ఆంధ్రప్రదేశ్ లో పొదుపు సంఘాల మహిళలకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. వరుసగా రెండో ఏడాది కూడా వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం మహిళల ఖాతాల్లో జమ చేస్తున్నట్టు సీఎం జగన్ చెప్పారు. డ్వాక్రా మహిళలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై ప్రతి నెలా వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందిని మరోసారి స్పష్టం చేశారు. బ్యాంకులతో మాట్లాడి వడ్డీ భారం పడకుండా చేస్తున్నామన్నారు సీఎం జగన్. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళ ఆధాయం పెంచడమే తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు జగన్.
మహిళల ఖాతాల్లో నగదు జమ చేశారు సీఎం జగన్. 1.02 కోట్ల మందికిపైగా పొదుపు సంఘాల అక్కాచెల్లెమ్మలకు లబ్ధి చేకూరుతోందన్నారు సీఎం. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై ప్రతి నెలా వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ వరుసగా రెండో ఏడాది కూడా చెల్లించిందన్నారు. ఆన్‌లైన్ ద్వారా బ్యాంకు ఖాతాల్లో సీఎం వైఎస్ జగన్ జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అక్కాచెల్లెమ్మలకు అండగా నిలబడ్డామని పేర్కొన్నారు.
కరోనా కారణంగా రాష్ట్రానికి బాగా ఆదాయం తగ్గిందని. అయినా మహిళల ఆదాయం పెరిగేలా చేయూతనిచ్చామన్నారు.మహిళలకు అన్ని విధాలుగా అండగా నిలబడుతూ వస్తున్నాం. మహిళా సాధికారితను ఆచరణలోకి తీసుకురాగలిగామన్నారు. బ్యాంకుల ద్వారా నేరుగా సున్నా వడ్డీకే రుణాలు అందిస్తున్నామని గుర్తు చేశారు. డ్వాక్రా సంఘాల అప్పుపై ఈ ఏడాది వడ్డీ 1109 కోట్ల రూపాయలు చెల్లిసున్నామన్నారు. మహిళల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కృషి చేస్తున్నామన్నారు. అక్కా చెల్లెమ్మలకు వ్యాపారపరంగా నైపుణ్య శిక్షణ ఇస్తున్నామన్నారు. మహిళా సాధికారత ప్రభుత్వం నినాదం కాదు.. మా విధానం అన్నారు. గత ప్రభుత్వం రుణాల పేరుతో మహిళలను మోసం చేసిందని.. గత ప్రభుత్వం బకాయిలను కూడా తామూ తీరుస్తున్నామన్నారు.
వరుసగా రెండో ఏడాది కూడా చెల్లింపులు చేశామని సీఎం జగన్ అన్నారు. 9 లక్షల 43 వేల స్వయం సహాయక సంఘాలకు నగదు చెల్లింపులు చేస్తున్నామన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత 8.71 లక్షల పొదుపు సంఘాలకు 2019 ఏప్రిల్ 1 నుంచి 2020 మార్చి నెలాఖరు వరకు బ్యాంకు రుణాలపై ఉన్న వడ్డీ మొత్తాన్ని గతేడాది ఏప్రిల్ 24న చెల్లించారు. ఇప్పుడు వరుసగా రెండో ఏడాది కూడా 2020 ఏప్రిల్ 1 నుంచి 2021 మార్చి నెలాఖరు వరకు సంఘాల రుణాలపై ఉన్న వడ్డీ మొత్తం రూ.1,109 కోట్లను సీఎం జగన్ జమ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 9,34,852 పొదుపు సంఘాలకు సంబంధించి 1.02 కోట్ల మంది మహిళలు బ్యాంకుల నుంచి రుణాలు తసుకోని సకాలంలో చెల్లిస్తున్నారని సీఎం జగన్ ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పుడు వారంతా ప్రయోజనం పొందతున్నాన్నారు. దీనికి సంబంధించి గ్రామస్థాయిలో సభలు నిర్వహించి ప్రభుత్వం వివరాలను సేకరించింది. ఈ మేరుకు సీఎం జగన్ పొదుపు సంఘాల మహిళలకు లేఖలు రాశారు. ప్రతి మహిళను లక్షాధికారిగా, వ్యాపార రంగంలో తీర్చిదిద్దాలన్న ఆకాంక్షతో ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రారంభిస్తుందని వివరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Cm jagan