హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kurnool: రూపాయి డాక్టర్‌ గురించి విన్నారా..? అమ్మ కోరిక నిజం చేస్తూ వైద్యసేవలు

Kurnool: రూపాయి డాక్టర్‌ గురించి విన్నారా..? అమ్మ కోరిక నిజం చేస్తూ వైద్యసేవలు

రూపాయికే

రూపాయికే వైద్యం

Kurnool: కర్నూలులో నివాసం ఉంటున్న భాస్కర్ రెడ్డి నిస్వార్ధ సేవతో రోగులకు వైద్యం అందిస్తున్నారు. చుట్టూ ప్రక్కల ప్రజలు కూడా తమకు ఏ రోగమొచ్చిన ముందుగా వారికీ గుర్తొచ్చేది కూడా రూపాయి డాక్టర్ భాస్కర్ రెడ్డి. ఈ రూపాయికి వైద్యానికి కారణం ఏంటి?

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Kurnool, India

  Murali Krishna, News18, Kurnool.

  ఎవరికైనా సరే జలుబో జ్వరమో వచ్చి హాస్పిటల్‌ (hospital) కి వెళ్తే చాలు బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, అది ఇది అంటూ వేలకు వేలు బిల్లు వేసే ఈ రోజుల్లో కొడుకు వైద్యుడై (Doctor) ప్రజలకు సేవ చెయ్యాలన్నదే ఆ తల్లీ కోరిక. అమ్మకు ఇచ్చిన మాటతో గత 20 సంవత్సరాలుగా కేవలం రూపాయికే వైద్యం (One Rupee Treatment) అందిస్తున్నాడు భాస్కర్ రెడ్డి (Bhaskar Reddy). కర్నూలు (Kurnool) లో నివాసం ఉంటున్న భాస్కర్ రెడ్డి నిస్వార్ధ సేవతో రోగులకు వైద్యం అందిస్తున్నారు. చుట్టూ పక్కల ప్రజలు కూడా తమకు ఏ రోగమొచ్చిన ముందుగా వారికీ గుర్తొచ్చేది కూడా రూపాయి డాక్టర్ భాస్కర్ రెడ్డి. రోగమేదైనా పైసా చెల్లించకుండా అతని దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు. అన్నిటికీ మించి రోగులు రాలేని స్థితిలో డాక్టర్ భాస్కర్ రెడ్డి స్వయంగా వారి వద్దకు వెళ్లి వైద్య సేవలు అందిస్తారు.

  హోమియో పతిలో పట్టభద్రులు అయినటువంటి డాక్టర్ భాస్కర్ రెడ్డి ముందుగా ఢిల్లీలో పనిచేసేవారు. ఆయన ఢిల్లీలో పనిచేసే సమయంలో తన తల్లి అనారోగ్యంతో మృతి చెందింది. తన తల్లి చివరి చూపు కూడా చూడలేని భాస్కర్ రెడ్డి చలించిపోయారు. అప్పటి నుంచి తల్లి కోరిక మేరకు ఉచిత వైద్య సేవలను ప్రారంభించారు. చిన్నపిల్లలు మొదలుకొని వయోవృద్ధుల వరకు అందరికి ఆప్యాయతతో వైద్య సేవలను అందిస్తున్నారు.

  జలుబు,దగ్గు,జ్వరము,నొప్పులు, కిడ్నీలో రాళ్లు, థైరాయిడ్, పక్షవాతం, ఇలా అది ఇది అని కాదు అన్ని దీర్ఘకాలిక రోగాలను వైద్యం చేస్తున్నారు డాక్టర్ భాస్కర్ రెడ్డి. డబ్బు సంపాదించాలని ఆశ లేదని ఇలా పేదలకు వైద్యం అందించడంలోనే తన మనసుకు సంతోషమంటున్నారు భాస్కర్‌ రెడ్డి. అలాగే పేదలకు వైద్యం అందించినప్పుడు వారికి వచ్చిన రోగం ఏదైతే ఉంటుందో అది నయమైనప్పుడు వారు తిరిగి వచ్చి నా జబ్బు నయమైంది అంటూ ఆనందంతో చెప్పే మాటలే కోటి రూపాయలతో సమానమని అంటున్నారు భాస్కర్ రెడ్డి.

  ఇదీ చదవండి : ఏడాదికోసారి మాత్రమే దర్శన భాగ్యం..! అందుకే అస్సలు మిస్‌ కావద్దు..

  తన సొంత క్లినిక్‌లో ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రజలకు వైద్యం అందిస్తుంటారు. ఒకవేళ ఎవరికైనా ఏదైనా పెద్ద జబ్బు వస్తే మాత్రం వారు మందులు కొనలేని స్థితిలో ఆయనే స్వయంగా మందులు ఉచితంగా అందిస్తున్నారు.

  ఇదీ చదవండి : కనకదుర్గమ్మ సన్నిధిలో చంద్రబాబు , బాలయ్య.. అమరావతికి అమ్మవారి అండ

  అంతే కాకుండా ప్రతి గురువారం నగరంలోని ఇళ్లకు తిరిగి ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రతి రోజు 100 నుంచి 200 మంది దాకా రోగులు వైద్యం కోసం జిల్లా నలుమూలల నుంచి భాస్కర్ రెడ్డి గారి దగ్గరికి వస్తుంటారు. వైద్యంలో నిష్ణాతులైన భాస్కర్ రెడ్డి గారిని ప్రజలందరూ దేవుడితో సమానంగా కొలుస్తుంటారు.

  అడ్రస్‌:- డాక్టర్‌ భాస్కర్‌ రెడ్డి క్లినిక్‌, ధర్మపేట, కర్నూలు , ఆంధ్రప్రదేశ్‌- 518004.

  సంప్రదించు వేళలు:-సాయంకాలం 5 గంటల నుంచి 11 గంటల వరకు ఉచిత వైద్యంతోపాటు మందులు కూడా అందజేస్తారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Kurnool, Local News

  ఉత్తమ కథలు