హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kurnool: పేషెంట్ బంధువులే వార్డ్ బాయ్స్..? కర్నూలు పెద్దాసుపత్రిలో ఇదేం దుస్థితి..!

Kurnool: పేషెంట్ బంధువులే వార్డ్ బాయ్స్..? కర్నూలు పెద్దాసుపత్రిలో ఇదేం దుస్థితి..!

అక్కడ

అక్కడ పేషెంట్లే వార్డు బాయ్స్

Kurnool: రాయలసీమ జిల్లాలో కర్నూలు ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి ప్రత్యేక గుర్తింపు ఉంది. కానీ అక్కడ వార్డు బాయ్‌ల కొరత వేధిస్తోంది. పేషెంట్ బంధువులే వార్డ్ బాయ్స్ గా మారాల్సి వస్తోంది..? ఈ దుస్థితికి కారణం ఏంటి..?

 • News18 Telugu
 • Last Updated :
 • Kurnool, India

  Murali Krishna, News18, Kurnool.

  Kurnool:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కొన్ని ప్రభుత్వ పెద్ద ఆస్పత్రులకు (Government Hospital) ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. చుట్టు పక్కల జిల్లాలకు కూడా పెద్ద దిక్కుగా నిలుస్తూ ఉంటాయి. అలాగే  రాయలసీమ జిల్లాలో కర్నూలు పెద్దాసుపత్రి (Kurnool Government Hospital) కి అత్యంత ప్రాముఖ్యత ఉంది. నిత్యం వేలాది పేషెంట్లు వస్తూ ఉంటారు. వైద్య సదుపాయాలు ఎక్కువగా ఉంటాయనే ఉద్దేశంతో చుట్టు పక్కల జిల్లాల రోగులు కూడా వస్తూ ఉంటాయి. అంత గుర్తింపు ఉన్న కర్నూలు ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో వార్డు బాయ్‌ల (Word Boys) కొరత వేధిస్తోంది. ఫలితంగా రోడ్డు ప్రమాదంలో గాయపడి నడవలేని వారు, వివిధ వ్యాధులతో ఆసుపత్రికి వచ్చిన వారిని…వాళ్ల బంధువులే స్ట్రెచర్లపై పరీక్షలకు తీసుకువెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది.

  ఒక్క రాయలసీమ ప్రాంతంలోనే  కాదు అటు తెలంగాణ (Telangana) లోని మహబూబ్ నగర్ వరకు ఉన్న ప్రజలు అలాగే కర్ణాటక (Karnataka) లోని బళ్లారి పరిసర ప్రాంతాల ప్రజలకు జీవన ప్రధాయినిగా ఈ ప్రభుత్వ ఆస్పత్రి సేవలందిస్తుంది. అలాంటి ప్రభుత్వ ఆసుపత్రిలో వార్డ్ బాయ్స్ కరువైపోయారు. వార్డ్ బాయ్స్ బాధ్యతలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించినా… వాళ్లు కూడా జీతాలు సరిగా ఇవ్వడం లేదంటూ ఉన్న కొంత మంది వార్డ్ బాయ్స్ హాస్పిటల్‌కి వచ్చే రోగుల దగ్గర తమ చేతి వాటం చూపిస్తున్నారు.

  డాక్టర్ల పర్యవేక్షణ కరువు..!                                                                          కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి నిత్యం వేలసంఖ్యలో రోగులు వస్తుంటారు కానీ వైద్యులు మాత్రం సరైన సమయానికి అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది గవర్నమెంట్ డాక్టర్లు డ్యూటీలో ఉండాల్సిన సమయంలో ఆస్పత్రిలో ఉండటం లేదు. కొంతమంది ప్రైవేట్ క్లినిలు ఏర్పాటు చేసుకొని రోగులను ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్‌కు రిఫర్ చేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి.

  ఇదీ చదవండి : ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. వైభవంగా పెద్ద వాహన సేవ.. నేడు చినవాహన సేవ.. ప్రత్యేకత ఏంటంటే..?

  అంతే కాకుండా ఎక్స్రే, స్కానింగ్, బ్లడ్ టెస్ట్ అంటూ హాస్పిటల్‌కు వచ్చే రోగులను కార్పోరేట్‌ హాస్పిటల్స్‌ కన్నా దారుణంగా నిలువునా దోచేస్తున్నారని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ సరిగా లేక ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు వ్యవహరిస్తున్నారని..అదేమని ప్రశ్నిస్తే దిక్కున్న చోట చెప్పుకోమంటూ నిర్లక్ష్య ధోరణి వహిస్తున్నారని రోగులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకుని ఈ పెద్దాసుపత్రిలో తాము పడుతున్న ఇబ్బందులకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

  ఇదీ చదవండి : వీళ్లు మామూలోళ్లు కాదు.. ఆటో కనిపిస్తే చాలు అంతే సంగతులు

  మరో వైపు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగానికి పెద్దపీట వేస్తూ జిల్లాకో వైద్య కళాశాల ఏర్పాటు చేసే విధంగా తీర్మానం చేశారు. కానీ ప్రజలు మాత్రం కేవలం కళాశాలలు ఏర్పాటు చేయడం కాదు… వాటికి సరైన పర్యవేక్షకులను నియమించి సకల సౌకర్యాలు కల్పించి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు.

  ఇదీ చదవండి : దమ్ముంటే కొడుకుపై ప్రమాణం చేయాలి.. లోకేష్ కు మంత్రి రోజా సవాల్.. ఎందుకో తెలుసా?

  ఒకప్పటితో పోలిస్తే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య నేడు గణనీయంగా తగ్గిపోయింది. దీనికి కారణం మెరుగైన వైద్య పరికరాలు ఉన్నప్పటికీ పనితీరు సరిగ్గా లేకపోవడం. ఇంకో ప్రధాన కారణం గత 3 సంవత్సరాలుగా కర్నూలు సర్వజన వైద్యశాలలో మందుల కొరత. ఇలా నిత్యం ఏదో ఒక సమస్య ఏర్పడుతుండడంతో ప్రజలు తీవ్ర అసహన వ్యక్తం చేస్తున్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Kurnool, Local News

  ఉత్తమ కథలు