T. Murali Krishna, News18, Kurnool
గత ఎన్నికల్లో జిల్లాను మొత్తం వైసీపీ (YCP) క్లీన్ చేసింది.. తరువాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ అవే ఫలితాలు రిపీట్ అయ్యాయి. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. జిల్లాలోని రాజకీయ పార్టీలల్లో అసమ్మతి రోజు రోజుకు పెరిగిపోతుంది. తాజాగా ఆలూరు (Alooru) నియోజకవర్గం ఎమ్మెల్యే, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ( కి తన సొంత నియోజకవర్గంలో వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. గడప గడపకు వెళ్తున్న మంత్రి గుమ్మనూరు జయరాంకు ప్రజలు నిలదీస్తున్నారు
ముఖ్యంగా మంత్రి అయుండి కూడా కనీసం తన సొంత నియోజకవర్గంలో అభివృద్ధి పనులు గాని రోడ్లు విషయంలో కానీ ఎలాంటి పనులు చేయలేదని ప్రజలు పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా భూ వివాదాల్లో కూడామంత్రి గుమ్మనూరు జయరాం (Gummanuru Jayaram) పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కొంటున్నారు.
ఆలూరు నియోజకవర్గంలో దాదాపుగా 400 ఎకరాలకు పైగా తన భార్య పేరుట రాయించుకొని కొట్టేసారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అనేక విమర్శలు ఎదుర్కోవడంతో తాజాగా మళ్లీ వాటిని గవర్నమెంట్ రూల్ ప్రకారం వాటి విలువ ఎంతుందో అంతే మొత్తంలో పేదలకు తిరిగి ఇచ్చేస్తానని బహిరంగంగా చెప్పడం. ఆయన భూములు కాజేసాడు అనేదానికి ఇది నిజమైన కారణమని బలమైన ఆధారమంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.
ఇదీ చదవండి : రాత్రికి రాత్రే నిర్మాణాలు.. ఖాళీ స్థలం ఉంటే అక్కడ అంతే సంగతి..
అంతేకాదు మంత్రి గుమ్మనూరు జయరాం సొంత నియోజకవర్గంలోని పార్టీకి చెందిన జడ్పిటిసి విరూపాక్షి తనపై తరుచూ మంత్రి వర్గీయులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. సొంత పార్టీ నుంచే ఇలా విమర్శలు వస్తుండడంతో మంత్రి పరిస్థితి ఇబ్బందికరంగా మారింది అంటున్నారు.
ఇదీ చదవండి : 400 రోజులు.. 4000 కిలోమీటర్లు.. 27 నుంచి లోకేష్ పాదయాత్ర.. యువ ఓటర్లే లక్ష్యంగా పేరు
ఇటీవల సీఎం జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో మంత్రి కుమారుడు ఈశ్వర్, సోదరుడు నారాయణ బహిరంగ సభల్లో చేసిన వ్యాఖ్యలు మనస్తాపానికి గురిచేశాయని, రాజీనామా చేస్తున్నానని ఆలూరు నియోజకవర్గం పరిధిలోని చిప్పగిరి మండల జడ్పీటీసీ సభ్యుడు విరుపాక్షి అనడం కలకలం రేపింది.
ఆ విషయం కాస్త ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విరూపాక్షిని బుజ్జగించడంతో జడ్పీటీసి విరుపాక్షి రాజీనామా అంశాన్ని వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఇలా మంత్రి గుమ్మనూరుకు అనేక విషయాల్లో ఎదురు దెబ్బలు తగలడం పార్టీలో ఆయనకు వ్యతిరేకత వస్తున్నట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, Jayaram, Local News