హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP News: తక్కువ ధరకే ఎలక్ట్రికల్ సూపర్ కార్.. ఆటో డ్రైవర్ అద్భుత సృష్టి

AP News: తక్కువ ధరకే ఎలక్ట్రికల్ సూపర్ కార్.. ఆటో డ్రైవర్ అద్భుత సృష్టి

X
కర్నూలు

కర్నూలు జిల్లాలో ఎలక్ట్రిక్ కారు తయారు చేసిన ఆటో డ్రైవర్

చిన్నప్పటి నుంచి కారులో తిరగాలి అని కలలు కన్నా ఓ సామాన్యుడు ఆవిష్కరించిన ఎలక్ట్రికల్ కార్.. ప్రస్తుతం బడా బడా కంపెనీలను సైతం ఔరా అనిపిస్తోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Kurnool, India

Murali Krishna, News18, Kurnool

కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అని ఓ డ్రైవర్ నిరూపించాడు. పేద కుటుంబంలో జన్మించిన అతడు చిన్నప్పటి నుండి ఏదో చేయాలనే తపన, పట్టుదల అతడిని బ్యాటరీ కారును తయారు చేసేలా చేసింది.. ఆలోచన వచ్చిందే తరువాయి వెంటనే కారును తయారు చేసి రోడ్లుపై రయ్యి రయ్యి మంటూవెళ్తూ ఉంటే అందరు అవాక్కువుతున్న వైనంపై ప్రత్యేక కథనం. చిన్నప్పటి నుంచి కారులో తిరగాలి అని కలలు కన్నా ఓ సామాన్యుడు ఆవిష్కరించిన ఎలక్ట్రికల్ కార్.. ప్రస్తుతం బడా బడా కంపెనీలను సైతం ఔరా అనిపిస్తోంది. తెలంగాణ (Telangana) లోని జోగులాంబ గద్వాల జిల్లా (Jogulamba Gadwal District) ఉండవల్లి మండలం బొంకూరు గ్రామానికి చెందిన సామాన్య మధ్య తరగతి కుటుంబానికి చెందిన బీచుపల్లి.. కర్నూలు జిల్లాలో ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడు.

చిన్ననాటి నుంచి తన కుటుంబ సభ్యులతో కార్లో తిరగాలని బీచుపల్లి కలలు కనేవాడు. కానీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉండడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాడు. ఇందులో భాగంగా మొదట్లో ఓ డిజిల్ ఆటోను ఎలక్ట్రికల్ ఆటోగా మార్చి విజయం సాధించాడు. మొదటి ప్రయత్నం విజయవంతం అవడంతో రెట్టించిన ఉత్సా హంతో ఏకంగా ఎలక్ట్రికల్ కారుని తయారు చేశాడు.

ఇది చదవండి: మద్యం కేసులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి బిగ్ రిలీఫ్

కేవలం 1,20,000 ఖర్చుతో ఒకసారి చార్జింగ్ చేస్తే 100 కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యం గల ఎలక్ట్రికల్ కార్ను తయారు చేయడంతో బీచుపల్లి ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాడు. ఇటీవల హైదరాబాదులో నిర్వహించిన కార్నివాల్ ప్రోగ్రాం లో తన కారును ప్రదర్శించడంతో బొంకూరు చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు ఇప్పుడు బీచుపల్లి తయారు చేసిన కారును చూసేందుకు క్యూ కడుతున్నారు.

బీచుపల్లి తయారుచేసిన ఎలక్ట్రికల్ కార్ ఒకసారి చార్జి చేస్తే 100 కిలోమీటర్లు ప్రయాణించడమే కాకుండా మారుమూల పల్లెటూరులోని రోడ్లలో సైతం తిరుగుతూ వ్యవసాయ పనులకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని బీచుపల్లి అంటున్నారు. అంతే కాకుండా తాను తయారు చేసిన ఎలక్ట్రికల్ కార్ 5 క్వింటాళ్ల వరకు బరువు మోసే సామర్ధ్యంతో కలిగి ఉందని బీచుపల్లి అంటున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Electric Car, Kurnool, Local News

ఉత్తమ కథలు