KURNOOL ANDHRA PRADESH CM JAGAN WILL GO KURNOOL TO DAY THE FOUNDATION STONE FOR THE INTEGRATED RENEWABLE ENERGY PROJECT NGS
CM Jagan: ఏపీకి తీరనున్న కరెంటు కష్టాలు.. నేడు కర్నూలుకు సీఎం జగన్.. ఎందుకంటే..?
వైఎస్ జగన్
CM Jagan: ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధానమైనంది విద్యుత్ సమస్య.. అప్రకటిత కరెంటు కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పారిశ్రమలకు పవర్ హాలిడే ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి పవర్ హాలిడే ఎత్తేసినా.. మళ్లీ అలాంటి పరిస్థిరి రాదని చెప్పలేం.. అయితే భవిష్యత్తులో ఆ కష్టాలు లేకుండా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు సీఎం జగన్.
CM Jagan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రజలకు కరెంటు కష్టాలు (Power Cuts) తీరనున్నాయా..? గత వారం రోజుల క్రితం ఏపీలో పరిస్థితి తీవ్ర ఇబ్బంది పెట్టింది. తెలంగాణ మంత్రి కేటీఆర్ (Minster KTR) సైతం ఏపీలో విద్యుత్ కోతల కోసం బహిరంగంగానే విమర్శలు చేశారు అంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించవచ్చు. ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో అప్రకటిత కరెంటు కోతలు ఇబ్బంది పెట్టాయి. అది కూడా గంటలు గంటలు కరెంటు పోవడంతో నరకయాతన అనుభవించారు. అదే సమయంలో మండే ఎండలతో (Summer Heat) ప్రజలకు కష్టాలు మరింత పెరిగాయి. దీంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఓ వైపు ఛార్జీలు పెంచారని (Current Charges Hike).. మరోవైపు కరెంటు కోతలు ఏంటి అంటూ ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. అయితే ఇకపై అలాంటి పరిస్థితి ఉండకూదనే ఉద్దేశంతో ఉంది ప్రభుత్వం. గత అనుభవాలు.. ఏపీలో పెరిగిన విద్యుత్ డిమాండ్ నేపథ్యంలో.. మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ కు శ్రీకారం చుట్టనుంది జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) సర్కార్. ఇందులో భాగంగానే ఇవాళ కర్నూలు జిల్లా (Kurnool District) లో సీఎం జగన్ పర్యటించనున్నారు. కర్నూలులో ఓర్వకల్లు మండలం గుమ్మటం తండా వద్ద ఇంటిగ్రేటెడ్ రిన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు.
కాసేపట్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి గన్నవరం విమానాశ్రయం (Gannavaram Air port) నుంచి బయలుదేరనున్నారు. గ్రీన్కో ప్రాజెక్టు (Greenco Project) పనులకు శంకుస్థాపన చేసిన తర్వాత మధ్యాహ్నం 2గంటల 5 నిమిషాలకు తాడేపల్లి నివాసానికి ఆయన చేరుకుంటారు. ఈ సందర్భంగా 15 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో 5 వేల 410 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనే లక్ష్యంగా గ్రీన్కో ఎనర్జీస్ లిమిటెడ్ సంస్థ ఈ ప్రాజెక్టును నిర్మిస్తుంది. ఇది ప్రపంచంలోనే మొట్ట మొదటి ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఎనర్జీ పవర్ ప్రాజెక్టు. దీని నుంచి సోలార్, విండ్, హైడల్ విద్యుత్ ఉత్పత్తి కానుంది. ఇలా ఒకే ప్లాంట్ నుంచి మూడు రకాల విద్యుత్ ఉత్పత్తి అయ్యే ప్రాజెక్టు ప్రపంచంలోనే మొట్టమొదటిది.
ఏపీలో విద్యుత్ కష్టాల నుంచి గట్టెక్కే ప్రయత్నాలు చేయాలని సీఎం జగన్ పట్టుదలతో ఉన్నారు. ఇందులో భాగంగానే ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ఇందులో భాగంగా ఈ ప్రాజెక్టుకు సీఎం శంకుస్థాపన చేయనుండడంతో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం పర్యటనకు 800 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 19 మంది సీఐలు, 43 మంది ఎస్ఐలను బందోబస్త్ విధులకు కేటాయించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.