• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • KURNOOL ANDHRA PRADESH GOVERNMENT HANDS UP TO VACCINATION CM JAGAN WILL WRITE LETTER TO PM MODI ON 18 TO 45 YEARS VACCINATION NGS

Vaccine: మే 1 నుంచి వ్యాక్సిన్ వేయలేం. చేేేతులెత్తేసిన ఏపీ ప్రభుత్వం. మోదీకి సీఎం జగన్ లేఖ

Vaccine: మే 1 నుంచి వ్యాక్సిన్ వేయలేం. చేేేతులెత్తేసిన ఏపీ ప్రభుత్వం. మోదీకి సీఎం జగన్ లేఖ

వ్యాక్సినేషన్ పై చేతులెత్తేసిన ఏపీ ప్రభుత్వం

శనివారం నుంచి దేశ వ్యాప్తంగా 18-45 ఏళ్ల వారు అందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పటికే కేంద్రం దీనిపై రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. భారీగా యాప్ లో రిజిస్ట్రేషన్లు కూడా అయ్యాయి. మరి ఏపీలో పరిస్థితి ఏంటి? 18 ఏళ్లు దాటిన వాళ్లకు వ్యాక్సిన్ వేసే అవకాశం ఉందా?

  • Share this:
    భారత దేశాన్ని కరోనా వైరస్ వెంటాడి వేధిస్తోంది. రోజు రోజుకూ కరోనా కేసుల సంఖ్య రెట్టింపు అవుతోంది. మరణాలు కూడా భారీగా నమోదు అవుతున్నాయి.  ఏపీ విషయానికి వస్తే పరిస్థితి రోజు రోజుకూ భయపెడుతోంది. రికార్డు స్థాయిలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఒక్క రోజులోనే 17 వేలకు పైగా కేసులు వస్తున్నాయి అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోచ్చు. మరోవైపు 64 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఇంతలా వైరస్ విస్తరిస్తున్న సమయంలో కరోనాను కట్టడి చేయలాంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం. కానీ వ్యాక్సిన్ పంపిణీ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పేచీ మొదలైంది. దీంతో వ్యాక్సినేషన్ పై అనుమానాలు పెరుగుతున్నాయి.

    కరోనా కట్టడిలో భాగంగా శనివారం నుంచి అంటే మే 1 నుంచి దేశ వ్యాప్తంగా 18 నుంచి 45 ఏళ్ల లోపు వారు అందరికీ వ్యాక్సిన్ వేయాలని కేంద్రం సూచిచింది. ఇదే విషయాన్ని అన్ని రాష్ట్రాలకు చెప్పింది. యాప్ లో రిజిస్టర్ అయిన వారందరికీ వ్యాక్సినే వేయాలని కోరింది. కానీ చాల వరకు యాప్ లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. చాలామందికి రిజిస్ట్రేషన్ అవ్వడం లేదని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ల సంగతి ఎలా ఉన్నా.. చాలా రాష్ట్రాలు మాత్రం వ్యాక్సినేషన్ వేయ లేం అంటూ చేతులు ఎత్తేస్తున్నాయి.

    ఏపీ ప్రభుత్వం కూడా 18 నుంచి 45 ఏళ్ల లోపు వారికి వ్యాక్సినేషన్ వేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పేసింది. వ్యాక్సినేషన్‌ ఉత్పత్తి సామర్థ్యం అంచనా వేయకుండానే ప్రకటన చేయడం పలు విమర్శలు వస్తున్నాయి. మే 1 నుంచి అందరికీ వ్యాక్సిన్‌ అంటూ ఆర్భాటంగా ప్రభుత్వం ప్రకటించింది. 2 కోట్ల మందికిపైగా ఆ వయసు వారు ఉంటారని అంచనా వేస్తున్నారు. ఇటీవల ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ ఇప్ప‌ట్లో అందరికీ వ్యాక్సిన్ సాధ్యం కాద‌నే వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ఏపీ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ దానిపై క్లారిటీ ఇచ్చారు.. మే నెల నుంచి 18 ఏళ్లు దాటిన వారికి టీకాలు ఇవ్వాలని ఆదేశాలున్నాయ‌న్నారు. అయితే 45 ఏళ్లు దాటినవారికే చాలా మందికి వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంద‌న్నారు.. 18-45 మధ్య వయస్సు వారికి టీకాల నిమిత్తం 4.08 టీకా డోసులు అవ‌స‌రం అని.. కానీ అన్ని టీకాలు అందుబాటులో లేకపోవడంతో అందరికీ టీకాలు వేయడం సాధ్యం కాదన్నారు.

    ఏపీలో వ్యాక్సినేషన్ ఇచ్చే విషయంలో ఎదుర‌వుతోన్న ఇబ్బందులను వివరిస్తూ ప్రధాని మోదీకి సీఎం జగన్ మరో లేఖ రాస్తారని ఆయన వివరించారు. ఆ లేఖకు కేంద్రం నుంచి వచ్చిన స్పందన బట్టి వ్యాక్సినేషన్ పై నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో 18-45 మ‌ధ్య ఏజ్ గ్రూప్‌కు కోవిడ్ టీకాల పంపిణీని ప్రారంభించ‌డం లేద‌ని ఆయన స్ప‌ష్టం చేశారు.
    Published by:Nagesh Paina
    First published:

    అగ్ర కథనాలు