Home /News /andhra-pradesh /

KURNOOL AUTO ACCIDENT WOMEN WORKER DIED KNL NJ ABH

Kurnool: కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా..! ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది..!


కర్నూలు జిల్లా నేర వార్తలు

కర్నూలు జిల్లా నేర వార్తలు

ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్న సంఘటన నందికొట్కూరులో జరిగింది. కోటవీధికి చెందిన పలువురు మహిళలు రోజు కూలి పనులకు ఆటోలో బయల్దేరారు. మిడుతూరు మండలంలోని విపనగండ్లకు పనులనిమ్మిత్తం వెళ్తుండగా ఆటో బోల్తా పడింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Kurnool, India
    (T.Murali Krishna, News 18, Kurnool)

    ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్న సంఘటన నందికొట్కూరులో జరిగింది. కోటవీధికి చెందిన పలువురు మహిళలు రోజు కూలి పనులకు ఆటోలో బయల్దేరారు. మిడుతూరు మండలంలోని విపనగండ్లకు పనులనిమ్మిత్తం వెళ్తుండగా ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న మహిళా కూలీల్లో ఒకరు మృతి చెందగా… మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడ్డవారిని వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


    టీకా వికటించి కోడెదూడ మృతి
    గొంతు వాపు వ్యాధి నిరోధక టీకా వికటించి మూడు నెలల కోడెదూడ మృతి చెందిన ఘటన చాగలమర్రి మండల పరిధిలోని ముత్యాలపాడు గ్రామంలో చోటుచేసుకుంది. పశు వైద్యాధికారి లేకుండా గ్రామ సచివాలయం పశుసంవర్ధక శాఖ సహాయకులు టీకాలు వేయడం వల్లే ఇలా జరిగిందంటూ రైతు నరసయ్య ఆరోపిస్తున్నాడు. టీకా వేసిన కొద్దిసేపటికే రక్తం కక్కుకుంటూ కోడెదూడ మృతి చెందినట్లు తెలిపాడు.

    తండ్రితో గొడవపడి..!
    బండి ఆత్మకూరు మండలం ఏ. కోడూరు కు చెందిన యూసఫ్ అనే యువకుడు తండ్రితో గొడవ పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహానంది మండలం నందిపల్లి గ్రామ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. వారం రోజుల క్రితం యూసఫ్‌ తన తండ్రితో గొడవపడి గోపవరంలోని అవ్వతాత వద్ద ఉంటున్నాడు. తండ్రితో జరిగిన గొడవకు తీవ్ర మనస్థాపం చెందిన యూసఫ్‌ శుక్రవారం తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకునట్లు పోలీసులు తెలిపారు.

    వేడుకలు చూసేందుకు వచ్చి…!
    కొత్తపల్లి మండలం కలబందపాడు గ్రామంలో మొహరం వేడుకలు చూసేందుకు వచ్చిన పిల్లాడు ప్రాణాలు కోల్పోయాడు. ఏదురుపాడు గ్రామానికి చెందిన లక్ష్మీదేవి వెంకటరమణ దంపతుల కుమార్తె సంగీత(13)… ఇందిరేశ్వరం గ్రామానికి చెందిన పానుగంటి పాలయ్య, సాలమ్మల కుమారుడు పానుగంటి మహేష్(12) తమ బంధువుల ఇంటికి వచ్చారు. శుక్రవారం కుటుంబ సభ్యులు బట్టలు ఉతికేందుకు గ్రామ సమీపంలోని కుంట వద్దకు వెళ్లారు.

    వాళ్లతో పాటు మహేష్ సంగీతలు కూడా వెళ్లారు. అక్కడ సరదాగా ఇద్దరు కలిసి నీటిలో దిగి ఆడుకుంటుండగా… నీటి లోతు ఎక్కువగా ఉండడంతో ఈత రాక ఇద్దరు మునిగిపోయారు. అది గమనించిన బంధువులు నీటిపై తేలుతున్న సంగీత తల వెంట్రుకలు పట్టుకుని ఒడ్డుకు చేర్చారు. అప్పటికే నీటిలో మునిగిపోయి మహేష్ మృతి చెందగా.. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సంగీతను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

    అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
    సంజనుల మండలం ఆకుమల్లకు చెందిన దారెడ్డి సూర్యనారాయణ రెడ్డి(57) అనే రైతు అప్పులబాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనకున్న రెండు ఎకరాలలో పంట సాగు చేయడానికి…. సుమారు 8 లక్షలు అప్పుచేశాడు. పొలంలో మిరప, మినుము, వేరుశనగ, పంటలు సాగు చేశాడు. వర్షాలు అధికం కావడంతో దిగుబడి చేతికి అందకపోవడంతో మనస్థాపం చెందిన సూర్యనారాయణ రెడ్డి.. పొలానికి తీసుకొచ్చిన విషపుగుళికలు మింగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన బంధువులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రైతు మృతి చెందాడు.

    Read This; Vizag News: రక్షా బంధన్ రోజు వృక్షా బంధన్.. ఆకట్టుకున్న విద్యార్థుల ప్రయత్నం
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Andhrapradesh, Crime news, Kurnool, Local News

    తదుపరి వార్తలు