T. Murali Krishna, News18, Kurnool
మాదవక ద్రవ్యాల కట్టడిలో తమ ప్రభుత్వం చిత్తశుద్దింతో ఉందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy)తో సహా.. మంత్రులు పదే పదే చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.. ఎందుకంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వం (Central Government) విడుదల చేసిన నివేదికల ప్రకారం దేశంలోనే మాదకద్రవ్యాల వినియోగం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎక్కువగా ఉందని 'స్మగ్లింగ్ ఇన్ ఇండియా'' (Smuggling in India) పేరుతో కేంద్రం నివేదికలు విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లా (Kurnool District) లోనూ వినియోగం ఎక్కువగా ఉంది. యువత గంజాయి మత్తు మాదక ద్రవ్యాల బారిన పడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా యువతే లక్ష్యంగా.. స్మగ్లింగ్ చేస్తున్నారు.. కేటుగాళ్లు.. పదే పదే పోలీసులు దాడులు చేస్తున్నారు.. కఠినమైన చర్యలు లేకపోవడంతో.. తరచూ అక్రమ రవాణ గురించి వినాల్సి వస్తోంది..
రాష్ట్రంలోని పలు జిల్లాలు, తెలంగాణ , కర్ణాటక రాష్ట్రాలకు జిల్లా మీదుగా రవాణా చేస్తున్నారు. ఈ అక్రమ రవాణాలో ఎక్కువ శాతం యువకులే పట్టుబడడం ఎందుకు నిదర్శనంగా తెలుస్తుంది.ఇందులో భాగంగా అత్యధికంగా కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం రవాణా చేస్తూ అనేకమార్లు పట్టుబడుతున్నాను.
ఈ అక్రమ రవాణాపై పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహించి కొన్ని వందల కేసులు జిల్లా వ్యాప్తంగా నమోదు చేసిన నేరస్తులో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. ఆదోని డివిజన్లోని కౌతాళం మండల పరిధిలో కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమంగా తరలిస్తున్న 30 బాక్స్‌ల కర్ణాటక మద్యాన్ని పట్టుకున్నట్లు ఆదోని సెష్పల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సర్కిల్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ తెలిపారు.
ఇదీ చదవండి : కోపంతో తాతను కిరాతకంగా చంపిన మనమడు
విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కౌతాళం మండలం పరిధిలోని తోవి క్రాస్ రోడ్డులో వాహనాలు తనిఖీలో భాగంగా వాహనాలను తనీఖీ చేస్తుండగా. కొంతమంది వ్యక్తులపై అనుమానంతో తనిఖీ చేయగా అందులో ముగ్గురు వ్యక్తులు మూడు ద్విచక్ర వాహనాలపై 30 బాక్స్‌ల టెట్రా ప్యాకెట్ లైన కర్ణాటక మద్యాన్ని తీసుకొస్తుండగా రెడ్ హ్యండెడ్గాపట్టుకున్నామని ఆయన తెలిపారు. ఈ మద్యం విలువ సూమారు 1.50 లక్షల నుంచి 2.34 లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి : ఇంద్రకీలాద్రీ పై కృత్తికా దీప మహోత్సవం.. ప్రత్యేకత ఏంటో తెలుసా?
ఈదాడిలో మద్యాన్నిస్వాధీనం చేసుకున్నామని...నిందితులపైకేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లు ఆయన వెల్లడించారు.ఇలా అక్రమ రవాణాచేస్తూ ఎవరైనా పట్టుబడితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని నిందితులు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Kurnool, Local News