Home /News /andhra-pradesh /

KURNOOL BHEEMUNI KOLANU IN KURNOOL DISTRICT ANDHRA PRADESH HAS ANCIENT HISTORY PANDAVAS VISITED THIS PLACE AS PER HINDU MYTHOLOGY FULL DETAILS HERE PRN NJ

Nallamala Forest: భీముని కొలను.. ప్రకృతి అందాలకు నెలవు! పాండవుల వనవాసం అక్కడే..!

నల్లమలలోని భీముని కొలను

నల్లమలలోని భీముని కొలను

పురాణాల్లో శ్రీపర్వతంగా పిలిచే శ్రీశైలం.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని నంద్యాల జిల్లాలో దట్టమైన నల్లమల అటవీ ప్రాంతం ప్రకృతి రమణీయతకు నెలవు. ఈ నల్లమలలో ఎన్నో ఔషధ గుణాలున్న మొక్కలు ఉన్నాయి. అంతేకాదు రెండు కొండ రాళ్ల గుండా సెలయేరు సవ్వడి చేస్తూ పరుగులు తీస్తుంది.

ఇంకా చదవండి ...
  పురాణాల్లో శ్రీపర్వతంగా పిలిచే శ్రీశైలం.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని నంద్యాల జిల్లాలో దట్టమైన నల్లమల అటవీ ప్రాంతం ప్రకృతి రమణీయతకు నెలవు. ఈ నల్లమలలో ఎన్నో ఔషధ గుణాలున్న మొక్కలు ఉన్నాయి. అంతేకాదు రెండు కొండ రాళ్ల గుండా సెలయేరు సవ్వడి చేస్తూ పరుగులు తీస్తుంది. ఈ కొలను భీముని కొలనుగా అభివర్ణిస్తారు. పర్యాటకులను కనువిందుచేసే ఈ కొలనుకు ఆ పేరు ఎలా వచ్చింది? దాని వెనక ఉన్న కథనం ఏంటి? లోమశ మహర్షితో కలిసి పూర్వం పాండవులు తీర్థయాత్రలు చేస్తూ ఈ క్షేత్రానికి చేరుకున్నారట. ఈ ప్రదేశానికి రాగానే ద్రౌపది తనకి చాలా దాహంగా ఉందని పాండవులతో చెప్పడంతో.. భీముడు వెంటనే ఆ పరిసరాల్లో ఎక్కడైనా నీళ్లు దొరుకుతాయో అని చూశాడు. కానీ తనకు ఎక్కడా నీళ్లు దొరకకపోవడంతో కాస్త అసహనాన్ని వ్యక్తం చేశాడు.

  దాంతో భీముడికి లోమశ మహర్షి అక్కడ ఉన్న ఒక శిలను చూపించి దాన్ని పగులగొట్టమని చెప్పాడంట. ఇంకేముంది, బీముడు తన 'గద'తో ఆ శిలను రెండు ముక్కలుగా పగులగొట్టాడు. వెంటనే ఆ రాళ్ల మధ్య నుంచి నీరు ధారలుగా రావడం మొదలయ్యింది. ఆ నీటితోనే ద్రౌపది తన దాహం తీర్చుకుంది.

  ఇది చదవండి: కదిరి మల్లెకు అంతటి సువాసన ఎలా..? ఖాద్రీశుడికి ఈ మల్లెలతోనే అలంకరణ ఎందుకు..?


  భీముని కొలనుగా పేరు..!
  భీముడి వల్ల ఏర్పడిన కొలను కావడం వలన దీనికి 'భీముని కొలను' అనే పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. ఆ రోజు ఇక్కడే భీముడు తన చేతులతో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఆ లింగానికి ఈ నీటితో అభిషేకం చేశాడు. అందుకే ఇక్కడి శివలింగం 'భీమలింగం'గా నేటికీ పూజలు అందుకుంటోంది.

  ఇది చదవండి: బిడ్డ పుట్టాలంటే కీడుపాకకు వెళ్లాల్సిందే..! ఆ మూడు రోజులూ అక్కడే..! ఏపీలో వింత ఆచారం..


  ప్రకృతి అందాలకు నెలవు..!

  శ్రీశైల మల్లిఖార్జున్ని దర్శించుకోవడానికి పూర్వం భక్తులు కాలినడకన వచ్చేవాళ్లు. ఈ భీమునికొలను మీదగానే కాలినడకన వచ్చే భక్తులు శ్రీశైలానికి చేరుకునేవాళ్లు. శ్రీశైలానికి ఉన్న నాలుగు కాలిబాట మార్గాల్లో భీమునికొలను దారే భక్తులకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. అందుకనే భక్తులు ఎక్కువగా ఈ దారి నుంచే వెళ్తుంటారు. ఈ భీముని కొలను లోయ ప్రాంతం ప్రకృతి అందాలతో అలరారుతూ భక్తులు, పర్యాటకుల మనసులను కట్టిపడేస్తుంది.

  ఇది చదవండి: చింతగింజలకు కాసులు రాలుతున్నాయ్..! ఏడాదికి కోట్లలో బిజినెస్.. మీరూ ఓ లుక్కేయండి..!


  నిరంతరం ప్రవహించే సెలయేరు..!
  ఈ భీముని కొలను లోని నీరు..మండు వేసవిలో కూడా నిరంతరం ప్రవహిస్తుంటుంది. కైలాసద్వారం నుంచి సుమారు 2వేల అడుగుల లోతులో ఈ భీమునికొలను ఉంటుంది. ఈ లోయ చుట్టూ సుమారు 650 అడుగుల పైగా ఎత్తులో దట్టమైన కొండలు విస్తరించి ఉన్నాయి. రంపంతో కోసినట్లుగా ఏర్పడ్డ నునుపైన సహజశిలలు లోయ చుట్టూ ముచ్చటగా ఉంటాయి. కొండల్లోంచి ఉబికి వచ్చే సహజ జలధారలు లోయలో బండరాళ్లపై ప్రవహిస్తూ, పెద్దకోనేరులాగా కనిపించే భీమునికొలను చేరి పొంగిపొర్లుతుంటాయి. ఆ సెలయేరు సవ్వడికి మనసంతా ప్రశాంతంగా మారుతుంది.

  Bheemuni Kolani in Srisailam

  ఎలా వెళ్లాలి?
  శ్రీశైలం నుంచి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న హఠకేశ్వరం వెళ్లాలి. అక్కడి నుంచి కుడివైపున అడవి దారిలో 2 కి.మీ. ప్రయాణిస్తే కైలాసద్వారం వస్తుంది. అయితే హఠకేశ్వరం నుంచి కైలాస ద్వారం వరకు మట్టిరోడ్డు ఉంటుందిది. కారు, జీపు, చిన్న వాహనాల్లో ఇక్కడికి ఈజీగా వెళ్లొచ్చు. కైలాసద్వారం నుంచి సుమారు 850 మెట్లు దిగితే వచ్చే లోయ ప్రాంతమే భీమునికొలను. ఈ సారి శ్రీశైలం ట్రిప్‌ వెళ్లినప్పుడు.., మీరు ఒక్కసారి ఆ కొలను, అక్కడి ప్రకృతి అందాలను చూసిరండి.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Kurnool, Nallamala forest, Srisailam

  తదుపరి వార్తలు