Murali Krishna, News18, Kurnool
కర్నూలు జిల్లా (Kurnool District) లో ఇంటర్మీడియట్ పరీక్షలు (AP Inter Exams) నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆర్ఐఓ గురవయ్యశెట్టి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈనెల 15 నుంచి వచ్చే ఏప్రిల్ నెల 4వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగనున్నాయన్నారు. ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాలో మొత్తం 124 పరీక్ష కేంద్రాలనుఏర్పాటు చేసామన్నారు. కర్నూలు జిల్లాలో 73 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అందులో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 23,610 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరంలో 26,057 మందివిద్యార్థులు పరీక్షలు రాయనున్నారు తెలిపారు. అదేవిధంగా నంద్యాల జిల్లాలో 51 పరీక్షకేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అందులో ఇంటర్మీడియట్మొదటి సంవత్సరంలో 12,178 విద్యార్థులు, ద్వితీయ సంవత్సరంలో 14,792 విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.
కర్నూలు జిల్లాలో-12, నంద్యాల జిల్లాలో -5 సమస్మాత్మక పరీక్షా కేంద్రాలను గుర్తించినట్లు తెలిపారు. ఈ 17 సమస్యాత్మకపరీక్ష కేంద్రాలలో ఆర్టీసి బస్సు ఏర్పాట్లకు ఆర్టీసి అధికారులను కోరి బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కర్నూలు జిల్లాలో 23, నంద్యాల జిల్లాలో 21 పోలీసు స్టేషన్లలో ప్రశ్నా పత్రాలను భద్రపరిచి వాటిని పరీక్షా కేంద్రాలకు పంపిస్తున్నారు.
పరీక్షలను తనిఖీ చేయుటకు ప్రత్యేకంగా ఫ్లయింగ్ స్క్వేర్డ్స్ బృందాలు ఏర్పాటు చేశారు. ఇందులో ఆరు ఫైయింగ్ స్వాడ్స్, 12 సిట్టింగ్ స్వాడ్స్ ఉన్నాయి. పరీక్షా కేంద్రంలోకి సిఎస్ డిఓ ఇన్విజిలేటర్స్, విద్యార్థులు ఎలక్ట్రానిక్స్ వస్తువులను తీసుకురాకూడదని తెలియజేశారు. అదేవిధంగా కొన్ని సమస్యత్మక కేంద్రాలలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి మాస్ కాపీయింగ్ జరగకుండా ఉండడానికి పోలీసులు బలగాలతో భద్రత ఏర్పాట్లు చేసినట్టు కర్నూలు జిల్లా ఆర్ఐఓ గురువా శెట్టి తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Inter Exams 2023, Kurnool, Local News