T. Murali Krishna, News18, Kurnool
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళ భద్రతే ముఖ్యంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన సైబర్ కవచ్ యంత్రాన్ని కర్నూల్ పట్టణంలో ఉన్నటువంటి దిశ మహిళ పోలీస్ స్టేషన్లో జిల్లా అధికారులు ఏర్పాటు చేశారు. ఈ సైబర్ కవచ్నేయంత్రం మహిళలకు ఎంతో తోడ్పాటునిస్తుందని కర్నూలు జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ గారు తెలిపారు. మారుతున్న కాలంతో పాటు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అదేవిధంగా ఈ రోజుల్లో మనిషి జీవిత ప్రయాణంలో గుండె ఎంత ప్రముఖ పాత్ర పోషిస్తుందో అంతే సమానంగా చరవాణికూడా అంతే ప్రాముఖ్యతను కలిగి ఉంది.
ఒక మహిళలకే కాదు మనిషి జీవితంలో సెల్‌ఫోన్ అనేది ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తుంది అన్నారు. మనిషికి సంబంధించిన అన్ని రకాలైనటువంటి ఇంపార్టెంట్ విషయాలతో పాటు మనిషి ఒక స్థితిగతులను సెల్‌ఫోన్ నిర్ణయించే విధంగా తయారయింది. ఇలాంటి సమయంలో మనిషికి ఆరోగ్యం అనేది ఎంత ప్రధానమైనదో అలాగే మనం నిత్యం వాడే సెల్ ఫోన్ అనేది కూడా అంతే ప్రధానమైనది.
ఇలాంటి సమయంలో కొంతమంది సైబర్ నేరగాళ్లు యువతను టార్గెట్ చేస్తూ వర్క్ ఫ్రం హోం పార్ట్ టైం జాబ్ వంటి మోసపూరితమైన వెబ్ సైట్లను మన సెల్ ఫోన్‌కి పంపి మన సెల్ ఫోన్లో ఉన్నటువంటి సమాచారం అంతా ఆ లింకు ద్వారా తీసుకుని తీవ్ర ఇబ్బందులకు గురిచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ముఖ్యంగా మహిళలను ఇలాంటి మోసపూరితమైన ప్రకటనల ద్వారా వారి యొక్క వ్యక్తిగత సమాచారాన్ని వారి యొక్క మొబైల్ ఫోన్లకు పంపి అందులో ఉన్నటువంటి పూర్తి సమాచారాన్ని హ్యాక్ చేసి వారిని ఇబ్బంది గురి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఇలాంటి తరుణంలోఅలాంటి మోసపూరితమైన ప్రకటనలను తొందరగా గుర్తించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ సైబర్ కవచ్ అనే యంత్రాన్ని రూపొందించిందని తెలిపారు. దీని ద్వారా ఎవరైనా తమ సెల్ ఫోన్లో ఉన్నటువంటి సమాచారం తమకు తెలియకుండానే ఇతరులకు వెళ్లిపోతుందని డౌట్ ఎవరికైనా ఉన్న వెంటనే పోలీసు వారికి తెలియజేయాలన్నారు.
అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ సైబర్ కవచ్ అనే యంత్రంపై అవగాహనకలిగి ఇబ్బందులకు గురి కాకుండా తమను తాము సైబర్ నేరగాళ్ల నుంచి రక్షించుకోవాలని జిల్లా ఎస్పీ తెలిపారు.ఇందులో భాగంగానే జిల్లాకు కేటాయించినటువంటి యంత్రాన్ని వాటి పనితీరును దిశ పోలీస్ స్టేషన్లో పరిశీలించినటువంటి జిల్లా ఎస్పీ దిశా పోలీస్ స్టేషన్ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. CYBER KAVACH ...బాధిత మహిళలు దిశా పోలీసుస్టేషన్ కు వచ్చినప్పుడు వారికి CYBER KAVACH యొక్క ఉపయోగాలను తెలియజేయాలన్నారు.
బాధిత మహిళల మొబైల్ ఫోన్ లను CYBER KAVACHతో స్కాన్ చేసుకోవాలని తెలియజేయాలన్నారు.
ప్రత్యేకంగా మహిళలు CYBER KAVACH ను సద్వినియోగం చేసుకునే విధంగా చూడాలన్నారు.
ఈ CYBER KAVACH తో వారి మొబైల్ ఫోన్ లలో ఏలాంటి వైరస్లు ఉన్నా , మాల్ వేర్లు ఉన్నా అటువంటి వాటిని వారి మొబైల్ ఫోన్ లలో లేకుండా చూడాలన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool, Local News