Home /News /andhra-pradesh /

KURNOOL AN UNKNOWN DISEASE CAUSING SEVIOUR SKIN INFECTION BY THE POLLUTED DRINKING WATER ABH NJ KNL

Kurnool: వింత వ్యాధితో కలవరపడుతున్న జనం... అంతుచిక్కని చర్మవ్యాధులకు కలుషిత నీళ్ళే కారణమా...!

అంతుచిక్కని

అంతుచిక్కని చర్మవ్యాధులకు కలవరపడుతున్న జనాలు..!

కర్నూలు జిల్లా గొందిపర్లలో ఇందిరమ్మ కాలనీ తదితర గ్రామాల్లో ప్రజలకు అంతు చిక్కని చర్మ వ్యాధులు అధికమవుతున్నాయి. అసలే దేశంలో మంకీఫాక్స్ అనే మహమ్మారి ప్రజలను కలవర పెడుతున్న తరుణంలో ఇలాంటి వ్యాధులు రావడం జనాలను మరింత తీవ్రంగా భయపెడుతున్నాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Kurnool, India
    (T.Murali Krishna, News 18, Kurnool)

    కర్నూలు జిల్లా గొందిపర్లలో ఇందిరమ్మ కాలనీ తదితర గ్రామాల్లో ప్రజలకు అంతు చిక్కని చర్మ వ్యాధులు అధికమవుతున్నాయి. అసలే దేశంలో మంకీఫాక్స్ అనే మహమ్మారి ప్రజలను కలవర పెడుతున్న తరుణంలో ఇలాంటి వ్యాధులు రావడం జనాలను మరింత తీవ్రంగా భయపెడుతున్నాయి. డాక్టర్స్ మాత్రం ఇది నీరు కలుషితం కావడం ద్వారానే వస్తుంటాయి అని చెబుతున్నారు. మరి దీనికి కలుషిత నీరే కారణమా… అసలు నీళ్లు ఎందుకు కలుషితం అవుతున్నాయి దీనికి గల కారణాలు ఏంటి అని ప్రజల్లో ఒక ఆందోళన మొదలైంది.



    కళ్ళముందే తుంగభద్ర నది...!
    పవిత్ర తుంగభద్ర నది కళ్ళముందే కనిపిస్తున్నా… ఇక్కడ నివసించే ప్రజలు గుక్కేడు మంచినీళ్లు తాగలెనటువంటి పరిస్థితి. ఏళ్ళు గడుస్తున్నా కనీసం మంచి నీటి సదుపాయం కూడా కల్పించలేకపోతున్నారు. నాయకులు కేవలం ఎలక్షన్స్ టైంలో మాత్రమే… తమ గ్రామాలకు వచ్చి అవిస్తాం ఇవిస్తాం అంటూ కేవలం తమను ఓటు బ్యాంక్‌లా మాత్రమే వాడుకుంటున్నారని ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో సరైన మంచినీరు లేక డబ్బులు పెట్టి మరి తాగే నీళ్లు కొనుక్కోవాల్సిన దౌర్బాగ్య పరిస్థితి వచ్చిందని గ్రామస్తులు వాపోతున్నారు.

    అసలు నీళ్లు ఎందుకు కలుషితం అవుతున్నాయి…!
    కళ్ళ ముందే నీరున్నా కూడా తాగలేని పరిస్థితి. కర్నూలు తదితర ప్రాంతాలైన కొన్ని మున్సిపాలిటీలు నేరుగా డ్రైనేజీ వాటర్‌ను నదిలోకి వదలడం ఇంకో ప్రధానమైన కారణం. ఇక్కడ ఉన్న రసాయనిక పరిశ్రమలు, పరిశ్రమలోని వ్యర్థలను నేరుగా నదిలోకి వదలడం కూడా ఇందుకు కారణమని కాలనీవాసులు చెబుతున్నారు.

    ఆటకేక్కిన నీటి ట్యాంకర్ల శుభ్రత..!
    ఇక్కడ కాలనిలో దాదాపు 16 వందల మంది నివసిస్తుంటారు. ఇంతమంది జనాభాకు సరిపడేలా రెండు ఓవర్ హెడ్ ట్యాంక్‌లను నిర్మించారు. ట్యాంక్‌లను అయితే నిర్మించారు కానీ వాటి శుభ్రత మాత్రం విస్మరించారు. కనీసం ట్యాంక్ చుట్టు ఉండే పొదలను కూడా తీసేయకపోవడం, నీటిని శుద్ధి చేయకుండా వదలడంతో తీవ్ర అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి.

    కర్నూలు ప్రముఖ పారిశ్రామిక వెత మాజీ రాజ్యసభ సభ్యులు టీ.జి. వెంకటేష్ దత్తత గ్రామం అయినటువంటి గొందిపర్ల గ్రామపరిధిలో నేటికి కనీసం రోడ్లు, కాలువలు, కనీసం మంచినీటి సౌకర్యం లేకపోవడం ఏంటా అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. కనీసం మురికి కాలువలు లేక ఇళ్లల్లోని మురికి నీరంతా ఒకే చోట చేరడంతో టైఫాయిడ్, మలేరియా వంటి అనేక రోగాలు ప్రభలుతున్నాయంటూ గ్రామస్తులు మండిపడుతున్నారు.

    కొంతమంది పిల్లలకు, పెద్దలకు ఇక్కడి నీటి వల్ల అంతుచిక్కని చర్మవ్యాధులు వస్తున్నాయని..దీవిపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గడప గడపకు ప్రభుత్వం అంటూ వచ్చిన కోడుమూరు నియోజకవరగా ఎమ్మెల్యే సుధాకర్‌కు తమ గోడు చెప్పుకున్నా.. తొందరలోనే సమస్యను పరిస్కరిస్తాము అని చెప్పారే కానీ ఇంతవరకు ఎలాంటి చేర్యలు తీసుకోలేదని గ్రామస్తులు తెలిపారు. కర్నూలు పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న తమ గ్రామాలను ఎవరు పటించుకోవడం లేదని.. కనీసం ఇప్పటికైనా తమను పట్టించుకుని ఈ చర్మవ్యాధుల సమస్య పెద్దది కాకముందే నీటిని శుద్ధి చేయాలని కోరుతున్నారు.

    Read This; Vizag: సమస్యల్లో ఉన్నారా? ఒక్కసారి సంపత్ వినాయకుడ్ని దర్శించుకోండి..? ఎక్కడో తెలుసా?
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Andhrapradesh, Kurnool, Local News, VIRAL NEWS

    తదుపరి వార్తలు