హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Police Gun: పోలీసుల గన్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..? ఓపెన్ హౌస్ ఉద్దేశం ఇదే..

Police Gun: పోలీసుల గన్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..? ఓపెన్ హౌస్ ఉద్దేశం ఇదే..

X
పోలీస్

పోలీస్ గన్స్ గురించి మీకు తెలుసా?

Kurnool: గన్ చూడాలనుకోవాలి.. బుల్లెట్ చూడాలి అనుకోకుడదు అన్న డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో అందరికీ తెలిసిందే.. అయితే చాలామందికి పోలీస్ గన్ ను దగ్గర నుంచి ఒక్కసారైనా చూడాలని కోరిక ఉంటుంది. అసలు ఆ పోలీస్ గన్ ల గురించి మీకు తెలుసా..?

  • News18 Telugu
  • Last Updated :
  • Kurnool, India

Murali Krishna, News18, Kurnool

Kurnool: గన్ ను చూడాలి అనుకో తప్పు లేదు.. కానీ బుల్లెట్ చూడాలి అనుకోకు అని అతడు (Athadu Movie)లో మహేష్ బాబు (Mahesh Babu) చెప్పిన డైలాగ్ క్లాప్స్ కొట్టించింది. నిజంగానే గన్ ను దగ్గర నుంచి చూడాలని చాలామందికి ఉంటుంది. పోలీస్ చేతిలో ఉన్న గన్ ఎలా ఉంటుంది..? ఒక్కసారి టచ్ చేయాలని.. దగ్గర నుంచి చూడాలని చాలామంది కోరుకుంటారు.. కానీ అది అందరికీ సాధ్యం కాదని డౌట్ పడకండి.. దగ్గర నుంచి గన్ లను చూసే అవకాశం కల్పిస్తున్నారు. పోలీసులు..  ఎందుకంటే..?  పోలీసు అమర వీరుల వారోత్సవాలలో భాగంగా కర్నూలు జిల్లా (Kurnool District) పోలీసు కార్యాలయంలోని పరేడ్ మైదానంలో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కర్నూలు ఎఆర్ అడిషనల్ ఎస్పీ జి. నాగబాబు, కర్నూలు పట్టణ డిఎస్పీ కెవి మహేష్ ప్రారంభించారు.

జిల్లా పోలీసులు వినియోగించే ఆయుధాలు, పరికరాలు, సాధనాలను ఒపెన్ హౌస్ కార్యక్రమంలో భాగంగా ప్రదర్శనలో ఉంచారు. పోలీసు వ్యవస్ధ పనితీరు గురించి, విధుల్లో వినియోగించే వివిధ రకాల ఆయుధాల గురించి విద్యార్థులకు ఎఆర్ డిఎస్పీ ఇలియాజ్ భాషా, పోలీసు సిబ్బంది అవగాహన కల్పించారు.ఎలాంటి సందర్భంలో ఎలాంటి ఆయుధాన్ని వినియోగిస్తారు, వాటి పని తీరు గురించి వివరించారు.

ప్రదర్శనలో ఉంచిన ఆయుధాలు ఇవే.. 

ఈ ప్రదర్శనలు పలు రకాలు ఆయుదాలు ఉంచారు. వాటి చూసేందుకు వచ్చిన వారికి పూర్తి వివరాలు కూడా అందించారు. అవి ఏంటంటే..? 22 రైఫిల్, 410 మస్కెట్ , 303 రైఫిల్ , 303 జి.ఎఫ్ రైఫిల్, .303 GF రైఫిల్ విత్ D.CUP, .303 LMG విత్ మ్యాగజైన్,7.62MM బార్, 7.62MM SLR, 5.56 ఇన్సాస్ రైఫిల్ , ఎకె – 47 రైఫిల్, 9MM కార్బైన్, 9MM గ్లాక్ పిస్టల్.., 9MM పిస్టల్,  380 రివాల్వర్, 12 బోర్ పంప్ యాక్షన్ గన్, 51MM మోర్టార్, యు.బి.జి.ఎల్, .303 RIOT తుపాకీ, 1.5" ఫెడరల్ గ్యాస్ గన్, V.L పిస్టల్ లాంటి గన్ లే కాదు..

ఇదీ చదవండి : ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకుంది అనుకున్నారు..? రాజకీయ నేతలూ న్యాయం కోసం నినాదాలు చేశారు.. కానీ ట్విస్ట్ ఏంటంటే?

వాటితో పాటు టియర్ స్మోక్ షెల్స్, టియర్ స్మోక్ గ్రెనేడ్, ప్లాస్టిక్ పిల్లెట్ , కెన్ లాఠీ, ఫైబర్ లాఠీ, స్టోన్ గార్డ్ , బాడీ ప్రొటెక్టర్, బాడీ ప్రోటెక్టర్ , హెల్మెట్, B.P జాకెట్, గ్రౌండ్ షీట్లు, బాడీవోన్ కెమరాలు, డ్రోన్ కెమేరాలు, బాంబు డిస్పోజల్ టీం ,విహెచ్ ఎఫ్ సెట్ మ్యాన్ ప్యాక్స్, బాంబ్ బ్లాంకెట్, వెహికల్ ఇన్ స్పెక్షన్ మిర్రర్ , ఎక్స్ టెన్సన్ మిర్రర్, ఎక్స్ ప్లోజివ్ డిటెక్టర్, రాకర్, డ్రాగన్ లైట్, డోర్ ప్రేమ్ మెటల్ డిటెక్టర్, ఫింగర్ ఫ్రింట్ పరికరాలు, డాగ్ స్క్వాడ్ బృందాలు తదితర ఆయుధాలను ప్రదర్శనలో ఉంచారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, AP Police, Kurnool, Local News

ఉత్తమ కథలు