T. Murali Krishna, News18, Kurnool
పుణ్యక్షేత్రాన్ని పెళ్లి స్వామిని దర్శించుకోవాలని రోడ్డు మార్గంలో వాహనాలు వేగంగా నడిపితే ప్రాణాలు పోతాయి జాగ్రత్త. కైలాసానికి రహదారి ప్రమాదకరమైన మలుపుల నడుమ శ్రీశైలం పుణ్యక్షేత్రానికి రోడ్డు మార్గం...
నంద్యాల జిల్లా శ్రీ శైలం పుణ్యక్షేత్రం భక్తుల రద్ది కొనసాగుతూనే ఉంది. కార్తీకమాసం పూర్తి అయినా కూడా శ్రీ శైలం క్షేత్రానికి భక్తులు రావడం ఏమాత్రం తగ్గడం లేదు. ఈనేపథ్యంలో నంద్యాల జిల్లా శ్రీ శైలం పుణ్యక్షేత్రం వెళ్లే మార్గాలు భయంకరంగా మారాయి. నంద్యాల జిల్లా ఆత్మకూరు నుంచి దోర్నాల వరకు సుమారు 50 కిలోమీటర్ల మేర అడవి ప్రాంతం కావడంతో అందులోనూ సింగిల్ లైన్ రోడ్డు కావడంతో పుణ్యక్షేత్రానికి వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగాదోర్నాల నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి సుమారు 40 ఐదు కిలోమీటర్ల దూరం రహదారి యమపురి తలపించే విధంగా ఎత్తైన కొండ ప్రాంతం సరైన రోడ్డు భద్రత లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలోనే కార్తీక మాసం ముగింపు సందర్భంగా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తడంతో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కార్తీకమాసం పూర్తయినా సరే భక్తుల రద్దీ మాత్రం నిత్యం కొనసాగుతూనే ఉంది. రెండు రోజుల క్రితందోర్నాల నుంచి శ్రీశైలంవెళ్లే రోడ్డు మార్గంలో రెండు ఆర్టీసీ బస్సులో ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి.
దీంతో దీంతో శ్రీశైలం రోడ్డు మార్గంలో సుమారు నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శ్రీశైలం వైపు నుంచి వస్తున్నటువంటి కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సు అలాగే ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు మలుపు వద్ద ఎదురుగా వెళ్లి ఒక దానికి ఒకటి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.రోడ్డుకు ఇరువైపులా ఒకవైపు కొండ మరొకవైపు లోయ ఉండడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి ఇకనైనా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు దీనిపై దృష్టి ఉంచి రోడ్డు భద్రత చర్యలు చేపట్టాలని పర్యాటకులు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool, Local News, Road accident, Srisailam