Home /News /andhra-pradesh /

KURNOOL AN OLDEST BUILDING LIKE THE TAJMAHAL LOCATED IN KURNOOL MESMERIZING TO THE PEOPLE FULL DETAILS HERE PRN KNL NJ

Taj Mahal in AP: ఏపీలోనూ ఓ తాజ్ మహల్ ఉందని మీకు తెలుసా..? దాని హిస్టరీ ఇదే.. ఇంతకీ ఎక్కడుందంటే..!

ఏపీలో

ఏపీలో తాజ్ మహల్

మన ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లోనూ ఓ తాజ్ మహల్ (Taj Mahal) ఉందని మీకు తెలుసా..? అది ఎక్కడోకాదు మన కర్నూలు నగరంలోనే. తాజ్‌ మహల్‌ ఏంటి మన కర్నూలు (Kurnool) లో అనుకుంటున్నారా? మీరు చదివింది నిజమే..పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Kurnool, India
  Murali Krishna, News18, Kurnool

  ఆగ్రాలోని తాజ్‌మహల్‌ (Taj Mahal) పేరు తలుచుకుంటేనే ఏదో తెలియని మధురానుభూతి.. అలాంటిది మన ఆంధ్రప్రదేశ్‌లోనూ ఓ తాజ్ మహల్ ఉందని మీకు తెలుసా..? అది ఎక్కడోకాదు మన కర్నూలు (Kurnool) నగరంలోనే. తాజ్‌మహల్‌ ఏంటి మన కర్నూలులో అనుకుంటున్నారా? మీరు చదివింది నిజమే..పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..! గోల్‌ గుమ్మజ్‌… రాయలసీమలోని ఆకర్షణీయమైన చారిత్రక కట్టడాలలో ఒకటి. కర్నూలు నగరంలోని అతి పురాతన కట్టడం. హంద్రీ నది ఒడ్డున ఉస్మానియా కాలేజ్‌ పక్కన ఉన్న గోల్‌ గుమ్మజ్‌ నిర్మాణం ఇప్పుడు అందరినీ అబ్బురపరుస్తోంది. ఇది దేశంలోకెల్లా అతి పెద్ద గోల్‌ గుమ్మజ్‌గా పేరు గాంచింది. అగ్రాలోని తాజ్‌మహల్, బీజాపూర్‌లోని గోల్‌ గుమ్మజ్‌లను మించి ఈ కర్నూలులోని గోల్‌ గుమ్మాజ్‌ ఉంటుంది. 400 ఏళ్ల క్రితం నిర్మించినా ఇప్పటికీ చెక్కుచెదరలేదు.

  ఇండో ముస్లిం శిల్ప కళతో.. బీజాపూర్‌ వాస్తు నిర్మాణానికి ఈ గుమ్మాజ్ ఓ తార్కాణం. హంద్రీనది ఒడ్డున విశాలమైన ప్రాంగణంలో రెండు గుమ్మటాలు కలిగినటువంటి గుమ్మజ్‌ను నిర్మించారని ప్రొఫెసర్ అన్వర్‌ హుస్సేన్‌ తెలిపారు. 1618-26 మధ్య కాలంలో ఈ గుమ్మజ్‌ నిర్మాణం జరిగి ఉంటుందన్నారు. ఈ అతిపెద్ద గోల్‌ గుమ్మజ్‌ నిర్మించడం వెనక ఆనాటి కళా వైభవం కనిపిస్తుంది. రాయిరాయి అమర్చి కట్టిన ఈ గుమ్మజ్‌ను 1958వ సంవత్సరంలో పురావస్తు శాఖ స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని టూరిస్ట్‌ ప్లేస్‌గా అభివృద్ధి పరిచేందుకు జిల్లా అధికారులు కృషి చేస్తున్నారు.

  ఇది చదవండి: మనం తేళ్లను చూస్తే పారిపోతాం.. కాని వారికి మాత్రం అవి దైవంతో సమానం.. ఏపీలో విచిత్ర ఆచారం..


  గోల్‌ గుమ్మాజ్‌ చరిత్ర..!
  కర్నూలును 17 వ శతాబ్దంలో పరిపాలించిన వారిలో నవాబ్ అబ్దుల్ వహాబ్ ఖాన్ ఒకడు. ఇతను 16 ఏళ్ల పాటు నవాబుగా కర్నూలును పరిపాలించాడు. 1619-20లో బీజాపూర్ సుల్తానుల గవర్నర్ అయిన అబ్దుల్ వహాబ్ ఖాన్, విజయనగర సామ్రాజ్యపు సామంత రాజైన ఆరవీటి గోపాలరాజు మధ్య యుద్ధం జరిగింది.

  ఇది చదవండి: అక్కడ దొరకని పుస్తకమంటూ ఉండదు.. నాలెడ్జ్ కు కేరాఫ్ అడ్రస్ ఆ లైబ్రరీ.. ఏపీలో ఎక్కడుందంటే..!


  గోపాలరాజు తన బంధువులైన ఆనెగొంది, గండికోట, అవుకు, పెనుగొండ రాజుల సహాయంతో వహాబ్ ఖాన్‌ను తిప్పి కొట్టాడు. వహాబ్ ఖాన్ కర్నూలు కోటను ఆక్రమించే తొలి ప్రయత్నంలో విఫలం చెందాడు. వహాబ్ ఖాన్ 1624లో రెండవసారి దండయాత్ర చేశాడు. ఈసారి గోపాలరాజు తన బంధువుల నుండి ఏ సహాయాన్ని పొందలేకపోయాడు. ఒంటరిగా పోరాడి పరాజయం పాలయ్యాడు. వహాబ్ ఖాన్ కర్నూలును వశపరచుకున్నాడు. బీజాపూరు సుల్తాను, రెండవ ఇబ్రహీం ఆదిల్ షా, ఈ విజయానికి కానుకగా వహాబ్ ఖాన్‌ను కర్నూలు నవాబుగా ప్రకటించాడు.

  ఇది చదవండి: చూడ్డానికి పాత ఆటోలా కనిపిస్తుందా..! కానీ లోపల చూస్తే వారెవ్వా అనాల్సిందే..!


  అబ్దుల్ వహాబ్ ఖాన్ పాలనలో రాజ్యము ఆధిపత్య స్థానాన్ని పొంది, ఆంధ్ర ప్రాంతము మొట్టమొదటి రాజధానిగా, రాయలసీమకు సింహ ధ్వారంగా భాసిల్లినంది. కర్నూలు నగరాన్ని కూడా అభివృద్ధి చేసినట్టు చెబుతారు. కర్నూలు ప్రధానవీధిలోని ఆర్చితో గల అంగళ్ళను అబ్దుల్ వహాబ్ ఖాన్ కట్టినట్లు చరిత్రకారులు చెబుతారు.

  ఇది చదవండి: అందంగా ఉందని ఈ మొక్కను పెంచుతున్నారా..?  అయితే డేంజరే..!


  అయితే ఇంతటి ఘనత ఉన్న వహాబ్‌ ఖాన్‌ సమాధిని హంద్రీ నది ఒడ్డున క్రీ.శ. 1620వ సంవత్సరంలో నిర్మించారు. 1618లో వహాబ్ మరణానంతరం దీన్ని నిర్మించారు. ఇది బీజాపూర్‌లోని ఇబ్రహీం రౌజా సమాధిని పోలి ఉంటుంది. ఈ సమాధి చతురస్రాకారంలో ఉండి, చుట్టూరా నడవా కలిగి ఉండి, భారీ గుమ్మటపు కప్పుతో ప్రతి మూల వద్ద ఛత్రమును కలిగి ఉంటుంది. ఇది నల్ల రాయి గ్రానైట్‌, సున్నపురాయితో నిర్మాణం చేయబడి వివిధ రేఖాకారపు చెక్కడములతో శోభిల్లుతూ ఉంటుంది.

  ఇది చదవండి: రెస్టారెంట్‌ రెసిపీలు మొబైల్‌ క్యాంటీన్‌లో..! ఫుడీ మాంక్‌కు క్యూ కడుతున్న ఫుడ్ లవర్స్..


  ఉస్మానియా కళాశాల సమీపంలో ఉన్న ఈ సమాధినే… గోల్ గుమ్మజ్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది బీజాపూర్‌లోని గోల్ గుమ్మాజ్‌ను పోలి ఉంటుంది. గోల్ గుమ్మాజ్‌ ఇప్పటికీ ప్రత్యేకమైన స్థానం ఉంది. బీజాపూర్ సాయుధ దళం యొక్క సైనిక అధికారి మరియు కర్నూలు మొదటి ముస్లిం నాయకుడు అబ్దుల్ వహాబ్ సమాధి. విస్తృతమైన పనితనం, రెండు గంభీరమైన గోపురాలు, వరండాలు, తోరణాలు మరియు స్మారక చిహ్నం. కర్నూలు మొదటి నవాబ్ అబ్దుల్ వహాబ్ ఖాన్ మరణం తరువాత ఈ సమాధిని నిర్మించారు. అయితే ఇటీవల దీన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమాధి చుట్టూ అందమైన ఉద్యానవనం, పచ్చని చెట్లు… చల్లనైన వాతావరణంలో పక్కన నది పరవళ్లు…ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందడానికి ప్రత్యేక స్పాట్‌లైట్‌ను కూడా ఏర్పాటుచేశారు.

  ఇది చదవండి: బొప్పాయి జ్యూస్ తో మటన్ కబాబ్స్..! ఇలాంటి టేస్ట్ లైఫ్ లో దొరకదేమో..!


  సందర్శించు వేళలు
  8:00 AM - 6:00 PM సమయాలలో సందర్శించవచ్చు. ప్రవేశ రుసుము అవసరం లేదు. వారం రోజుల పాటు తెరిచే ఉంటుంది.

  అడ్రస్‌ : గోల్ గుమ్మజ్‌, ఉస్మానియా కాలేజ్‌ దగ్గరలో, కర్నూలు, ఆంధ్రప్రదేశ్‌- 518001.

  Gol Gumbaz Kurnool Map

  ఎలా వెళ్లాలి.?
  కర్నూలు బస్టాండ్‌ నుంచి ఉస్మానియా కాలేజ్‌ రోడ్‌ద వరకు లోకల్ ఆటోలు అందుబాటులో ఉంటాయి. ఉస్మానియా కాలేజ్‌ దగ్గరలోనే ఈ గోల్ గుమ్మజ్‌ ఉంటుంది.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Kurnool, Local News

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు