• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • KURNOOL ANOTHER DISHA TYPE MURDER INCIDENT AT KURNOOL DISTRICT BANAGANA PALLE IN ANDHRA PRADESHS NGS TPT

Andhra pradesh: ఏపీలో దిశ తరహా ఘటన.. యువతి దారుణ హత్య అనుమానాలెన్నో

Andhra pradesh: ఏపీలో దిశ తరహా ఘటన.. యువతి దారుణ హత్య అనుమానాలెన్నో

ఏపీలో దిశా తరహా ఘటన

ఏపీలో మరో దిశా తరహా ఘటన చోటు చేసుకుంది. 16 ఏళ్ల యువతిపై గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ పోసి అతి కిరాతకంగా హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి కేసును దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

  • Share this:
    ఏపీలో దారుణం చోటు చేసుకుంది. కర్నూలు జిల్లాలో దిశ తరహా లాంటి ఘటన మరొకటి కలకలం రేపింది. ఓ 16 ఏళ్ల బాలికపై కొందరు దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. అతి కిరాతకమైన ఈ ఘటన బనగానపల్లె యాగంటిపల్లెలో చోటు చేసుకుంది. ఓ బాలిక అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉండడానికి గమనించిన తండ్రి షాక్ కు గురై, గుండె పగిలేలా రోధించి.. పోలీసులకు సమాచారం ఇవ్డంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఆమెను ఎవరైనా అత్యాచారం చేసి.. తరువాత ఇలా నిప్పు పెట్టి ఉంటారా అని అనుమానిస్తున్నారు.

    తెలంగాణలోని నారాయణపేట జిల్లా మరికల్‌ మండలం రాకొండకు చెందిన కొందరు జీఎన్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కాల్వ లైనింగ్‌ పనుల కోసం వచ్చారు. అక్కడ 16 ఏళ్ల బాలిక తండ్రి ఉదయాన్నే పనులు చేసేందుకు ఎప్పటిలానే వెళ్లాడు. ఆ పక్కనే ఉన్న తాత్కాలిక షెడ్డు దగ్గర కుమార్తె తండ్రి కోసం ఎదురు చూస్తూ ఉండడాన్ని చూశామని స్థానికులు పోలీసులకు చెప్పారు.

    అయితే సాయంత్రం ఇంటికి వచ్చిన తండ్రి.. షెడ్‌ పక్కన కుమార్తె మంటల్లో కాలిపోయి ఉండటాన్ని గమనించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లెకు తరలించి, తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

    బాలికపై ఎవరైనా లైంగికదాడికి పాల్పడి.. తరువాత పెట్రోల్‌ పోసి నిప్పటించి అత్యంత దారుణంగా హత్య చేసినట్టు ఉన్నారని పోలీసులు భావిస్తున్నారు. లేక ఒకవేళ ఏవైనా సమస్యలతో బాలిక ఆత్మహత్య చేసుకుందా అనే  కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు.  అక్కడ పరిస్థిని చూసిన వారు మాత్రం బాలికపై అత్యాచారం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

    గుర్తు తెలియని దుండగులు యువతిని హత్య చేసి, పెట్రోల్ పోసి తగులబెట్టేశారని తండ్రి ఫిర్యాదు మేరకు ఆ కోణంలోనే కేసు నమోదు చేశారు.  మృతి చెందిన యువతి గాలేరు-నగరి కాలువ నిర్మాణం పనిలోకి కూలీగా వచ్చిన యువతిగా గుర్తించారు.  అనుమానాస్పదిగా మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు,, అనుమానాస్పదంగా కనిపించిన వారిని విచారిస్తున్నారు.

    అయితే ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా హత్యలు, అత్యాచారాలు పెరిగిపోవడం కలకలం రేపుతోంది. దిశ పేరుతో ప్రత్యేక చట్టం చేసినా.. ఇలాంటి ఘటనలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా మహిళల భద్రతపై ఆందోళన పెరుగుతోంది. దీనిపై విపక్షాలు సైతం తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ప్రభుత్వాని రాజకీయ కక్షలు, కుట్రలపై ఉన్న శ్రద్ధ నేరాల నియంత్రణ, ప్రజల శ్రేయస్సుపై లేదని.. అందుకే ఇలాంటి నేరాలు ఘోరాలు జరుగుతున్నాయని మండిపడుతున్నారు.
    Published by:Nagesh Paina
    First published: