హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో మెగా జాబ్ మేళా.. వివరాలివే..!

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో మెగా జాబ్ మేళా.. వివరాలివే..!

ఈనెల 4న కర్నూలు జిల్లాలో ఏపీఎస్ఎస్డీసీ జాబ్ మేళా

ఈనెల 4న కర్నూలు జిల్లాలో ఏపీఎస్ఎస్డీసీ జాబ్ మేళా

కర్నూలు జిల్లా (Kurnool) లోని నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (APSSDC&SEEDAP) ఆధ్వర్యంలో ఈనెల 4న ఎమ్మిగనూరు డిఆర్డీఏ కార్యాలయం నందు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Kurnool | Yemmiganur | Andhra Pradesh

Murali Krishna, News18, Kurnool

కర్నూలు జిల్లా (Kurnool) లోని నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (APSSDC&SEEDAP) ఆధ్వర్యంలో ఈనెల 4న ఎమ్మిగనూరు డిఆర్డీఏ కార్యాలయం నందు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కావున ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ ఉద్యోగ మేళాకు హాజరయ్యే వారు 10 వ తరగతి, ఇంటర్మీడియెట్, డిగ్రీ, ఎంబీఏ, డిప్లొమా మొదలగు అన్ని రకాల విద్యార్హతలు కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ మేళాకు హాజరు కావచ్చని తెలిపారు. ఈ మేళాలో 14 ప్రముఖ కంపెనీలు తమ కంపెనీలకు ఉద్యోగులను ఎంపిక చేసుకోవడానికి ప్రభుత్వంతో అవగాహన ఏర్పరచుకొని ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నాయి.

ఎంపికయిన ఉద్యోగి స్థాయిని బట్టి జీతం రూ.10,000 వేల రూపాయిలు నుంచి రూ.25,000 వేల రూపాయలు వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ సంస్థ నందు ఉద్యోగం చేయుటకు ట్రైనీలు పదవ తరగతి ఇంటర్ డిగ్రీ డిప్లమా వంటివి పూర్తి చేసిన వారు అర్హులని తెలిపారు. ఇందుకు ఎంపికైన వారికి 11 వేల రూపాయల నుంచి 13వేల 500 రూపాయల జీతంతో పాటు, ఉచిత వసతిమరియు భోజన సదుపాయం ఉంటుంది. ఈ సంస్థలో మొత్తం ఖాళీలు 300. 32 సంవత్సరాలలోపు యువకులు మాత్రమే అర్హులు. ఎంపికైన వారు తిరుపతిలోని శ్రీ సిటీలో ఉద్యోగం చేయవలసి ఉంటుంది.

ఇది చదవండి: వీళ్లకు కూరగాయలు కొనే అవసరమే లేదు.. ఎందుకంటే..!

ఇలాంటి 14 కంపెనీలు ఈ ఉద్యోగ మేళాలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రానున్నాయి. కావున జిల్లాలోని నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలిపారు.ఉద్యోగ మేళాకు హాజరయ్యే నిరుద్యోగులు రెస్యూమ్, జిరాక్స్ విద్యార్హత పత్రాలు, ఆధార్ కార్డ్ , పాన్ కార్డ్ , పాస్ పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు ఫార్మల్ డ్రెస్ లో రావాల్సి ఉంటుంది.

ఉద్యోగం మేళా జరుగు ప్రదేశం

డీఆర్డీఏ కార్యాలయం, ఎమ్మిగనూరు నందు ఉద్యోగం

సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్

1. 7799494856

2. 9985496587

ఈ క్రింది లింక్ ద్వారా అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు

bit.ly/3WADQ8v

First published:

Tags: Andhra Pradesh, Kurnool, Local News

ఉత్తమ కథలు