనసేవ కార్యక్రమలలో ఈవో లవన్న దంపతులు,అధికారులు పెద్దఎత్తున కన్నడ భక్తులు పాల్గొన్నారు.

First published:

Tags: Andhra Pradesh, Local News, Nagarkurnool, Srisailam Temple

ఉత్తమ కథలు