KURNOOL AP BJP CHIEF SOMU VEERRAJU MADE SENSATIONAL COMMENTS ON YS JAGAN MOHAN REDDY OVER AMAKUR ISSUE FULL DETAILS HERE PRN
BJP vs YCP: హ్యాండ్ టు హ్యాండ్ ఫైటింగ్ కు మేం రెడీ.. జగన్ కు సోము వీర్రాజు సవాల్
జగన్ పై మండిపడ్డ సోము వీర్రాజు
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ (AP CM YS Jagan) పై రాష్ట్ర బీజేపీ (BJP) అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) ఫైర్ అయ్యారు. కర్నూలు జిల్లా ఆత్మకూరులో ఇళ్ల మధ్య మసీదు నిర్మాణం తీవ్ర వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ (AP CM YS Jagan) పై రాష్ట్ర బీజేపీ (BJP) అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) ఫైర్ అయ్యారు. కర్నూలు జిల్లా ఆత్మకూరులో ఇళ్ల మధ్య మసీదు నిర్మాణం తీవ్ర వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డిపై జరిగిన దాడిని సోము వీర్రాజు ఖండించారు. ఈ ఘటనకు వైసీపీ ప్రభుత్వ తీరే కారణమని సోము మండిపడ్డారు. ఆత్మకూరు ఘటనకు వైసీపీ ప్రభుత్వ మతతత్వానికి నిదర్శనమని ఆయన ఆరోపించారు. ఎపీలో కోన్ని మతతత్వ శక్తులకు పథకాలను అమలు చేస్తూ జగన్ ప్రోత్సహిస్తున్నారన్న సోము.. ఆత్మకూరు లాంటి ఘటనలకు పరోక్షంగా ప్రభుత్వమే కారణమన్నారు. మతతత్వ వారికి కోమ్ము కాస్తే ఇలాంటి పరిస్థితులు వస్తాయన్నారు. అనుమతి లేకుండా మసీదు కట్టారంటే ఆత్మకూరు ఏమైనా పాకిస్తాన్లో ఉందా అంటూ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజా ఘటనలపై హ్యాండ్ టు హ్యాండ్ ఫైటింగ్ కు బీజేపీ సిద్ధమంటూ సోము వీర్రాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు. డిఎస్పీ రమ్మంటేనే అక్కడికి వెళ్లిన శ్రీకాంత్ రెడ్డిపై, పోలీసులపై కొందరు దాడికి యత్నిస్తే అతికష్టమ్మీద పోలీస్ స్టేషన్ కు వెళ్లారన్నారు. బాధ్యతాయుతంగా వ్యవహరించిన డిఎస్పీ ని వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.పద్ధతులు మార్చుకోకపోతే భాహాటంగానే పోరాటాలకు సిద్ధం పడతామని సోము వీర్రాజు హెచ్చరించారు.
ఆత్మకూరు ఘటనపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఈ అంశంలో జగన్ కేసులు పెట్టకపోతే ఒక వర్గానికి కోమ్ముకాస్తున్నారని భావించాల్సి వస్తుందన్నారు. హత్యాయత్నానికి, పోలీసులపై దాడులకు దిగితే కేసులు పెట్టవద్దని డిప్యూటి సీఎం, ఎమ్మెల్యే చెప్పడం దుర్మార్గమన్నారు. అన్ని మతాలపై గౌరవం, దమ్ము దైర్యం ఉంటే ఒక మతానికి కొమ్ము కాస్తున్న శిల్పా చక్రపాణి రెడ్డిని సస్పెండ్ చేయాలని.., డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే వైఖరిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. మా తడాఖా చూపిస్తామనే ధోరణితో రాష్ట్రప్రభుత్వం వ్యవహరిస్తోందన్న సోము వీర్రాజు.. పోలీసులపై తిరగబడి వాహనాలు దగ్ధం చేసినా వారిపై కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఒక మతానికి చెందిన తీవ్ర వాద సంస్థ జాడలు ఉన్నా పోలీసు లకు సమాచారం లేదా అని సోము వీర్రాజు నిలదీసారు.
వైసీపీ ప్రభుత్వం దిగజారి ప్రవర్తిస్తున్నందునే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఎంపీ సీఎం రమేష్ విమర్శించారు. బీజేపీ నంద్యాల పార్లమెంట్ అద్యక్షులు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి పై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోంది.., ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే చలో ఆత్మకూరు కు పిలుపునిస్తామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. తాడోపేడో తేల్చుకోనేందుకు పెద్ద ఎత్తున తరలి వెళ్తామన్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.