Murali Krishna, News18, Kurnool
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ఇళ్ల పథకమే హాట్ టాపిక్ గా మారుతోంది. జగనన్న కాలనీలతో పాటు టిడ్కో ఇళ్ల అంశంపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని తప్పుబడుతున్నాయి. ఐతే కొన్నిచోట్ల ఇళ్లు నిర్మించినా అధ్వానంగా ఉండటం, సౌకర్యాలు లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లా (Kurnool District) వ్యాప్తంగా పేదలకు పక్కా గృహలపేరుతో గత ప్రభుత్వం టిడ్కో గృహల నిర్మాణం చేపట్టింది. దీని కోసం కొన్ని వందల కోట్లు వెచ్చించి ప్రభుత్వ భూముల్లో ఇళ్ల 65% పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసింది. ప్రస్తుత ప్రభుత్వం వాటికి రంగులు వేసి గృహప్రవేశాల కోసం ప్రారంభించిది. కానీ నేటికీ వాటిని లబ్దిదారులకు అందించలేనటువంటి పరిస్థితి.
కనీస సౌకర్యాలు కల్పించలేని ప్రభుత్వాలు
ఏపీ టౌన్ షిప్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టిడ్కో ఆధ్వర్యంలో నిర్మించిన గృహాలు పలు సమస్యలతో సహవాసం చేస్తున్నాయి. కర్నూల్ కార్పొరేషన్ తో పాటు మున్సిపాలిటీలలో ఏర్పాటు చేసిన టిడ్కో గృహాలకు కనీస నీటి సదుపాయం రోడ్లు వంటి వసతుల వసతుల ఏర్పాట్లు పూర్తిగా గాలికి వదిలేశారు.ఫలితంగా తేలికపాటి వర్షానికి రోడ్లన్నీ బురదమయంగా మారుతున్నాయి.
అదే విధంగా గృహాలకు ఏర్పాటు చేసిన కిటికీల అద్దాలను కొంతమంది దుండగులు పగలగొట్టేశారు. మరి కొన్నిచోట్ల ఇళ్లనిర్మాణానికి ఏర్పాటుచేసిన సామాగ్రి దొంగల పాలవుతుంది. గతంలో కోవిడ్ సమయంలో జిల్లాలోని టీడ్కో గృహాలను వారంటైన్గా ఏర్పాటు చేసుకుని వాటికి నామమాత్రంగా విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేశారు.
ఇలా కర్నూలు జిల్లా వ్యాప్తంగా జగనన్న కాలనీల పేరుతో ప్రజలకు అందుబాటులో లేని కనీస మౌలిక సదుపాయాలు కూడా లేనటువంటి స్థలంలో జగనన్న కాలనీల పేరుతో కొన్ని కోట్లు వెచ్చించి ప్రతి పేదవాడికి సెంట్చొప్పునఇళ్ల స్థలాలు కేటాయించినప్పటికీ వాటిని కూడా నేటి వరకు లబ్ధిదారులకు పూర్తిగా ఇవ్వలేదని ప్రజలు వాపోతున్నారు.
ఇలా ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా గత ప్రభుత్వంలో నిర్మించినటువంటి గృహాలు అదే విధంగా ఇప్పటి అధికారంలో ఉన్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలో నిరుపేదలైనటువంటి లబ్ధిదారులకు అందని ద్రాక్ష గానే గృహాలు ఉన్నాయంటూ వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ పెద్ద ఎత్తున టీడ్కో గృహాలను అదే విధంగా జగనన్న కాలనీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటిని లబ్ధిదారులకు అందే విధంగా చూడాలని ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool, Local News