AP Inter Exams: నేటి నుంచి ఇంటర్‌ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

ఫ్రతీకాత్మక చిత్రం

ఏపీలో ఇంటర్ పరీక్షల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం పట్టుదలతో కనిపిస్తోంది. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా. కోర్టును ఆశ్రయించినా.. ఏవీ పట్టించుకోకుండా అనుకున్న సమయానికి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. నేటి నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది.

  • Share this:
    ఏపీలో ఇంటర్ పరీక్షలపై ఇప్పటికే ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే పరీక్షల నిర్వాహణకు ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఇంటర్మీడియెట్‌ పరీక్షల షెడ్యూల్‌లో ఎటువంటి మార్పులు లేవని, మే5 నుంచి పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మరోసారి స్పష్టం చేశారు. విపక్షలు రాజకీయాల కోసమే పరీక్షల రద్దు అని డిమాండ్ చేస్తున్నాయని. కానీ తమ ప్రభుత్వానికి విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యమన్నారు. ఇంటర్ విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పరీక్షలు అనివార్యమని, అయితే కోవిడ్‌ జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్రంలో మే 5 నుంచి 19 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి విద్యార్థలు, వారి తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సాయంత్రం ఆరు గంటల నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఆయన సూచించారు.

    కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తాం. ఇందకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు. కరోనా విస్తరిస్తున్న వేళ పరీక్షా కేంద్రాలను సైతం పెంచామన్నారు. ఇంటర్‌ పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1452 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని.. అంటే గతేడాదితో పోల్చితే ఈ సారి అదనంగా 41 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఒక్క తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 146 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా.. అత్యల్పంగా గుంటూరులో 60 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి జిల్లాకు కోవిడ్ స్పెషల్ అధికారిని నియమించామని.. పరీక్షా కేంద్రాలను ప్రతిరోజు శానిటైజ్ చేస్తాం. ప్రతి పరీక్షా కేంద్రంలో థర్మల్ స్కానింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. విద్యార్థుల భవిష్యత్, భద్రత ప్రభుత్వ బాధ్యత అని మంత్రి స్పష్టం చేశారు.

    ఇదీ చదవండి: క్యాష్ ఉంటేనే కరోనాకు వైద్యం. కార్డుల్లో బ్యాలెన్స్ ఉన్నా కుదరదు? ఇన్స్యూరెన్స్ ఉంటే చేర్చుకోరు? కారణం ఏంటో తెలుసా?

    ప్రతి సెంటర్‌లో ఒక పారా మెడికల్ సిబ్బందితో పాటు ఐసోలేషన్‌ రూమ్ ఏర్పాటు చేస్తామన్నారు. కోవిడ్ లక్షణాలు ఉంటే వారిని ఐసోలేషన్‌ రూమ్‌లో పరీక్ష రాయిస్తామన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని పరీక్షల నిర్వహణ జరపుతామంటున్నారు. దేశంలో ఎక్కడా ఇంటర్ పరీక్షలు రద్దు చేయలేదు. అన్ని భద్రతా ప్రమాణాలతో పరీక్షలు నిర్వహిస్తాం. పరీక్షలపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థుల జీవితాలతో రాజకీయాలు చేయడం మంచిది కాదన్నారు సురేష్ . ఇంటర్ హాల్ టికెట్లను https://bie.ap.gov.in వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు.

    ఇదీ చదవండి: ఐసోలేషన్ వార్డుగా రామానాయుడు స్టూడియో. ఎవరికి కేటాయిస్తున్నారో తెలుసా?

    ఏపీ ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తోందని విపక్షాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే పరీక్షలు రద్దు చేయమని కొందరు కోర్టును ఆశ్రయించారు కూడా. మరోవైపు ఇంటర్, పది పరీక్షలు రద్దు కోరుతూ కేఏ పాల్ విశాఖలో దీక్ష కూడా చేపట్టారు. ఇటు టీడీపీ నేతలు సైతం కోర్టును ఆశ్రయించారు. బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు సైతం పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పరీక్షలు రద్దు కోరుతూ జనసేన అధినేత పవన్ సైతం డిమాండ్ చేస్తున్నారు. ఎవరి డిమాండ్ ను పట్టించుకోని ఏపీ ప్రభుత్వం అనుకున్న సమయానికి పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమైంది.

    హాల్ టికెట్లు ఇలా డౌన్ లోడ్ చేసుకోండి
    Published by:Nagesh Paina
    First published: