Home /News /andhra-pradesh /

KURNOOL AZADI KA AMRIT MAHOTSA CELEBRATIONS IN KURNOOL PRIVATE SCHOOL ASSOCIATION ORGANIZED A TIRANGA RALLY KNL NJ NGS

Kurnool: హర్ ఘర్ తిరంగా రెప రెపలు.. కర్నూలులో భారీ జాతీయ జెండా.. ప్రత్యేకత ఏంటంటే?

కర్నూలులో

కర్నూలులో భారీ జాతీయ జెండా

Kurnool: కర్నూలు నగరంలోని ప్రైవేట్‌ పాఠశాలల అసోసియేషన్, ప్రభుత్వ పాఠశాలల ఆధ్వర్యంలో దాదాపుగా 4 వేల మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. రాజవిహార్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు జాతీయ జెండాను ప్రదర్శించారు. ఈ జెండా పొడుగెంతో తెలిస్తే షాక్ అవుతారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Kurnool, India
    T.Murali Krishna, News 18, Kurnool

    Kurnool: దేశ వ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. హర్‌ ఘర్‌ తిరంగా అంటూ ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ప్రధాని మోదీ (Prime MInster Modi ) పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వాతంత్య్ర వేడుకలు (Independence day celebrations) అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతంగా చేసేందుకు కేంద్ర సాంస్కృతిశాఖ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఆగస్టు 15వ తేదీ నాటికి 75 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ (Azadi Ka Amrit Mahotsav) కార్యక్రమం పేరుతో ప్రత్యేక ప్రచారం నిర్వహిస్తోంది కేంద్ర సర్కార్‌. ఈ నెల 15 తేదీ వరకు  ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.

    ఈ నేపథ్యంలో హర్ ఘర్ కా తిరంగ, అజాదిక అమృత్ మహోత్సవంలో భాగంగా కర్నూలులో వేడుకలు రోజురోజుకు ఆకాశానికి అంటుతున్నాయి. ప్రతి ఒక్కరు తమకున్న దేశభక్తి తెలియజేసేందుకు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. కర్నూలు నగరంలోని ప్రైవేట్‌ పాఠశాలల అసోసియేషన్ మరియు ప్రభుత్వ పాఠశాలల ఆధ్వర్యంలో దాదాపుగా 4 వేల మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు.



    రాజవిహార్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు 600 మీటర్ల పొడవు గల జాతీయ జెండాను ప్రదర్శిస్తూ భారతదేశ ఔన్నత్యాన్ని చాటేలా ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు, విద్యాశాఖ అధికారి రంగారెడ్డి విద్యార్థుల ర్యాలీకి కలెక్టరేట్ వద్ద స్వాగతం పలికారు. ఈ ర్యాలీలో ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొనడం చాలా ఆనందంగా ఉందంని కలెక్టర్‌ కోటేశ్వరరావు తెలిపారు.

    ఇదీ చదవండి : ఆంధ్రా సరిహద్దులో భూతల స్వర్గం.. ఆకట్టుకుంటున్న పర్యాటక ప్రాంతం.. ప్రత్యేకతలు ఎన్నో?

    పిల్లల్లో దేశభక్తిని పెంపొందించేందుకు..మన స్వాతంత్య్ర సమరయోధుల ప్రాణత్యాగాలు తెలుసుకునేందుకు పిల్లలకు ఇదో చక్కని అవకాశమన్నారు. మనకు స్వాతంత్య్రం తెచ్చి పెట్టినటువంటి గొప్ప గొప్ప నాయకులు, వారి జీవితాలు పూర్తిగా తెలుసుకొని దేశసేవ చేయాలని కోరారు. స్వాతంత్య్ర సమరయోధుల జీవిత చరిత్రను వారి త్యాగాలను విద్యార్థులకు తెలియజేయాలని కర్నూల్ డిఇఓ రంగారెడ్డి ఉపాధ్యాయులను కోరారు.

    ఇదీ చదవండి: పూర్తవుతున్న పునర్ నిర్మాణం.. రేపటి నుంచి వరసిద్ధి వినాయక ఆలయంలో కుంభాభిషేకం.. వారం రోజుల పాటు ఉత్సవాలు

    ఆదోని పట్టణంలో కూడా వివిధ విద్యాసంస్థలు, కళాశాలల ఆధ్వర్యంలో తిరంగ యాత్ర నిర్వహించారు. బాలాజీ, డాక్టర్‌ జోతిర్మయి జూనియర్‌ కళాశాల ఆధ్వర్యంలో మున్సిపల్‌ రోడ్‌పై భారీ ర్యాలీ చేపట్టారు. సరస్వతీ శిశుమందిరం ఆధ్వర్యంలో 200 మీటర్ల పొడవు ఉన్న జాతీయ జెండాతో విద్యార్థులు ప్రదర్శన చేశారు. దేశభక్తి గీతాలతో విద్యార్థులు శివారు ప్రాంతాల్లో ర్యాలీ తీశారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి ఇంటిపై ప్రజలు స్వచ్ఛందంగా జాతీయ జెండాలను ఎగురవేస్తున్నారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Azadi Ka Amrit Mahotsav, Kurnool, Local News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు